చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Ramayana Collection: పుష్ప 2 రికార్డు బద్ధలు- తెలుగులో 54 కోట్లు- రోజువారీగా రామాయణం బాక్సాఫీస్ కలెక్షన్స్ లెక్కలు!
Ramayana Box Office Collection Day 16: రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ తెరకెక్కించిన రామాయణం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన 16 రోజుల్లోనే భారత్‌లో రూ. 880.05 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన రామాయణ మూవీ పుష్ప 2 రికార్డును బద్ధలు కొట్టింది.
Ramayana 16 Days Worldwide Collection: భారతీయ సినీ చరిత్రలో మరో భారీ దృశ్యకావ్యంగా నిలిచిన 'రామాయణ' సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సాయి పల్లవి సీతగా నటించిన ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్లలోకి అడుగుపెట్టింది.

నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన రామాయణం సినిమా రెండు వారాల పాటు బాక్సాఫీస్‌ను శాసించింది. మూడో వారంలోకి అడుగుపెట్టాక వసూళ్ల వేగం కాస్త తగ్గినప్పటికీ, ఇప్పటికే పలు చారిత్రక మైలురాళ్లను అధిగమించి సినీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
16వ రోజు 16.30 కోట్లు
ప్రముఖ ట్రేడ్ గణాంకాల ప్రకారం, 16వ రోజైన శుక్రవారం (నవంబర్ 20) రామాయణం సినిమా దేశవ్యాప్తంగా రూ. 16.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో భారత్‌లో ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 880.05 కోట్లకు చేరాయి. గురువారం రూ. 19.35 కోట్లు రాబట్టిన ఈ చిత్రం శుక్రవారం నాటికి సుమారు 20 శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో కాస్త నెమ్మదించింది.
అయితే ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే ఇప్పటికే రూ. 1,574.60 కోట్ల మార్కును దాటి సత్తా చాటుతోంది రామాయణం సినిమా. తెలుగు రాష్ట్రాల్లోనూ సాయి పల్లవి, యశ్ క్రేజ్ తోడవ్వడంతో తెలుగు వెర్షన్ ద్వారా ఇప్పటివరకు రూ. 54.85 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి.
దీపావళి సెలవుల్లో వసూళ్ల జాతర
నవంబర్ 5న విడుదలైన తొలి రోజు 'రామాయణ' రూ. 64.85 కోట్ల నెట్ కలెక్షన్లతో ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన దీపావళి సెలవులు ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. పండుగ మరుసటి రోజైన నవంబర్ 9న ఏకంగా రూ. 107.50 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది.
తొలి ఎనిమిది రోజుల పొడిగించిన మొదటి వారంలోనే దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 564.60 కోట్ల నెట్ వసూళ్లు కొల్లగొట్టింది రామాయణం సినిమా. రెండో వారంలోనూ అదే జోరు కొనసాగిస్తూ 9 నుంచి 15వ రోజుల మధ్య రూ. 299.15 కోట్లు రాబట్టింది. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాలతో పాటు ఉత్తరాది మాస్ సెంటర్లలోనూ కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి.
హిందీలో 'పుష్ప 2' రికార్డును దాటేసిన రామాయణ
ఉత్తరాది మార్కెట్లో 'రామాయణం' సరికొత్త చరిత్ర లిఖించింది. హిందీ వెర్షన్లో కేవలం 15 రోజుల్లోనే రూ. 650 కోట్ల నెట్ వసూళ్ల మార్కును దాటి, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో కేవలం 9 రోజుల్లోనే రూ. 650 కోట్లు దాటిన 'ధురంధర్ 2: ది రివెంజ్' మొదటి స్థానంలో కొనసాగుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' హిందీలో రూ. 650 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి 17 రోజులు తీసుకుంది. ఇప్పుడు 'రామాయణ' 15 రోజుల్లోనే ఆ మార్కును అధిగమించి పుష్ప 2 రికార్డును రెండో స్థానానికి నెట్టింది. గతంలో 'ధురంధర్' చిత్రం 23 రోజుల్లో ఈ ఘనత సాధించింది.
మరో వారం పాటు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యం
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీ లేకపోవడం 'రామాయణ'కు కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే శుక్రవారం వరకు ఈ చిత్రానికి ఎదురులేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
"పొడిగించిన తొలి వారంలో అద్భుత వసూళ్లు సాధించిన రామాయణ హిందీ వెర్షన్, రెండో వారంలోనూ సంచలన కలెక్షన్లు రాబట్టింది. ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద దీని ఆధిపత్యం కొనసాగుతుంది. నవంబర్ 27న 'యే ప్రేమ్ మోల్ లియా', 'గన్‌మాస్టర్ జీ9' సినిమాలు విడుదలైన తర్వాతే రామాయణ స్క్రీన్లు, షోలు, ప్రేక్షకుల సంఖ్యలో విభజన కనిపిస్తుంది" అని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

E-Paper
