...
...
Next Story

Shilpa Shinde: నిజమైన సీతాదేవిగా బిగ్ బాస్ విజేత శిల్పా షిండే- భావోద్వేగ అభినయం- సాయి పల్లవి, కృతి సనన్ కంటే బెటర్ అంటూ!

Shilpa Shinde As Sita Compared Sai Pallavi Kriti Sanon: ఢిల్లీ షాలిమార్ బాగ్ రామ్‌లీలా వేదికపై బిగ్ బాస్ విజేత శిల్పా షిండే సీతాదేవి పాత్రలో ఒదిగిపోయారు. భావోద్వేగభరితంగా ఆమె చేసిన అభినయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సాయి పల్లవి, కృతి సనన్ కంటే శిల్పా నటన ఎంతో బాగుందని ప్రశంసిస్తున్నారు.

Published on: Oct 19, 2026, 05:31:06 IST
Advertisement

Shilpa Shinde As Sita Compared Sai Pallavi Kriti Sanon: బుల్లితెర ప్రేక్షకులకు ‘అంగూరీ బాభీ’గా సుపరిచితమైన నటి శిల్పా షిండే సరికొత్త అవతారంలో మెరిశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ షాలిమార్ బాగ్ రామ్‌లీలా వేదికపై ఆమె సీతాదేవి పాత్రను పోషించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.

రామ్‌లీలా నాటకం

నిజమైన సీతాదేవిగా బిగ్ బాస్ విజేత శిల్పా షిండే- భావోద్వేగ అభినయం- సాయి పల్లవి, కృతి సనన్ కంటే బెటర్ అంటూ!
నిజమైన సీతాదేవిగా బిగ్ బాస్ విజేత శిల్పా షిండే- భావోద్వేగ అభినయం- సాయి పల్లవి, కృతి సనన్ కంటే బెటర్ అంటూ!

రామాయణంలోని ఘట్టాలను వేదికపై శిల్పా షిండే ప్రదర్శించిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాదిలో దసరా, నవరాత్రుల సమయంలో రామ్‌లీలా నాటకాలను ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకల్లో భాగంగా శిల్పా షిండే కాషాయ వర్ణ చీరను ధరించి, రుద్రాక్ష మాలలతో నిజమైన సీతమ్మను తలపించేలా కనిపించారు.

నెటిజన్ల ప్రశంసలు.. సాయి పల్లవితో పోలికలు

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో.. లక్ష్మణుడిని శ్రీరాముడి వద్దకు వెళ్లమని సీతాదేవి కోరే ఘట్టాన్ని శిల్పా షిండే ఎంతో భావోద్వేగంగా అభినయించారు. వనవాసంలో సీతమ్మ రక్షణ గురించి లక్ష్మణుడు ఆందోళన చెందుతూ వెళ్లడానికి నిరాకరించే సన్నివేశంలో ఆమె చూపిన హావభావాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ ప్రదర్శన చూసిన నెటిజన్లు శిల్పా షిండేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఆదిపురుష్ సినిమాలో నటించిన కృతి సనన్, రాబోయే రామాయణం చిత్రంలో నటిస్తున్న సాయి పల్లవి కంటే శిల్పా షిండే సీత పాత్రకు ఎంతో చక్కగా సరిపోయారు" అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

'అంగూరీ బాభీ' నుంచి బిగ్ బాస్ విజేత వరకు..

'భాభీ జీ ఘర్ పర్ హైన్' సీరియల్‌లోని అంగూరీ బాభీ పాత్ర ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత నిర్మాతలతో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా కొన్నాళ్లు ఆ షోకు దూరమైనా, 2025లో వచ్చిన 'భాభీజీ ఘర్ పర్ హైన్ 2.0' ద్వారా మళ్లీ అదే ఐకానిక్ పాత్రలో అలరించారు.

రియాలిటీ షోలలోనూ

బుల్లితెరపైనే కాకుండా రియాలిటీ షోలలోనూ శిల్పా షిండే తన ప్రతిభను చాటుకున్నారు. 'బిగ్ బాస్ 11'లో అడుగుపెట్టి నిజాయతీ గల ప్రవర్తనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని విజేతగా నిలిచారు. ఆ తర్వాత 'ఝలక్ దిఖ్లా జా 10', 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' షోలలో సందడి చేశారు.

ఏక్తా కపూర్ నిర్మించిన 'లాక్ అప్' ఓటీటీ షోలో తీవ్రమైన పోటీని తట్టుకుని థర్డ్ రన్నరప్‌గా నిలిచారు శిల్పా షిండే. ఈ షోలో శ్రేయా కల్రా విజేతగా నిలిచి రూ. 1 కోటి బహుమతి గెలుచుకోగా, శివాంగి జోషి రన్నరప్‌గా నిలిచారు.

సాదాసీదా జీవితం.. నాటకరంగానికి కొత్త ఊపిరి

ఎంతటి ప్రజాదరణ పొందినా శిల్పా షిండే వ్యక్తిగత జీవితంలో చాలా సాదాసీదాగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు. అనవసరమైన పబ్లిసిటీకి, మీడియా హడావుడికి దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు.

హఠాత్తుగా ఢిల్లీ రామ్‌లీలా వేదికపై సీతమ్మగా దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయక నాటకరంగానికి ప్రముఖ నటీనటులు రావడం వల్ల ఇటువంటి సాంస్కృతిక కళలకు పూర్వ వైభవం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks