Serial Actress Jennifer Winget Haldi Photos: భారతీయ బుల్లితెరపై స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న సీరియల్ హీరోయిన్ జెన్నిఫర్ వింగెట్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. యూకేలోని వెస్ట్ వేల్స్ వేదికగా వ్యాపారవేత్త విలియమ్ ఇష్మాయెల్‌ను ఆమె క్రిస్టియన్ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.
గ్రీన్ లెహంగాలో మెరిసిన జెన్నిఫర్.. పక్కన వైట్ షేర్వానీలో విలియమ్

పెళ్లి జరిగి కొన్ని వారాలు గడిచినా, ఆ జ్ఞాపకాలు ఇంకా కళ్లముందే ఉన్నాయంటూ ఈ భామా తాజాగా తన హల్దీ వేడుకల ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఫ్రెండ్‌షిప్ డే (ఆగస్ట్ 2)ను పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ అన్ సీన్ ఫొటోల్లో జెన్నిఫర్ ఆకుపచ్చ రంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది.
ఆమె భర్త విలియమ్ ఇష్మాయెల్ తెలుపు రంగు షేర్వానీలో మెరిసిపోయారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో జెన్నిఫర్ స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తూ హల్దీ పూసుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
బుల్లితెర ప్రముఖులు కరణ్ వాహి, హర్లీన్ సేతీ, సెహబాన్ అజీమ్ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్యాన్సులు చేస్తూ హల్దీ జరుపుకున్న ఫొటోలను హర్లీన్ సేతీ సైతం 'యారీ దోస్తీ హల్దీ' అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"నేను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిని"
హల్దీ ఫోటోలను పోస్ట్ చేస్తూ జెన్నిఫర్ ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని రాసుకొచ్చారు. "నా హల్దీ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. అది ప్రేమతో నిండిపోయిన ఒక అద్భుతమైన క్షణం. ఈ ఫొటోలు చూసిన ప్రతీసారి నాకు ఏదో ఒక కొత్త సంతోషం కనిపిస్తుంది. మంచి స్నేహితులు దొరకడం అదృష్టం అని అందరూ అంటుంటారు. అలా అయితే నేనే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతురాలిని" అని జెన్నిఫర్ వింగెట్ పేర్కొన్నారు.
తన జీవితంలో ఇంత మంచి స్నేహితులను సంపాదించుకోవడానికి ఏదో మంచి పనిచేసి ఉంటానని, నవ్వులతో తన చెంపలు నొచ్చేంతగా సంతోషపెట్టిన అందరికీ ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నానని జెన్నిఫర్ వింగెట్ రాశారు.
బ్రిటన్‌లో డ్రీమీ వెడ్డింగ్
{{/usCountry}}తన జీవితంలో ఇంత మంచి స్నేహితులను సంపాదించుకోవడానికి ఏదో మంచి పనిచేసి ఉంటానని, నవ్వులతో తన చెంపలు నొచ్చేంతగా సంతోషపెట్టిన అందరికీ ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నానని జెన్నిఫర్ వింగెట్ రాశారు.
బ్రిటన్‌లో డ్రీమీ వెడ్డింగ్
{{/usCountry}}జులైలో వెస్ట్ వేల్స్‌లోని అద్భుతమైన లొకేషన్‌లో జెన్నిఫర్, విలియమ్ వివాహం జరిగింది. తెల్లటి వీల్, స్ట్రాప్‌లెస్ గౌనులో జెన్నిఫర్ దేవకన్యలా మెరిసిపోగా, నేవీ బ్లూ సూట్‌లో విలియమ్ ఎంతో హుందాగా కనిపించారు. "చివరకు మా స్టార్స్ ఒకటయ్యాయి" అంటూ జెన్నిఫర్ అప్పట్లో షేర్ చేసిన వెడ్డింగ్ వీడియో, ఫొటోలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి.
విలియమ్ ఇష్మాయెల్ ఎవరు?
జెన్నిఫర్‌ను వివాహం చేసుకున్న విలియమ్ ఇష్మాయెల్ సింగపూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ యార్క్‌లో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతం 'MHC డిజిటల్ గ్రూప్'లో బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ట్రేడింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రముఖ యుబిఎస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌తో పాటు ఆర్థిక రంగానికి చెందిన పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
గతంలో జెన్నిఫర్ వింగెట్ ప్రముఖ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను 2012లో వివాహం చేసుకోగా, మనస్పర్థల కారణంగా 2014లో వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరణ్ సింగ్ గ్రోవర్ హీరోయిన్ బిపాసా బసును వివాహం చేసుకున్నారు. ఇప్పుడు జెన్నిఫర్ కూడా విలియమ్‌ను రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలుగులో హిందీ సీరియల్
కాగా, హిందీలో సూపర్ హిట్ సీరియల్స్‌లో జెన్నిఫర్ వింగెట్ హీరోయిన్‌గా చేసి మెప్పించారు. బేపన్నా, బేయాద్, బేయాద్ 2, సరస్వతి చంద్ర, దిల్ మిల్ గయే వంటి సీరియల్స్ చేశారు. ఇందులో బేయాద్ సీరియల్‌ను తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ అనే టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సీరియల్ తెలుగులో పర్వాలేదనిపించుకుంది.