Scam 2010 OTT Release First Look Out: ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న భారతీయ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ డ్రామా ఫ్రాంచైజీ 'స్కామ్' కొత్త సీజన్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది. 'స్కామ్ 1992', 'స్కామ్ 2003' ఓటీటీ సిరీస్‌ల ఘన విజయం తర్వాత, ఇప్పుడు 'స్కామ్ 2010' చిత్రీకరణను నిర్మాతలు అధికారికంగా ప్రారంభించారు.
చిన్న మొత్తాల పొదుపు పథకాల కుంభకోణం

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, బిర్లా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV)లో త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి ప్రారంభమై, దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సామ్రాజ్యంగా ఎదిగిన ఒక వ్యక్తి ప్రయాణం, ఆ తర్వాత అతను ఎదుర్కొన్న చట్టపరమైన చిక్కుల నేపథ్యంలో ఈ ఓటీటీ సిరీస్ సాగనుంది. ఇటీవలే ఈ స్కామ్ 2010 నుంచి విడుదల చేసిన నటుడు సిద్ధార్థ్ బోడ్కే ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
అత్యాశ, అధికారాల కలయికే ఈ కథ
ఈ ఫైనాన్షియల్ క్రైమ్ డ్రామా సిరీస్ గురించి దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ.. ఆర్థిక సామ్రాజ్యాల వెనుక ఉండే అసలు నిజాలను ఈ సిరీస్‌లో చూపించబోతున్నామని తెలిపారు.
"స్కామ్ 2010 అనేది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. మహాదశ, అధికారం, దానివల్ల వచ్చే అహంకారం చుట్టూ తిరిగే కథ. నమ్మకమే పునాదిగా నిర్మించిన ఒక సామ్రాజ్యం.. ఆ నమ్మకం సడలినప్పుడు ఎలా కుప్పకూలిందో ఇందులో చూపిస్తున్నాం. తను అమరుడనని భ్రమపడిన ఒక వ్యక్తి పతనాన్ని ఇది కళ్లకు కడుతుంది" అని హన్సల్ మెహతా పేర్కొన్నారు.
'స్కామ్' చరిత్రను తిరగరాసిన ఘనత
{{/usCountry}}"స్కామ్ 2010 అనేది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. మహాదశ, అధికారం, దానివల్ల వచ్చే అహంకారం చుట్టూ తిరిగే కథ. నమ్మకమే పునాదిగా నిర్మించిన ఒక సామ్రాజ్యం.. ఆ నమ్మకం సడలినప్పుడు ఎలా కుప్పకూలిందో ఇందులో చూపిస్తున్నాం. తను అమరుడనని భ్రమపడిన ఒక వ్యక్తి పతనాన్ని ఇది కళ్లకు కడుతుంది" అని హన్సల్ మెహతా పేర్కొన్నారు.
'స్కామ్' చరిత్రను తిరగరాసిన ఘనత
{{/usCountry}}మన దేశంలో ఓటీటీ కంటెంట్‌కు ఒక కొత్త ఊపు తెచ్చిన సిరీస్‌లలో 'స్కామ్ 1992' అగ్రస్థానంలో నిలుస్తుంది. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆధారంగా వచ్చిన ఆ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 'స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ' కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.
అదే నమ్మకంతో ఇప్పుడు 'స్కామ్ 2010' ప్రాజెక్టును మరింత భారీగా ప్లాన్ చేశామని ఆప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ దీపక్ సెగల్ తెలిపారు.
హన్సల్ మెహతా రీ-ఎంట్రీతో
"భారతీయ ఓటీటీ రంగం తన ఉనికిని వెతుక్కుంటున్న సమయంలో వచ్చిన 'స్కామ్ 1992' ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. భారతదేశ చరిత్రలో అధికారం, మానవ నైజాలు ఘర్షణ పడే అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. హన్సల్ మెహతా రీ-ఎంట్రీతో ఈ కొత్త సీజన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది" అని దీపక్ సెగల్ నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సిరీస్‌లో కీలకమైన కథానాయకుడి పాత్రను పోషిస్తున్న నటుడు సిద్ధార్థ్ బోడ్కే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంక్లిష్టమైన మనస్తత్వం, ఎత్తుపల్లాలు ఉన్న పాత్రలో నటించడం తనకు లభించిన గొప్ప అవకాశమని చెప్పారు.
విభిన్న కోణాలు, కథ పరిధి
"ఈ పాత్రలో ఉన్న విభిన్న కోణాలు, కథ పరిధి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక వ్యక్తి ఆశయం, అతను సాధించిన విజయం, ఆపై చవిచూసిన పతనం.. ఇవన్నీ ఒక నటుడిగా నన్ను ఎంతగానో ఉత్సాహపరిచాయి. హన్సల్ మెహతా వంటి దిగ్గజ దర్శకుడి మార్గదర్శకత్వంలో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి" అని సిద్ధార్థ్ బోడ్కే తెలిపారు.
స్కామ్ 2010 ఓటీటీ రిలీజ్
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సిరీస్ త్వరలోనే సోనీ లివ్ ఓటీటీ ద్వారా వీక్షకుల ముందుకు రానుంది. అంటే, స్కామ్ 1992, స్కామ్ 2003 తరహాలోనే స్కామ్ 2010 సోన్ లివ్‌లో ఓటీటీ రిలీజ్ అవనుంది. మరి ఈ ఓటీటీ సిరీస్ ఏ మేరకు ఆదరిస్తుందో చూడాలి.