గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వాజ్. బుల్లితెర నుంచి వెండి తెరపైకి హీరోయిన్‌గా మారిన జ్యోతి పూర్వజ్‌కు జ్యోతి రాయ్ అనే పేరు కూడా ఉంది. జ్యోతి పూర్వజ్ నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా కిల్లర్.
ఇతర నటీనటులు

జ్యోతి పూర్వాజ్‌తోపాటు పూర్వజ్, మనీష్ గిలాడ ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించారు.
ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్
ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహించారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న కిల్లర్ సినిమా నుంచి ఇటీవల ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కిల్లర్ ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో జ్యోతి పూర్వజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సీరియల్స్‌తో పాపులర్ అయ్యాను
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. "నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ, ఆ డ్రీమ్ పక్కనపెట్టి ఐటీ కంపెనీలో వర్క్ చేయాల్సివచ్చింది. ఆ తర్వాత సీరియల్స్ చేసి పాపులర్ అయ్యాను. ఇప్పుడు హీరోయిన్‌గా మీ ముందుకు వస్తున్నాను. ఇవన్నీ నేను లైఫ్లో ప్లాన్ చేయలేదు. అలా జరుగుతూ వస్తున్నాయి" అని అన్నారు.
మంచి స్టంట్స్‌తో యాక్షన్ మూవీ
"యాక్టర్ అయ్యాక మంచి స్టంట్స్‌తో యాక్షన్ మూవీ ఒకటి చేయాలని ఉండేది. ఆ విషయం పూర్వాజ్కు చెప్పాను. ఒకవైపు మాస్టర్ పీస్ సినిమా జరుగుతుండగానే ఈ కిల్లర్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. స్క్రిప్ట్ చదివాక మనం ఇంత భారీ స్కేల్లో సినిమా ఎలా చేయగలం అని అన్నాను. కానీ, తనకున్న పరిచయాలతో, స్నేహితులతో చూస్తుండగానే సినిమాను రూపొందించాడు" అని జ్యోతి రాయ్ తెలిపారు.
పూర్వజ్ చెప్పినట్లు చేశా
{{/usCountry}}"యాక్టర్ అయ్యాక మంచి స్టంట్స్‌తో యాక్షన్ మూవీ ఒకటి చేయాలని ఉండేది. ఆ విషయం పూర్వాజ్కు చెప్పాను. ఒకవైపు మాస్టర్ పీస్ సినిమా జరుగుతుండగానే ఈ కిల్లర్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. స్క్రిప్ట్ చదివాక మనం ఇంత భారీ స్కేల్లో సినిమా ఎలా చేయగలం అని అన్నాను. కానీ, తనకున్న పరిచయాలతో, స్నేహితులతో చూస్తుండగానే సినిమాను రూపొందించాడు" అని జ్యోతి రాయ్ తెలిపారు.
పూర్వజ్ చెప్పినట్లు చేశా
{{/usCountry}}"ఈ మూవీలో బాగా పర్‌ఫార్మ్ చేశానని మా యూనిట్ వాళ్లు చెబుతున్నారు. పూర్వాజ్ చెప్పినట్లూ చేస్తూ వెళ్లా. ఒక కొత్త తరహా కంటెంట్‌తో మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా" అని గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతి పూర్వజ్ చెప్పుకొచ్చారు.
బిగ్ స్క్రీన్ మీద ఆకట్టుకోబోతున్నారు
ఇదే ఈవెంట్‌లో యాక్టర్ సీతారామ్ మాట్లాడుతూ.. "డైరెక్టర్ పూర్వజ్ చాలా కష్టపడతారు. జ్యోతి గారిని టీవీల్లో చూశాం. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద మనల్ని ఆకట్టుకోబోతున్నారు. ఆమె ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. కిల్లర్ సినిమా చూసిన ఆడియెన్స్ సర్‌ప్రైజ్ అవుతారు" అని పేర్కొన్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలా
యాక్టర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ.. "ఈ చిత్రంలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలా అడుగుపెట్టా. నాలోని విలనిజాన్ని కొత్తగా తెరపై చూపించబోతున్నారు దర్శకులు పూర్వజ్. విజువల్స్ సూపర్బ్‌గా వచ్చాయి. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది" అని తెలిపారు.