Shiva Raj Kumar OTT: సీనియర్ హీరో శివ రాజ్‌కుమార్ ఇటీవల విడుదలైన సూర్య, మమితా బైజుల హిట్ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) పై ప్రశంసల వర్షం కురిపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా చూశాక తనకు రాత్రి నిద్రపట్టలేదని శివన్న అన్నారు.
శివన్న ఎమోషనల్

తన కొత్త సినిమా 'బెయిల్' (Bail) అక్టోబర్ 2న విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ శివన్న ఎమోషనల్ అయ్యారు.
సూర్య సినిమా చూసి ఏడ్చేశా
"నేను ఇటీవల 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా చూశాను. సినిమా చూశాక దాదాపు గంటసేపు నాకు నిద్రపట్టలేదు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ దృశ్యాలు చూస్తున్నంతసేపు మా అమ్మనాన్నలు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మలతో పాటు మా కుటుంబం గుర్తుకొచ్చింది. భవిష్యత్తులో నేను కూడా ఇలాంటి మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చేయాలని అనుకుంటున్నాను" అని శివ రాజ్‌కుమార్ తెలిపారు.
ఓటీటీలో ట్రెండింగ్
కన్నడ లెజెండ్ డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మల పెద్ద కుమారుడైన శివ రాజ్‌కుమార్.. తమ ఉమ్మడి కుటుంబ జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో ఒలింపిక్ పిస్టల్ షూటర్, పారిశ్రామికవేత్త సంజయ్ విశ్వనాథ్‌గా సూర్య, సరోగసి మదర్ మ్యాడీగా మమితా బైజూ అద్భుతంగా నటించారు.
పెద్ద వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ వారి మధ్య చిగురించే అనుబంధం, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది.
శివన్న జోరు
{{/usCountry}}పెద్ద వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ వారి మధ్య చిగురించే అనుబంధం, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది.
శివన్న జోరు
{{/usCountry}}ప్రస్తుతం శివ రాజ్‌కుమార్ వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 2న 'బెయిల్' మూవీతో ప్రేక్షకులను పలకరించనున్న ఆయన, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రాబోతున్న 'జైలర్ 2'లో మరోసారి పవర్‌ఫుల్ కేమియో రోల్ చేయనున్నారు.
వీటితో పాటు తమిళంలో 'పికాసో', తెలుగులో పీరియాడికల్ డ్రామా 'గుమ్మడి నర్సయ్య', కన్నడలో 'డాడ్', '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే క్యాన్సర్‌ను జయించిన తన జీవిత ప్రయాణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న 'సర్వైవర్ - ఏ సూపర్‌స్టార్ డాక్యుమెంటరీ'లోనూ ఆయన కనిపించనున్నారు. ఈ ఏడాదే ఆయన తెలుగులో 'పెద్ది' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.