...
...
Next Story

సంక్రాంతి సినిమాల కష్టాలు.. అటు కోర్టు కేసులు.. ఇటు ప్రమోషన్లు.. ఏ మూవీ పరిస్థితి ఎలా ఉందంటే?

సంక్రాంతి 2026 సినిమాల రిలీజ్ టైమ్ దగ్గరపడుతోంది. ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటింశాయి. కానీ విడుదల తేదీలు దగ్గర పడుతున్నా కొద్దీ ఈ సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. కొన్ని కోర్టు కేసులతో, మరికొన్ని ప్రమోషన్ కష్టాలతో ఉన్నాయి.

Published on: Jan 7, 2026, 12:44:34 IST
Advertisement

కొత్త సినిమాలతో సంక్రాంతికి సినీ లవర్స్ కు నిజమైన పండగ వస్తుంది. 2026 సంక్రాంతికి కూడా భారీ స్థాయిలో సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ నుంచి శర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి వరకు తమిళ డబ్బింగ్ కూడా కలుపుకొని ఏడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటికి రిలీజ్ కష్టాలు తప్పడం లేదు.

కోర్టు కేసు

సంక్రాంతి సినిమాల కష్టాలు
సంక్రాంతి సినిమాల కష్టాలు

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ మూవీ జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంకా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రాకపోవడంతో ఈ సినిమా మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ రోజు తీర్పు వచ్చే అవకాశముంది.

టికెట్ రేట్ల పెంపు కోసం

మరోవైపు చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’, ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘రాజా సాబ్’ సినిమాలు కూడా కోర్టుకు వెళ్లాయి. తమ టికెట్ల రేట్లను పెంచుకునేందుకు, ప్రీమియర్ షోలకు అనుమతించాలని తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై కూడా ఈ రోజే (జనవరి 7) విచారణ జరగనుంది. ఇందులో రాజా సాబ్ జనవరి 9న, మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న రిలీజ్ కాబోతున్నాయి.

తెలుగులో లేనట్లేనా?

శివ కార్తికేయన్ సినిమా ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి 2026 రేసులో నిలిచింది. ఈ తమిళ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజైంది. అయితే తెలుగులో మాత్రం ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ మూవీ తెలుగు రిలీజ్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో శ్రీలీల హీరోయిన్.

చప్పుడు లేదు

మరోవైపు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ ఇంకా ట్రైలర్ రిలీజ్ కాలేదు. నారీ నారీ నడుమ మురారీ మూవీ సంగతి కూడా అంతే. మరి ఈ సంక్రాంతికి అనుకున్నట్లుగానే అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయా? ఏదైనా లాస్ట్ మినిట్ లో రేసు నుంచి తప్పుకుంటుందా? అన్నది చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks