Shah Rukh Khan Warns Singer Mika Singh About Gauri Khan: భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మికా సింగ్ సంచలన విషయాలను పంచుకున్నారు. నేడు దేశవ్యాప్తంగా దాదాపు 99 స్థిరాస్తులు (Properties) కలిగి ఉన్న ఈ స్టార్ సింగర్.. ముంబై నగరంలో అత్యంత ఖరీదైన అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఏకంగా రూ. 50 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు.

అయితే, ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని సృష్టించడం తన ఆశయం కాదని, కేవలం ఒక మంచి గాయకుడిగా స్థిరపడాలనేదే తన ఏకైక కల అని సింగర్ మికా సింగ్ పేర్కొన్నారు.
రూ. 75 జీతం నుండి మొదలైన ప్రస్థానం
చిన్నతనంలోనే సంగీతం వైపు అడుగులు వేసిన మికా సింగ్.. కేవలం 13 ఏళ్ల వయసులో జగరణ్ (భక్తి సంగీత కార్యక్రమాలు) లలో పాటలు పాడేవారు. ఆ సమయంలో ఆయన అందుకున్న మొదటి పారితోషికం అక్షరాలా 75 రూపాయలు మాత్రమే.
ఆనాటి రోజులను గుర్తుచేసుకుంటూ.. "రూ. 75 చాలా చిన్న మొత్తమే అయినప్పటికీ, ఆ వయసులో నేను ఆ సంపాదనతో ఎంతో సంతోషపడ్డాను. ఎప్పుడూ నిరాశ చెందలేదు" అని మికా సింగ్ వివరించారు. తన అన్న, ప్రముఖ పాప్ సింగర్ దలేర్ మెహందీ తనకు అండగా నిలిచారని, ఆయన మార్గదర్శకత్వంలోనే సంగీతంలోని మెళకువలు నేర్చుకుని ఆర్థికంగా ఈ స్థాయికి ఎదిగానని కృతజ్ఞత చాటుకున్నారు.
ఒకే బిల్డింగ్‌లో ఆరు ఫ్లాట్లు!
తన ముంబై ఇంటి కొనుగోలు వెనుక ఉన్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌ను మికా సింగ్ పంచుకున్నారు. 2012లో అంధేరి ప్రాంతంలో ఒక మంచి బిల్డింగ్ కడుతున్నారని తెలిసి సాధారణంగా చూడటానికి వెళ్లిన ఆయన.. అక్కడి వాతావరణం నచ్చి ఒకేసారి ఆ బిల్డింగ్‌లో ఆరు ఫ్లాట్లను కొనుగోలు చేశారు.
2018లో ఆ ప్రాజెక్ట్ పూర్తయి చేతికి వచ్చిన తర్వాత, ఆ ఫ్లాట్లన్నింటినీ కలిపి ఒక భారీ లగ్జరీ హౌస్‌గా మార్చేశారు. మొదట ఎనిమిది బెడ్రూమ్లతో ప్లాన్ చేసిన ఈ ఇంటిని, తర్వాత ఐదు విశాలమైన బెడ్రూమ్లు, గెస్ట్ సూట్లు, దాదాపు 40 మంది అతిథులు ఒకేసారి కూర్చోగలిగేలా భారీ లివింగ్ ఏరియాతో రీ-డిజైన్ చేయించారు.
నీ జేబుకు పెద్ద చిల్లు పెడుతుంది..
{{/usCountry}}2018లో ఆ ప్రాజెక్ట్ పూర్తయి చేతికి వచ్చిన తర్వాత, ఆ ఫ్లాట్లన్నింటినీ కలిపి ఒక భారీ లగ్జరీ హౌస్‌గా మార్చేశారు. మొదట ఎనిమిది బెడ్రూమ్లతో ప్లాన్ చేసిన ఈ ఇంటిని, తర్వాత ఐదు విశాలమైన బెడ్రూమ్లు, గెస్ట్ సూట్లు, దాదాపు 40 మంది అతిథులు ఒకేసారి కూర్చోగలిగేలా భారీ లివింగ్ ఏరియాతో రీ-డిజైన్ చేయించారు.
నీ జేబుకు పెద్ద చిల్లు పెడుతుంది..
{{/usCountry}}ఈ డ్రీమ్ హౌస్‌ను సరికొత్తగా తీర్చిదిద్దడానికి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భార్య, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌ను మికా సింగ్ పెట్టుకోవాలనుకున్నారు. అయితే నేరుగా కాకుండా తన ఆప్తమిత్రుడు షారుఖ్ ఖాన్ ద్వారా గౌరీకి ఈ ఆఫర్ పంపించారు.
ఆ సమయంలో షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో నవ్వుతూ.. "ఆమె నీ జేబుకు పెద్ద చిల్లు పెడుతుంది (Bahut lootegi tumhe), చాలా ఖర్చు చేయిస్తుంది" అంటూ సరదాగా హెచ్చరించారు. అయినప్పటికీ మికా పట్టుబట్టడంతో, షారుఖ్ స్వయంగా గౌరీతో మాట్లాడి ప్రాజెక్ట్‌ను ఓకే చేయించారు.
గౌరీ ఖాన్ పెట్టిన ఏకైక కండిషన్
ఇంటి డిజైనింగ్ బాధ్యతలు తీసుకునే ముందు గౌరీ ఖాన్ ఒక కఠినమైన నిబంధన పెట్టారు. తను చేసే డిజైన్ల విషయంలో ఎలాంటి ప్రశ్నలు వేయకూడదని, అడ్డు చెప్పకూడదని స్పష్టం చేశారు. మికా సింగ్ అందుకు వెంటనే అంగీకరించారు. సాధారణంగా మికా సింగ్‌కు తన ఇళ్లలో బ్రౌన్, బేజ్ రంగులు ఉండటం ఇష్టం.
ఆకుపచ్చ (Green) రంగును ఆయన అస్సలు ఇష్టపడరు. కానీ, గౌరీ ఖాన్ దానికి భిన్నంగా ఇంటికి సరిగ్గా మధ్యభాగంలో ఒక పెద్ద గ్రీన్ సోఫాను ఏర్పాటు చేశారు. దాదాపు రెండేళ్ల పాటు జరిగిన ఈ ఇంటీరియర్ పనుల సమయంలో మికా సింగ్ ఒక్కసారి కూడా వెళ్లి ఇల్లు ఎలా తయారవుతుందో చూడలేదు.
నటుడిగా ఎంట్రీ
గౌరీ ఖాన్ సృజనాత్మకతపై ఉన్న నమ్మకంతోనే పూర్తిగా ఆమెకే వదిలేశానని, నేడు ఇల్లు చూసుకుంటే ఎంతో గర్వంగా ఉందని సింగర్ మికా సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. సంగీత రంగంలోనే కాకుండా వెండితెరపై కూడా సందడి చేయడానికి మికా సింగ్ సిద్ధమవుతున్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన మల్టీస్టారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'వెల్‌కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle) చిత్రం 2026 జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.