Divyanka Tripathi Blessed With Twins: ఇప్పుడంటే ఇతర భాష సీరియల్స్‌ను రీమేక్ చేసి తెలుగు తెరపై ప్రసారం చేస్తున్నారు. కానీ, గతంలో వాటిని నేరుగా డబ్బింగ్ చేసి తెలుగు టీవీ ఛానెల్స్‌లో ప్రసారం చేసేవాళ్లు. అలా తెలుగు డబ్బింగ్ సీరియల్ ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర హీరోయిన్ దివ్యాంక త్రిపాఠి.
తెలుగులో మనసు పలికే మౌనం గీతం టైటిల్‌తో

హిందీలో సూపర్ హిట్ సీరియల్‌లో ఏ హై మొబహబ్బతీన్ ఒకటి. ఈ సీరియల్‌ను తెలుగులో మనసు పలికే మౌనం గీతం టైటిల్‌తో ప్రసారం చేశారు. ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ నటి దివ్యాంక త్రిపాఠి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో తన సీరియల్స్‌తో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి తల్లిగా ప్రమోషన్ పొందింది.
అయితే, దివ్యాంకతోపాటు ఆమె భర్త వివేక్ దహియాకు కూడా హిందీలో మంచి క్రేజ్ ఉంది. భారతీయ టెలివిజన్ రంగంలోనే అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీ జంటగా దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా నిలిచారు. అలాంటి ారి జీవితంలో సరికొత్త వసంతం విరిసింది. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.
కవల పిల్లలకు
అదీ కూడా ఒకేసారి ఇద్దరు బుజ్జాయిలు వారి జీవితంలోకి అడుగుపెట్టారు. సీరియల్ హీరోయిన్ దివ్యాంక త్రిపాఠి కవల మగ పిల్లలకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త, నటుడు వివేక్ దహియా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో వారి అభిమానులు ఆనందంలో ములిగి తేలుతున్నారు.
'మేరే కరణ్ అర్జున్ ఆగయే' అంటూ పోస్ట్
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివేక్ దహియా ఒక అందమైన ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని ప్రపంచానికి చాటారు. నీలం రంగు దుస్తుల్లో ఇద్దరు పసిపాపలు పక్కపక్కనే కూర్చుని ఉన్న ఆ ఫొటోపై "మేము దేవుడిని కాస్త సంతోషాన్ని ఇవ్వమని అడిగాం.. కానీ, ఆ దేవుడు డబుల్ ధమాకా ఇచ్చాడు. ఇద్దరు మగ పిల్లలు పుట్టారు" అని రాసి ఉన్న టెక్ట్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.
{{/usCountry}}తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివేక్ దహియా ఒక అందమైన ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని ప్రపంచానికి చాటారు. నీలం రంగు దుస్తుల్లో ఇద్దరు పసిపాపలు పక్కపక్కనే కూర్చుని ఉన్న ఆ ఫొటోపై "మేము దేవుడిని కాస్త సంతోషాన్ని ఇవ్వమని అడిగాం.. కానీ, ఆ దేవుడు డబుల్ ధమాకా ఇచ్చాడు. ఇద్దరు మగ పిల్లలు పుట్టారు" అని రాసి ఉన్న టెక్ట్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.
{{/usCountry}}ఈ ఫొటోకు వివేక్ జోడించిన ఎమోషనల్ నోట్ నెటిజన్ల మనసులను తాకుతోంది. "ఎదురుచూపులకు తెరపడింది.. 'ది బాయ్స్' వచ్చేసారు. మేము ఊహించిన దానికంటే జీవితం ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తోంది. మేరే కరణ్ అర్జున్ ఆగయే! దివ్యాంక, మేము తల్లిదండ్రులుగా ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు మాకు కావాలి" అని వివేక్ పేర్కొన్నారు.
సెలబ్రిటీల శుభాకాంక్షల వర్షం
ఈ శుభవార్త వినగానే తోటి నటీనటులు, పరిశ్రమ వర్గాలు ఈ దంపతులపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. నటి ఆకాంక్ష పూరి స్పందిస్తూ.. "ఓ మై గాడ్! మీ ఇద్దరికీ అభినందనలు, చాలా సంతోషంగా ఉంది" అని కామెంట్ చేయగా.. మాహి విజ్, పరంపర టాండన్ కూడా కొత్త తల్లిదండ్రులకు విషెస్ చెప్పారు. ఇక అభిమానులైతే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు. "కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, లవ్లీ కపుల్‌కి డబుల్ సెలబ్రేషన్స్" అంటూ కామెంట్ల సెక్షన్ నింపేస్తున్నారు.
'యే హై మొహబ్బతీన్' సెట్స్‌లో మొదలైన ప్రేమాయణం
దివ్యాంక, వివేక్ లవ్ స్టోరీ ఒక సినిమా కథను తలపిస్తుంది. బుల్లితెరపై సూపర్ హిట్ అయిన 'యే హై మొహబ్బతీన్' సీరియల్ షూటింగ్ సమయంలో వీరిద్దరికీ మొదటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి, ఆపై ప్రేమగా రూపాంతరం చెందింది. ఇంట్లో వాళ్లను ఒప్పించి 2016 జూలైలో భోపాల్ వేదికగా వీరిద్దరూ వైభవంగా వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో 'నాచ్ బలియే'లో పాల్గొని టైటిల్ విజేతలుగా నిలిచారు. సుదీర్ఘ దాంపత్య జీవితం తర్వాత ఈ ఏడాది మార్చి నెలలో దివ్యాంక తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అప్పట్లో ఆమె బేబీ బంప్‌తో దిగిన ఫొటోలు నెట్‌లో తెగ వైరల్ అయ్యాయి.
పండుగ వాతావరణం
ఇటీవలే ఈ జంట ఒక సొంత యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. అందులో తమ దైనందిన జీవిత విశేషాలతో పాటు ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు కవలలు రావడంతో వీరి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.