...
...
Next Story

Shah Rukh Khan Raaka: అల్లు అర్జున్ రాకాతో షారుఖ్ ఖాన్ టాలీవుడ్ రాక- జైలర్ 2కి మాత్రం నో- అదిదా డైరెక్టర్ అట్లీ స్కెచ్!

Shah Rukh Khan Cameo In Allu Arjun Raaka: అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' మూవీపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో మెరవబోతున్నారని హిందీ సినీ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Published on: Apr 16, 2026, 11:00:30 IST
Advertisement

Shah Rukh Khan In Allu Arjun Raaka: తెలుగు సినిమా స్థాయిని 'పుష్ప'తో ప్రపంచవ్యాప్తం చేసిన అల్లు అర్జున్, ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో కలిసి 'రాకా' అనే సినిమాను పట్టాలెక్కించారు. అట్లీ గత చిత్రం 'జవాన్'తో షారుఖ్ ఖాన్‌కు వెయ్యి కోట్ల వసూళ్లను అందించిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ రాకాతో షారుఖ్ ఖాన్ టాలీవుడ్ రాక- జైలర్ 2కి మాత్రం నో- అదిదా డైరెక్టర్ అట్లీ స్కెచ్!
అల్లు అర్జున్ రాకాతో షారుఖ్ ఖాన్ టాలీవుడ్ రాక- జైలర్ 2కి మాత్రం నో- అదిదా డైరెక్టర్ అట్లీ స్కెచ్!

ఇప్పుడు అదే దర్శకుడు అల్లు అర్జున్‌తో సినిమా చేస్తుండటంతో, ఇందులో షారుఖ్ ఖాన్ ఒక చిన్న పాత్రలో కనిపిస్తే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుందని చిత్ర బృందం భావిస్తోందట. ఈ సినిమా పాన్-ఇండియా అప్పీల్‌ను మరింత పెంచడానికి బాలీవుడ్ బాద్‌షా రాక.. రాకాకు ఎంతో ప్లస్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'జైలర్ 2'కు నో.. 'రాకా'కు ఎస్?

ఇదిలా ఉంటే, షారుఖ్ ఖాన్ ఇటీవల రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2'లో అతిథి పాత్ర చేసే అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన తన పూర్తి దృష్టిని 'కింగ్' అనే భారీ ప్రాజెక్టుపైనే పెట్టారు. లీడ్ రోల్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ, అతిథి పాత్రలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు టాక్. అయితే అట్లీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, అల్లు అర్జున్ సినిమాలో నటించేందుకు షారుఖ్ ఖాన్ మొగ్గు చూపుతారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

"షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన డైరీని కేవలం మెయిన్ లీడ్ సినిమాల కోసమే కేటాయిస్తున్నారు" అని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ 'రాకా'లో షారుఖ్ కనిపిస్తే మాత్రం అది ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ కామియో అవుతుంది అనడంలో సందేహం లేదు.

ఇదిలా ఉంటే, 'రాకా' సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ పోస్టర్ ఇంటర్నెట్‌ను ఊపేసింది. బన్నీ రగ్గడ్ లుక్‌ను చూసి షారుఖ్ ఖాన్ సైతం సోషల్ మీడియా వేదికగా "అమేజింగ్" అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు, వీరిద్దరి మధ్య ఏదో ఒక భారీ ప్లాన్ నడుస్తోందని అప్పుడే ఫిక్స్ అయిపోయారు.

షూటింగ్ అప్‌డేట్స్

ప్రస్తుతం రాకా సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2026 ప్రథమార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. షారుఖ్ ఖాన్ కామియో గురించి అటు అల్లు అర్జున్ టీమ్ గానీ, ఇటు అట్లీ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. సినిమా స్థాయిని బట్టి చూస్తుంటే, ప్రేక్షకులకు థియేటర్లలో సర్‌ప్రైజ్ ఇవ్వడానికే మేకర్స్ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్లు అనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe