Serial Actress Jiya Shankar Engagement Photos: రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ 2 ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ హీరోయిన్ జియా శంకర్ తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. గత కొంతకాలంగా సీక్రెట్‌గా ఉంచిన తన ప్రేమకథను అధికారికంగా బయటపెట్టడమే కాకుండా, తనకు నిశ్చితార్థం కూడా పూర్తయిందని ప్రకటించారు.
రొమాంటిక్ ఫొటోలు

తన కాబోయే భర్త కరణ్‌తో సూర్యాస్తమయం వేళ తీయించుకున్న రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక భావోద్వేగ నోట్ రాసుకొచ్చారు. కరణ్‌ను పరిచయం చేస్తూ జియా శంకర్ రాసిన క్యాప్షన్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
"నువ్వు నాతో ఉంటే సొంతింట్లో ఉన్నట్లే ఉంది"
"మనం అస్సలు ఊహించని సమయంలోనే నిజమైన ప్రేమ దొరుకుతుందనేది నిజమే కావచ్చు. దేవుడు నా ఓపికను చాలా రకాలుగా పరీక్షించాడు. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. కానీ, నా నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, నీతో మాట్లాడే ప్రతీ మాట నా సొంతింట్లో ఉన్నంత హాయిని ఇచ్చేది" అని జియా శంకర్ పేర్కొన్నారు.
అలాగే ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు చెప్పుకునేటప్పుడు, దూరంగా ఉంటున్నప్పటికీ ప్రతీ రోజూ ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డామో వివరిస్తూ తన ప్రేమలోని లోతును వెల్లడించారు. "ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా సరే.. నా ఇల్లు అనేది ఒక ప్రదేశం కాదు, అది కేవలం నువ్వే. నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రపంచం నువ్వే. నీతో నా జీవితం ఒక అందమైన రొమాంటిక్ కామేడీ సినిమాలా ఉంది" అని కరణ్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నారు జియా శంకర్.
ప్రకృతి ఒడిలో జంట, మిరుమిట్లు గొలిపే డైమండ్ రింగ్
సూర్యాస్తమయం వేళ ఓపెన్ ఎయిర్‌లో ప్రకృతి ఒడిలో కరణ్ ఆమెకు రింగ్ తొడిగి ప్రపోజ్ చేశారు. జియా షేర్ చేసిన పిక్చర్లలో డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక ఫొటోలో జియా ఆశ్చర్యంతో నోటిపై చేయి వేసుకుని ఎమోషనల్ అవగా, మరికొన్ని ఫొటోల్లో ఈ జంట ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో రింగ్ ని కొంటెగా చూపించారు జియా.
{{/usCountry}}సూర్యాస్తమయం వేళ ఓపెన్ ఎయిర్‌లో ప్రకృతి ఒడిలో కరణ్ ఆమెకు రింగ్ తొడిగి ప్రపోజ్ చేశారు. జియా షేర్ చేసిన పిక్చర్లలో డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక ఫొటోలో జియా ఆశ్చర్యంతో నోటిపై చేయి వేసుకుని ఎమోషనల్ అవగా, మరికొన్ని ఫొటోల్లో ఈ జంట ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో రింగ్ ని కొంటెగా చూపించారు జియా.
{{/usCountry}}ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక కోసం జియా శంకర్ ప్యాస్టెల్ ఎల్లో కలర్ శాటిన్ గౌన్ ధరించగా, కరణఅ బీజ్ కలర్ షర్ట్, వైట్ ట్రౌజర్స్‌లో కనిపించారు. గతంలో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్ అభిషేక్ మల్హాన్‌తో జియా ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగాయి.
అసలు విషయం బయటపెట్టిన హీరోయిన్
అయితే అవన్నీ కేవలం పుకార్లేనని, తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని ఆమె పలుమార్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఒక కొత్త వ్యక్తి తన నుదుటిపై ముద్దుపెడుతున్న ఫొటోను షేర్ చేస్తూ 'తప్పుడు ఊహాగానాలను వదిలేయండి' అని చెప్పినప్పటికీ, అతని ముఖాన్ని చూపించలేదు జియా.
ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్ పిక్స్‌తో ఆ సీక్రెట్ లవర్‌ను పరిచయం చేయడంతో అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జియా శంకర్, కరణ్ రొమాంటిక్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, జియా శంకర్ మేరి హానికారక్ బీవీ, పిశాచిని తదితర సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేశారు.
జియా శంకర్ సీరియల్స్
కాగా, జియా శంకర్ మేరి హానికారక్ బీవీ, పిశాచిని తదితర సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేశారు.