Secret Soldier Trailer Launch Event: తెలుగులో వస్తున్న సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా సీక్రెట్ సోల్జర్. ఈ సినిమాలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా చేశారు. సీక్రెట్ సోల్జర్ సినిమాకు అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
సీక్రెట్ సోల్జర్ ఇతర నటీనటులు

మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన సీక్రెట్ సోల్జర్ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక సెప్టెంబర్ 18న సీక్రెట్ సోల్జర్ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సీక్రెట్ సోల్జర్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌లో కష్టం కనిపించింది
సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సూర్య శ్రీనివాస్ ‘హిట్ 3’ మూవీ సమయంలో ఈ సినిమా గురించి చెబుతూ ఉండేవారు. నాకు ఈ ట్రైలర్ చాలా నచ్చింది. ట్రైలర్‌లో కష్టం కనిపించింది. చాలా కష్టపడి సినిమాను తీశారు అనే ఫీలింగ్‌ను ట్రైలర్ కలిగించింది" అని అన్నారు.
"ఇదే క్వాలిటీ సినిమాలో ఉంటే మాత్రం కచ్చితంగా తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. అద్భుతమైన రైటింగ్‌తో తీస్తే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆడియన్స్ చూస్తారు. నిహాల్ చాలా ఇంటెన్సిటీతో కనిపించాడు. శ్రీనివాస్ నాకు ‘హిట్ 3’ సినిమా నుంచి తెలుసు. ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు. ఇద్దరూ కూడా చాలా హార్డ్ వర్క్‌తో ఈ సినిమా చేశారని అనిపిస్తుంది" అని శైలేషు కొలను తెలిపారు.
సెన్సార్‌లోనే 8 నెలలు ఉందని
"కచ్చితంగా ప్రేక్షకులు వాళ్లను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 18న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఇది బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా. డైరెక్టర్ విశ్వనాథ్ గారికి కంగ్రాచులేషన్స్. ఆల్ ది వెరీ బెస్ట్" అని శైలేష్ కొలను చెప్పారు.
{{/usCountry}}"కచ్చితంగా ప్రేక్షకులు వాళ్లను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 18న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఇది బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా. డైరెక్టర్ విశ్వనాథ్ గారికి కంగ్రాచులేషన్స్. ఆల్ ది వెరీ బెస్ట్" అని శైలేష్ కొలను చెప్పారు.
{{/usCountry}}రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ.. "సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమా సెన్సార్‌లోనే 8 నెలల పాటు ఉందని విన్నాను. కచ్చితంగా అందరికీ నచ్చడం వల్లే సెన్సార్ నుంచి బయటకు వచ్చింది" అని అన్నారు.
డబ్బులన్నీ ఖర్చుపెట్టి తీశారు
"నిర్మాత ఈ సినిమాకి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టి తీశారు. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది ఆయనకి. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధించి, ఆయన మరో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. కాలభైరవ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా మంచి స్ట్రాంగ్ టీమ్‌తో వస్తున్నారు. సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని బీవీఎస్ రవి ఆకాంక్షించారు.
నటుడు కమల్ కామరాజు మాట్లాడుతూ.. "డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు నాకు చాలా సర్‌ప్రైజ్‌గా అనిపించింది. చాలా పెద్ద స్కేల్‌లో తీసే కథ ఇది. తెలుగులో ఇలాంటి సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు ఆడితే కొత్త ప్రొడ్యూసర్స్‌కు, డైరెక్టర్స్‌కు హోప్ వస్తుంది. సినిమాని థియేటర్లలో ఎంజాయ్ చేయండి" అని తెలిపారు.