తెలుగులో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ రోడ్ ట్రావెల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ సీతా పయనం. ఈ సినిమాలో హీరోయిన్‌గా తన కూతురు ఐశ్వర్య అర్జున్‌ను పరిచయం చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

నిరంజన్ హీరోగా చేసిన ఈ సినిమాను శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కించారు. వాలంటైన్స్ డే కానుకగా ఇవాళ (ఫిబ్రవరి 14) సీతా పయనం మూవీ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?, అర్జున్ దర్శకత్వం, హీరో కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా మెప్పించిందా? లేదా? అనేది నేటి సీతా పయనం రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సీత (ఐశ్వర్య అర్జున్) తండ్రి రాజేంద్ర ప్రసాద్ (సత్య రాజ్) లోకంగా జీవిస్తుంది. రాజేంద్ర ప్రసాద్‌కి కూడా కూతురంటే ప్రాణం. కూతురికి పెళ్లి చేయాలని రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాడు. కానీ, సీతకు మాత్రం పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. పెళ్లి టాపిక్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేసేస్తుంటుంది.
అలాంటి సీత ఓ సారి వర్క్ షాప్ నిమిత్తం సొంత సిటీ అయిన వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఈ ప్రయాణంలో సీతకు ఎదురైన అనుభవాలు ఏంటి? ఈ జర్నీలో కలిసిన అభి (నిరంజన్) పాత్ర ఏంటి?, ఈ ప్రయాణంలో గిరి (అర్జున్ సర్జా), బసవన్న (ధృవ్ సర్జా) ప్రాధాన్యం ఏంటి? అసలు ఈ ప్రయాణంలో సీత జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది తెలియాలంటే ఈ సీతా పయనం చూడాల్సిందే.
విశ్లేషణ:
సీతా పయనం ఒక రోడ్ జర్నీ ఫ్యామిలీ డ్రామా సినిమా. కుటుంబ విలువలు గురించి చాటి చెప్పే సినిమా ఇది. అయితే, కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. కానీ, డైరెక్టర్‌గా అర్జున్ సర్జా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. తన కూతురు కోసం అన్నట్లుగా సీత పాత్రను రాశారు హీరో అర్జున్ సర్జా.
{{/usCountry}}సీతా పయనం ఒక రోడ్ జర్నీ ఫ్యామిలీ డ్రామా సినిమా. కుటుంబ విలువలు గురించి చాటి చెప్పే సినిమా ఇది. అయితే, కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. కానీ, డైరెక్టర్‌గా అర్జున్ సర్జా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. తన కూతురు కోసం అన్నట్లుగా సీత పాత్రను రాశారు హీరో అర్జున్ సర్జా.
{{/usCountry}}సినిమాలో సీత పాత్రకు పెట్టిన లక్షణాలు, గుణ గణాలు చాలా వరకు హైందవ ధర్మానికి ప్రతీకగా ఉండేలా చూసుకున్నారు. ఆ పాత్రకు తగినట్లుగానే ఐశ్వర్య అర్జున్ మెప్పించారు. సినిమాలో ప్రేమ, పెళ్లి, విడాకులు వంటి అంశాలను గొప్పగా చూపించారు.
తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండాలి.. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎంత సంస్కారంతో పెద్ద చేయాలి.. పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి అనే ఇలాంటి ఎన్నో మంచి విషయాల్ని అర్జున్ చెప్పే ప్రయత్నం చేశాడు.
ఆకట్టుకునే సీన్స్
సీత తన ప్రయాణంతో కథ గాడిలో పడుతుంది. ఆ తర్వాత అభి పరిచయం, లిఫ్ట్ ఇవ్వడం, ఇద్దరి మధ్య సంభాషణలు అన్ని బోర్ తెప్పించకుండా తెరకెక్కించారు. అయితే, పెద్దగా ట్విస్టులు ఉండగా సాఫీగా సినిమా సాగుతుంటుంది. గిరి, బసవన్న పాత్రల ఎంట్రీతో కొత్త మూడ్‌లోకి వెళ్లిపోతాం.
గో రక్షణ గురించి పెట్టిన ఎపిసోడ్ ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది. మూగ జీవాల గురించి చెప్పిన తీరు.. బతకడం గురించి రాసిన డైలాగ్స్.. బంధాలు, ప్రేమల గురించి చెప్పిన విధానం మెప్పిస్తుంది. ప్రతీ చోటా ఏదో ఒక సందేశాన్ని, విలువని ఈ తరానికి చెప్పాలనే తన తపన, ప్రయత్నాన్ని ప్రేక్షకులకు చూపించారు అర్జున్.
ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే గుండెల్ని హత్తుకుంటుంది. ఇలాంటి పిల్లలు, తండ్రులు సమాజానికి అవసరం అన్నట్టుగా ఆ పాత్రల్ని మలిచారు అర్జున్. మాస్ యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ ఇలాంటి ఓ ఫీల్ గుడ్, విలువలతో కూడిన కుటుంబ కథని తీయడం ప్రశంసనీయం. ఎక్కడా కూడా అశ్లీలతకి తావు లేకుండా ఫ్యామిలీ చూసేలా తెరకెక్కించారు.
ఒకరికొకరి గిఫ్ట్
ఇక సీత పాత్రలో ఎంతో అందంగా ఒదిగిపోయింది ఐశ్వర్య అర్జున్. ఆ పాత్రలో జీవిస్తూ హీరోయిన్‌గా మంచి డెబ్యూ పర్మామెన్స్ ఇచ్చింది. మంచి పాత్రతో కూతురుకు అర్జున్ బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే, తన నటనతో తండ్రికి మంచి బహుమతిని ఐశ్వర్య ఇచ్చారనుకోవచ్చు. ఆమె తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. కానీ, ఇంకాస్తా కేర్ తీసుకోవాల్సింది.
ఇక నిరంజన్ కూడా తన పాత్ర మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. ఎంతో సెటిల్డ్‌గా కనిపించి మెప్పించాడు. ప్రకాష్ రాజ్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. సత్య రాజ్ కూడా తండ్రిగా అందరినీ ఆకట్టుకున్నారు. అర్జున్ సర్జా, ధృవ్ సర్జా స్పెషల్ ఎంట్రీలు అదిరిపోతాయి. మిగిలిన పాత్రల్లో బిత్తిరి సత్తి, కోవై సరళ, బిగ్ బాస్ సిరి హనుమంత్ ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఫైనల్‌గా చెప్పాలంటే
అలాగే, అనూప్ రూబెన్స్ పాటలు, బీజీఎమ్ ఆకట్టుకుంటాయి. విజువల్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. డైలాగ్స్ ఆలోచింపజేసేలా మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే కుటుంబ విలువలు, అమ్మాయిలు, వారి ప్రయాణం ఎలా ఉండాలో చెప్పే సినిమానే సీతా పయనం.