బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీరియల్ హీరోయిన్ రుబీనా దిలైక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. తన భర్త అభినవ్ శుక్లాతో కలిసి ఇప్పటికే ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చిన రుబీనా.. తాజాగా తాను మళ్లీ గర్భవతినంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
అయోమయంలో ఫ్యాన్స్: అసలేం జరిగింది?

బుధవారం (జనవరి 28) రుబీనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రింటెడ్ శారీలో ఎంతో అందంగా కనిపిస్తున్న రుబీనా, కెమెరా వైపు తిరిగి చిరునవ్వు చిందిస్తూ.. "నేను గర్భవతిని" (I am pregnant) అని చెప్పారు.
అంతటితో ఆ వీడియో ఒక్కసారిగా ఆగిపోయింది. దీనికి సంబంధించి రుబీనా దిలైక్ ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వలేదు సరికదా కనీసం తన భర్త అభినవ్ శుక్లాను కూడా ట్యాగ్ చేయలేదు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మనం అనుకుంటున్న ప్రెగ్నెన్సీ కాదేమో
"ఇది నిజమేనా?" అని ఒకరు ప్రశ్నించగా.. "నాకెందుకో ఇది మనం అనుకుంటున్న ప్రెగ్నెన్సీ కాదనిపిస్తోంది, దీని వెనుక ఏదో మతలబు ఉంది" అని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఏదైనా కొత్త షో లేదా బ్రాండ్ ప్రమోషన్ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ కావచ్చని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
"రుబీనా ఎప్పుడూ ఇలాంటి వ్యక్తిగత విషయాలను ఇంత అరకొరగా చెప్పదు.. కచ్చితంగా ఏదో కొత్త ప్రాజెక్ట్ వస్తోంది" అని రుబీనా దిలైక్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఆమె సోదరి గర్భవతి ఏమో అని కూడా అంచనా వేస్తున్నారు.
రుబీనా - అభినవ్ ప్రయాణం
రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా 2018 జూన్‌లో సిమ్లాలో వివాహం చేసుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2023 సెప్టెంబర్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది డిసెంబర్ 27న తమకు కవల కుమార్తెలు జీవా, ఈధా జన్మించినట్లు వెల్లడించారు రుబీనా దంపతులు.
{{/usCountry}}రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా 2018 జూన్‌లో సిమ్లాలో వివాహం చేసుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2023 సెప్టెంబర్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది డిసెంబర్ 27న తమకు కవల కుమార్తెలు జీవా, ఈధా జన్మించినట్లు వెల్లడించారు రుబీనా దంపతులు.
{{/usCountry}}గతేడాది అక్టోబర్‌లో నవరాత్రి సందర్భంగా మొదటిసారిగా తమ పిల్లల ముఖాలను ప్రపంచానికి పరిచయం చేశారు రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా. ఇప్పుడు కవలలు జన్మించిన రెండేళ్లకే మళ్లీ రుబీనా గర్భవతి అని చెప్పడం పట్ల నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.