పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. ఆ తర్వాత తెలుగు సినిమా చేయని ఈ బ్యూటి హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అయితే, రీసెంట్‌గా శ్రద్ధా కపూర్ షూటింగ్ సెట్‌లో గాయపడింది.
ఈఠా మూవీ సెట్‌లో

శ్రద్ధా కపూర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఈఠా. నవంబర్ 22న ఈఠా సెట్‌లో శ్రద్ధా కపూర్ గాయపడినట్లు పలు మీడియా కథనాలు వచ్చాయి. తాజాగా తన గాయంపై హెల్త్ అప్డేట్ ఇస్తూ వీడియో రిలీజ్ చేసింది బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్. కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు శ్రద్ధా కపూర్ చెప్పుకొచ్చింది.
కాలికి ప్లాస్టరింగ్ చేసిన వీడియో
అలాగే, తన అప్‌కమింగ్ సినిమా గురించి వెల్లడించింది శ్రద్ధా కపూర్. అయితే, శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ క్వషన్ సెషన్‌ను నిర్వహించింది. అందులో అనేక అభిమానుల ప్రశ్నలకు శ్రద్ధా సమాధానం ఇచ్చింది. అలాగే, ఫ్యాన్స్ తన కాలు గాయం గురించి అప్ డేట్ అడిగినప్పుడు శ్రద్ధ కపూర్ తన కాలును ప్లాస్టరింగ్ చేసిన వీడియోను పంచుకుంది.
టెర్మినేటర్‌లా తిరుగుతున్నా
"నేను టెర్మినేటర్‌లాగా తిరుగుతున్నాను. నా కండరాలు చితికిపోయాయి ఇది కండరాల కన్నీరు. కానీ, త్వరలో నయం అవుతుంది. నాకు కొంచెం విశ్రాంతి అవసరం. నేను పూర్తిగా కోలుకుంటాను" అని శ్రద్ధా కపూర్ అభిమానులతో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎడమ కాలి వేళ్లకు
ఇదిలా ఉంటే, ఈఠా సినిమాలో కీలకమైన లవణీ సాంగ్ సీక్వెన్స్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా శ్రద్ధా కపూర్ గాయపడింది. శ్రద్ధా కపూర్ ఎడమ కాలి వేళ్లకు ఫ్రాక్చర్ అయింది. దాంతో సాహో బ్యూటీని రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్స్ సూచించారు. ఈ కారణంగా ఈఠా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.
భారీ ఆభరణాలతో డ్యాన్స్
{{/usCountry}}ఇదిలా ఉంటే, ఈఠా సినిమాలో కీలకమైన లవణీ సాంగ్ సీక్వెన్స్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా శ్రద్ధా కపూర్ గాయపడింది. శ్రద్ధా కపూర్ ఎడమ కాలి వేళ్లకు ఫ్రాక్చర్ అయింది. దాంతో సాహో బ్యూటీని రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్స్ సూచించారు. ఈ కారణంగా ఈఠా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.
భారీ ఆభరణాలతో డ్యాన్స్
{{/usCountry}}అజయ్-అతుల్ కంపోజ్ చేసిన లవణీ సాంగ్‌ను సాంప్రదాయ నౌవరీ చీర, భారీ ఆభరణాల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడంతో కష్టమైందని, ఈ క్రమంలోనే గాయపడినట్లు శ్రద్ధా కపూర్ తెలిపింది. అలాగే, ఈఠా మూవీలో తన పాత్ర కోసం తాను ఏకంగా 15 కిలోల బరువు పెరిగినట్లు శ్రద్ధా కపూర్ పేర్కొంది.
ఒప్పుకోని దర్శకుడు
అయితే, షూటింగ్‌లో గాయపడిన కూడా క్లోజప్ షాట్స్ కంప్లీట్ చేయాలని శ్రద్ధా కపూర్ కోరిందట. కానీ, డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ అందుకు అంగీకరించలేదని సమాచారం. గాయం మరింత ముదిరే అవకాశం ఉంటుందని షూటింగ్‌ను నిలిపివేశారు ఈఠా మూవీ మేకర్స్.