...
...
Next Story

భజనలో సీనియర్ తెలుగు హీరోయిన్‌కు పూనకం- తోటి భక్తులను కొరికిన సుధా చంద్రన్- గెంతుతూ వింత ప్రవర్తన- షాకింగ్ వీడియో వైరల్

సీనియర్ హీరోయిన్ ప్రముఖ నటి, నర్తకి సుధా చంద్రన్ ఒక భజన కార్యక్రమంలో ఆధ్యాత్మిక పారవశ్యంతో ఊగిపోయారు. భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పక్కనున్న తోటి భక్తులను కొరికేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..!

Updated on: Jan 4, 2026, 14:57:51 IST
Advertisement

ప్రముఖ సీనియర్ హీరోయిన్, నటి, క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్‌కు సంబంధించిన ఒక వింత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 'నాగిన్' వంటి పాపులర్ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన సుధా చంద్రన్ ఒక భజన కార్యక్రమంలో ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు. ఆ సమయంలో ఆమె ప్రవర్తించిన తీరు చూసి అక్కడి వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

పారవశ్యంలో ఊగిపోతూ..

భజనలో సీనియర్ తెలుగు హీరోయిన్‌కు పూనకం- తోటి భక్తులను కొరికిన సుధా చంద్రన్- గెంతుతూ వింత ప్రవర్తన- షాకింగ్ వీడియో వైరల్
భజనలో సీనియర్ తెలుగు హీరోయిన్‌కు పూనకం- తోటి భక్తులను కొరికిన సుధా చంద్రన్- గెంతుతూ వింత ప్రవర్తన- షాకింగ్ వీడియో వైరల్

ఎరుపు, తెలుపు రంగు చీర ధరించి, నుదుట ‘జై మాతా జీ’ అని రాసి ఉన్న బ్యాండ్ కట్టుకున్న సుధా చంద్రన్ భజన జరుగుతున్న హాల్‌లో గెంతుతూ (డ్యాన్స్ లేదా పూనకం) కనిపించారు. భక్తి పారవశ్యంతో తన సుధా చంద్రన్ తన నియంత్రణను పూర్తిగా కోల్పోయినట్లు వీడియోలో స్పష్టమవుతోంది.

ఆధ్యాత్మిక భావోద్వేగాలు ఉధృతం కావడంతో సుధా చంద్రన్‌ను ఆపడానికి చుట్టుపక్కల వారు ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో తనను పట్టుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి (భక్తుడు) చేతిని ఆమె బలంగా కొరికారు. అక్కడ ఉన్న ఇతర భక్తులు సుధా చంద్రన్‌కు ‘పూనకం’ వచ్చినట్లుగా భావించారు.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

సుధా చంద్రన్‌కు పూనకం వచ్చిన వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వస్తున్నాయి. కొందరు సుధా చంద్రన్ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతుంటే మరికొందరు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. "ఆమె మానసిక వేదనలో ఉన్నట్లు కనిపిస్తోంది, ఇలాంటి సమయంలో ఆమెను చూసి నవ్వడం సరికాదు" అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

మరో అభిమాని స్పందిస్తూ.. "ఆమె గురించి విమర్శించే ముందు ఒకసారి ఆమె చరిత్ర తెలుసుకోండి. ప్రమాదంలో కాలు కోల్పోయినా కృత్రిమ కాలితో నృత్యం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఆమె. భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తున్నారో వారికే తెలియదు" అని సుధా చంద్రన్‌కు మద్దతుగా నిలిచారు.

సుధా చంద్రన్ కెరీర్

‘యే హై మొహబ్బతేన్’, ‘క్యుంకీ సాస్ భీ కబీ బహు థీ’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో కూడా సుధా చంద్రన్ నటించారు. అంతేకాకుండా తెలుగు మూవీ మయూరిలో హీరోయిన్‌గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో ఆమె దాదాపుగా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను పోషించారు.

వార్తల్లో నిలవడం

పలు తెలుగు సీరియల్స్‌లో కూడా ఆకట్టుకున్నారు సుధా చంద్రన్. ఇలా సినిమాల్లోనూ, టీవీ షోలలోనూ తనదైన ముద్ర వేసిన సుధా చంద్రన్.. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోతో వార్తల్లో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe