Shah Rukh Khan Waived 42 Lakhs To Deool Band 2 DCP: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కేవలం వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తానే ‘బాద్‌షా’ అని నిరూపించుకున్నారు. బడ్జెట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఒక ప్రాంతీయ సినిమాకు ఆయన చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షారుఖ్ ఖాన్ సాయం వల్లే

షారుఖ్ ఖాన్ తన ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ ద్వారా చేసిన ఒక పెద్ద సాయం వల్లే తమ సినిమా ఇంతటి భారీ విజయాన్ని అందుకుందని మరాఠీ చిత్ర దర్శకుడు ప్రవీణ్ తార్డే కృతజ్ఞతతో వెల్లడించారు. ఆ సినిమానే ‘దేవుల్ బంద్ 2’.
80 కోట్ల కలెక్షన్స్ దాటి
ప్రస్తుతం దేవుల్ బంద్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్ల మార్కును దాటి, అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో మరాఠీ సినిమాగా రికార్డు సృష్టించింది. అసలు ఏం జరిగిందనే వివరాలను దర్శకుడు ప్రవీణ్ తార్డే ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
థియేటర్లలో సినిమాను ప్రదర్శించడానికి అవసరమయ్యే డిజిటల్ ఫార్మాట్ అయిన ‘డిజిటల్ సినిమా ప్యాకేజీ’ (DCP) కోసం దేవుల్ బంద్ 2 బృందం షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సంప్రదించింది. మన టాలీవుడ్‌లో క్యూబ్ (Qube) లేదా యూఎఫ్ఓ (UFO) ఫార్మాట్లలో సినిమాలు ఎలా ల్యాబ్స్ నుంచి థియేటర్లకు వెళ్తాయో, బాలీవుడ్‌లో రెడ్ చిల్లీస్ ల్యాబ్స్ కూడా అలాంటి సాంకేతిక సేవలను అందిస్తాయి.
రూ.12 లక్షల బడ్జెట్.. రూ.42 లక్షల బిల్లు!
ఈ పనుల కోసం మరాఠీ నిర్మాతలు రూ.12 లక్షలు కేటాయించారు. కానీ, ఫైనల్ బిల్లు వచ్చేసరికి అది రూ.42 లక్షలకు చేరింది. ప్రాంతీయ సినిమాలకు బడ్జెట్ పరిమితులు ఉంటాయి కాబట్టి, అంత పెద్ద మొత్తాన్ని చెల్లించే శక్తి ఆ చిత్ర బృందానికి లేకపోయింది.
రంగంలోకి దిగిన కింగ్ ఖాన్
{{/usCountry}}ఈ పనుల కోసం మరాఠీ నిర్మాతలు రూ.12 లక్షలు కేటాయించారు. కానీ, ఫైనల్ బిల్లు వచ్చేసరికి అది రూ.42 లక్షలకు చేరింది. ప్రాంతీయ సినిమాలకు బడ్జెట్ పరిమితులు ఉంటాయి కాబట్టి, అంత పెద్ద మొత్తాన్ని చెల్లించే శక్తి ఆ చిత్ర బృందానికి లేకపోయింది.
రంగంలోకి దిగిన కింగ్ ఖాన్
{{/usCountry}}బిల్లు చెల్లించకపోవడంతో ల్యాబ్‌లోనే డీసీపీ ప్రింట్ నిలిచిపోయింది. సినిమా విడుదల ఆగిపోయే పరిస్థితి రావడంతో ప్రవీణ్ తార్డే రెడ్ చిల్లీస్ యాజమాన్యాన్ని కలిసి తమ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఈ విషయం చివరకు షారుఖ్ ఖాన్ దగ్గరకు వెళ్లింది. దీనిపై షారుఖ్ స్పందించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
గతంలో ప్రవీణ్ తార్డే తెరకెక్కించిన ‘ముల్షీ ప్యాటర్న్’ సినిమాను సల్మాన్ ఖాన్ ‘అంతిమ్’ పేరుతో రీమేక్ చేశారు. ఆ పరిచయంతో ప్రవీణ్ తార్డే ప్రతిభపై షారుఖ్‌కు ఒక అవగాహన ఉంది. తన టెక్నికల్ టీమ్‌ను అడిగి ‘దేవుల్ బంద్ 2’ కథ గురించి తెలుసుకున్నారు. అది సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే ఎమోషనల్ సినిమా అని, బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలియగానే షారుఖ్ పెద్ద మనసుతో స్పందించారు.
డబ్బు సంగతి తర్వాత
"వాళ్ల బిల్లును పూర్తిగా మాఫీ చేయండి. అది ఒక మరాఠీ సినిమా. సినిమా బాగుంటే చాలు, వెంటనే డీసీపీ ప్రింట్ ఇచ్చేయండి. డబ్బు సంగతి తర్వాత చూసుకోవచ్చు" అని షారుఖ్ ఖాన్ తన టీమ్‌కు ఆదేశాలు ఇచ్చారని ప్రవీణ్ తార్డే తెలిపారు. షారుఖ్ ప్రాంతీయ సినిమాలకు, మరాఠీ చిత్ర పరిశ్రమకు ఇచ్చిన గౌరవం చూసి తాము ఆశ్చర్యపోయామని ఆయన పేర్కొన్నారు.
రూ.100 కోట్ల క్లబ్ వైపు అడుగులు
"ఆ రోజు ఆ సినిమా ఎలా ఆడుతుందో, అసలు కలెక్షన్లు వస్తాయో లేదో ఎవరికీ తెలియదు. ఎలాంటి గ్యారెంటీ లేకపోయినా షారుఖ్ ఖాన్ మాకు చేసిన ఆ సాయాన్ని జీవితంలో మర్చిపోలేం. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం" అని ప్రవీణ్ తార్డే భావోద్వేగానికి లోనయ్యారు.
షారుఖ్ చూపిన ఉదారత వల్లే సినిమా సకాలంలో విడుదలై, నేడు రూ.80 కోట్లు దాటి రూ.100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. 2015లో వచ్చిన సూపర్ హిట్ ‘దేవుల్ బంద్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వచ్చింది.
కంటెంట్ బాగుంటే
మోహన్ జోషి, స్నేహల్ తార్డే ప్రధాన పాత్రల్లో నటించిన దేవుల్ బంద్ 2 సినిమా సమాజంలో ఎంతో సున్నితమైన రైతుల ఆత్మహత్యల నేపథ్యాన్ని స్పృశిస్తూ, దేవుడిపై నమ్మకం-నాస్తికత్వం మధ్య ఉండే సంఘర్షణను అద్భుతంగా తెరకెక్కించింది. కంటెంట్ బాగుంటే ప్రాంతీయ సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు మాత్రమే కాదు, షారుఖ్ లాంటి గ్లోబల్ స్టార్స్ కూడా ముందుంటారని ఈ ఘటన నిరూపించింది.