Sara Ali Khan Rakul Preet Singh In Pati Patni Aur Woh 2 Trailer Launch: బాలీవుడ్ హీరోయిన్, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'పతి పత్ని ఔర్ వో 2'. ఈ సినిమాలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా చేస్తే.. సారాతోపాటు రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి హీరోయిన్స్‌గా నటించారు. ప్రస్తుతం వీరంతా పతి పత్ని ఔర్ వో 2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
పతి పత్ని ఔర్ వో 2 ట్రైలర్ లాంచ్

ఈ క్రమంలోనే శనివారం (మే 2) ముంబైలో గ్రాండ్‌గా జరిగిన పతి పత్ని ఔర్ వో 2 ట్రైలర్ లాంచ్ వేడుకకు ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బితో కలిసి సారా అలీ ఖాన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న హోస్ట్ (MC) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. "మీరు సెలబ్రిటీల వెనుక వైపు (Backshot) చూపిస్తూ ఎవరో గుర్తుపట్టండి అని రీల్స్ పెడుతుంటారు కదా.. నేను అబద్ధం చెప్పడం లేదు, సెలబ్రిటీలు (హీరోయిన్స్) అందిరిని నేను బ్యాక్ నుంచి బాగా గుర్తుపట్టగలను. నేను ఎక్కువగా అదే పనిలో ఉంటాను. ముందు నుంచి గుర్తుపడతానో లేదో తెలీదు కానీ.." అంటూ సదరు హోస్ట్ డబుల్ మీనింగ్ వచ్చేలా జోకులు వేశారు.
సారా రియాక్షన్ వైరల్
హోస్ట్ బూతు జోకులు విన్న సారా అలీ ఖాన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించింది. పక్కనే కూర్చున్న ఆయుష్మాన్ ఖురానా వైపు చూస్తూ.. "అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడు?" అని ఆశ్చర్యపోయారు సారా. పక్కనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ మాటలకు ఇబ్బందిగా ఫీల్ అయినట్లు ఆమె హావభావాలు చూస్తే అర్థమవుతోంది.
కానీ, సారా అలీ ఖాన్‌లా కాకూండా రకుల్ ప్రీత్ సింగ్ కాస్తా నవ్వింది. అయితే, సాధారణంగా ఇలాంటి ఈవెంట్లలో ఫన్ ఉండాలి కానీ, మహిళా నటీమణులు ఉన్న వేదికపై ఇంత పచ్చిగా మాట్లాడటం సరికాదని సారా అలీ ఖాన్ భావించినట్లు తెలుస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
నెటిజన్ల ఆగ్రహం
{{/usCountry}}కానీ, సారా అలీ ఖాన్‌లా కాకూండా రకుల్ ప్రీత్ సింగ్ కాస్తా నవ్వింది. అయితే, సాధారణంగా ఇలాంటి ఈవెంట్లలో ఫన్ ఉండాలి కానీ, మహిళా నటీమణులు ఉన్న వేదికపై ఇంత పచ్చిగా మాట్లాడటం సరికాదని సారా అలీ ఖాన్ భావించినట్లు తెలుస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
నెటిజన్ల ఆగ్రహం
{{/usCountry}}ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు హోస్ట్ తీరుపై విరుచుకుపడుతున్నారు. "ఇది కామెడీ కాదు, పచ్చి బేషరమ్ (సిగ్గులేకపోవడం)" అని ఒకరు కామెంట్ చేయగా.. "అక్కడ కూర్చున్న వారు అతడిని ఆపకుండా నవ్వుతూ ఎలా చూడగలుగుతున్నారు?" అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. స్టాండప్ కామెడీ పేరుతో అసభ్యతను పెంచి పోషిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
'పతి పత్ని ఔర్ వో 2' విశేషాలు
ఇదిలా ఉంటే, 2019లో కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చిన 'పతి పత్ని ఔర్ వో' చిత్రానికి ఈ మూవీ సీక్వెల్. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని టీ-సిరీస్ నిర్మించింది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా పతి పత్ని ఔర్ వో 2 సినిమా మే 15, 2026న థియేటర్లలోకి రానుంది.
పెళ్లయిన పురుషుల బుద్ధి
పెళ్లయిన పురుషుల బుద్ధి ఎప్పటికీ మారదని, వారు ప్రేమ వలయంలో ఎలా చిక్కుకుంటారనే అంశాన్ని వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించనున్నారు.