...
...
Next Story

Shahrukh Khan: గ్రీన్ షేర్వానీ, బ్లాక్ సల్వార్‌లో షారుఖ్ ఖాన్ సలామ్- ఫ్యాన్స్‌కు అదిరిపోయే కానుక ఇచ్చిన బాలీవుడ్ బాద్‌షా

Shahrukh Khan Eid Mubarak Wishes With Love And Light: రంజాన్ పర్వదినం సందర్భంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రెడిషనల్ లుక్‌లో సలామ్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ షారుఖ్ ఖాన్ రాసిన సందేశం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

Published on: Mar 22, 2026, 15:13:40 IST
Advertisement

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఏదైనా పండగ వచ్చిందంటే చాలు.. తనదైన శైలిలో అభిమానులను పలకరిస్తూ సందడి చేస్తారు. అలాగే, శుభాకాంక్షలు తెలియజేస్తారు. అయితే, శనివారం (మార్చి 21) అర్ధరాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు ఈద్ ముబారక్ చెబుతూ ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను పంచుకున్నారు షారుఖ్ ఖాన్.

"ప్రేమ, వెలుగులు మీ సొంతం కావాలి"

గ్రీన్ షేర్వానీ, బ్లాక్ సల్వార్‌లో షారుఖ్ ఖాన్ సలామ్- ఫ్యాన్స్‌కు అదిరిపోయే కానుక ఇచ్చిన బాలీవుడ్ బాద్‌షా
గ్రీన్ షేర్వానీ, బ్లాక్ సల్వార్‌లో షారుఖ్ ఖాన్ సలామ్- ఫ్యాన్స్‌కు అదిరిపోయే కానుక ఇచ్చిన బాలీవుడ్ బాద్‌షా

పచ్చని షేర్వానీ, బ్లాక్ సల్వార్ ధరించి ఎంతో హుందాగా సలామ్ చేస్తున్న తన ఫోటోను షేర్ చేస్తూ అందరికీ ప్రేమను, వెలుగులను పంచారు షారుఖ్ ఖాన్. ఈ సందర్భంగా షారుఖ్ తన పోస్ట్‌లో.. "మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందకరమైన, ప్రశాంతమైన ఈద్ శుభాకాంక్షలు. అందరి జీవితాల్లో ప్రేమ, వెలుగులు నిండాలి. మనం కోరుకున్నవన్నీ, అంతకంటే ఎక్కువే ఆ అల్లా మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. ఈద్ ముబారక్!" అని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

మా ఈద్ పూర్తయినట్టే

ఈ పోస్ట్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. షారుక్ ఖాన్ విషెస్ చూసిన అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. "బాద్‌షా విష్ చేశారు.. ఇక మా ఈద్ పూర్తయినట్టే" అని ఒకరు కామెంట్ చేయగా, "మాకు కావాల్సిన ఈదీ (కానుక) దొరికేసింది" అని మరొకరు రాసుకొచ్చారు. కామెంట్ సెక్షన్ మొత్తం హార్ట్ ఎమోజీలతో, ఈద్ ముబారక్ సందేశాలతో నిండిపోయింది.

'కింగ్' షూటింగ్‌లో బిజీగా

ఇదిలా ఉంటే, 2023లో 'పఠాన్', 'జవాన్', 'డంకీ' వంటి వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' (King) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

కింగ్ ఫస్ట్ లుక్ టీజర్

"నేను ఎంతమందిని చంపానో గుర్తులేదు.. వారు మంచివారో చెడ్డవారో ఎప్పుడూ అడగలేదు.. వెయ్యి నేరాలు, వంద దేశాల్లో అపఖ్యాతి.. నేను కేవలం భయం మాత్రమే కాదు, అంతకు మించిన దడను (Chaos)" అంటూ షారుఖ్ ఖాన్ చెప్పిన డైలాగులు కింగ్ సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి.

తండ్రి సినిమాలో కూతురు

ఇదెలా ఉంటే, కింగ్ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తుండగా అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, ఈ మూవీలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా నటించడం విశేషం.

అధికారిక ప్రకటన

అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ కింగ్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks