చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Anupam Kher Google: గూగుల్‌పై కేసు వేయాలి- సొంతిల్లు కంటే అద్దె ఇంట్లోనే ప్రశాంతత : ఫౌజీ నటుడు అనుపమ్ ఖేర్ కామెంట్స్
Anupam Kher On Google 500 Cr Net Worth Rumours: బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, ఆయన భార్య కిరణ్ ఖేర్ ఆస్తుల విలువ రూ.400 నుంచి రూ.500 కోట్లు ఉంటుందంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై 71 ఏళ్ల అనుపమ్ ఖేర్ తాజాగా ఘాటుగా స్పందించారు. అందులో పది శాతం ఆస్తులు కూడా ఉండవన్నారు.
Anupam Kher On Google 500 Cr Net Worth Rumours: భారతీయ సినీ పరిశ్రమలో 540కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. భారీ పారితోషికం తీసుకునే అగ్ర నటుల్లో ఒకరిగా పేరున్నప్పటికీ, ఆయన నేటికీ ముంబైలో ఓ అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు.

అయితే ఇటీవల అనుపమ్ ఖేర్, ఆయన భార్య, నటి, ఎంపీ కిరణ్ ఖేర్ నికర ఆస్తుల విలువ (Net Worth) రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు ఉంటుందంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై 71 ఏళ్ల అనుపమ్ ఖేర్ తాజాగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'గూగుల్‌పై కేసు వేయాలనిపిస్తోంది'
ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రంలో జటాయువు పాత్రకు గాత్రదానం చేస్తున్న అనుపమ్ ఖేర్.. తాజాగా 'ది అన్ఫిల్టర్డ్ అవర్' (The Unfiltered Hour) పాడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన ఆస్తుల గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం అపోహలు మాత్రమేనని కొట్టిపారేశారు.
"ఇంటర్నెట్లో వచ్చే ఈ వార్తలు చూసి నన్ను చాలా పెద్ద ధనవంతుడిగా జనం అనుకుంటున్నారు. గూగుల్‌లో నా నెట్ వర్త్ ఎంతో వెతికితే మీరే ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు గూగుల్ మీద కేసు వేయాలన్నంత కోపం వస్తుంది. అక్కడ చూపిస్తున్న రూ.400-500 కోట్లలో నా దగ్గర కనీసం 10 శాతం ఆస్తి కూడా లేదు" అని అనుపమ్ ఖేర్ అసహనం వ్యక్తం చేశారు.
గూగుల్‌లో ఈ లెక్కలు చూసిన తన స్నేహితులు, అందులో కొంత డబ్బు తమకు పంపాలంటూ సరదాగా ఆటపట్టిస్తుంటారని అనుపమ్ ఖేర్ నవ్వుతూ చెప్పారు. సొంత ఇల్లు కొనుక్కోవడం కంటే అద్దె ఇంట్లో ఉండటమే తనకు మానసిక ప్రశాంతతను ఇస్తుందని అనుపమ్ ఖేర్ వెల్లడించారు. పదేళ్ల క్రితమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అద్దె ఇంటికే ఓటు.. ఆలియా భట్‌కు పాత ఇల్లు అమ్మకం
"సొంత ఇల్లు కాకుండా అద్దె అపార్ట్మెంట్లో ఉండాలని నిర్ణయించుకున్న రోజునే నేను నిజమైన స్వేచ్ఛ పొందాను. ఆస్తులకు సంబంధించిన ఎలాంటి ఒత్తిడి నాకు లేదు. కేవలం సిమ్లాలో మా అమ్మ కోసం మాత్రమే ఒక ఇల్లు కొన్నాను. నేను, నా సోదరుడు ఇద్దరం అద్దె ఇళ్లలోనే ఉంటూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం" అని అనుపమ్ ఖేర్ వివరించారు.
గతంలో ముంబైలో తనకు ఒక సొంత ఇల్లు ఉండేదని, దానిని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌కు విక్రయించినట్లు అనుపమ్ గుర్తుచేసుకున్నారు. "మన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేనప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన వ్యక్తిగా అనిపిస్తుంది. పైగా ఏ ఒత్తిడీ ఉండదు. నా పాత ఇంటిని ఆలియా భట్‌కు అమ్మేశాక మేము మరో ఇంటికి మారాం. సరిగ్గా అదే సమయంలో కిరణ్ ఖేర్ ఎంపీగా గెలిచి చండీగఢ్ వెళ్లిపోయారు. అప్పుడు కొత్త ఇల్లు వెతుకుతున్న క్రమంలో, సొంత ఇల్లు కొనే బదులు అద్దె ఇంట్లోనే హాయిగా ఉండొచ్చనే ఆలోచన తట్టింది" అని అనుపమ్ పేర్కొన్నారు.
ప్రభాస్ 'ఫౌజీ' సహా చేతిలో 6 భారీ ప్రాజెక్టులు
ఇదిలా ఉంటే, కెరీర్ పరంగా 71 ఏళ్ల వయసులోనూ అనుపమ్ ఖేర్ యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కార్తికేయ 2' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆయన.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ కీలక ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మొత్తం 6 సినిమాలు ఉన్నాయి.
సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో ఆయన నటించిన 'యే ప్రేమ్ మోల్ లియా హై' ఈ నెల 27న (నవంబర్ 27, 2026) ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు తెలుగులో రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న పీరియాడిక్ డ్రామా 'ది ఇండియా హౌస్', రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ'లో అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
నటనలోనే అసలైన తృప్తి
బాలీవుడ్లో 'ఖోస్లా కా ఘోస్లా 2', 'శ్రీ రామ్ భూమి' చిత్రాలతో పాటు 'షురూ థెకే షురూ' అనే బెంగాలీ సినిమాలోనూ నటిస్తున్నారు అనుపమ్ ఖేర్. ఆస్తుల లెక్కల కంటే కళామతల్లి సేవలో, నటనలోనే తనకు అసలైన తృప్తి ఉందని అనుపమ్ ఖేర్ తన మాటల ద్వారా చాటిచెప్పారు.

E-Paper
