Actress Shweta Tripathi About Media Questions: ఓటీటీ ప్రపంచంలో 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గుడ్డూ భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో పాటు 'గొలు గుప్తా'గా శ్వేతా త్రిపాఠి నటన తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది.
సినిమాగా ఓటీటీ సిరీస్

ఇప్పుడు ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ వెండితెరపై సినిమాగా రాబోతోంది. అదే మీర్జాపూర్ ది మూవీ. ఇవాళ తెలుగు, హిందీ భాషల్లో మీర్జాపూర్ ది మూవీ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మీర్జాపూర్ నటి శ్వేతా త్రిపాఠి మీడియా వేదికగా డిజిటల్ యుగంలో నటీనటులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్
ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన కల్ట్ సిరీస్‌లు థియేటర్లలోకి రావడం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక కొత్త పరిణామం. తెలుగు రాష్ట్రాల్లోనూ మిర్జాపూర్ డబ్బింగ్ వెర్షన్‌కు విశేష ఆదరణ లభించడంతో ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
నా మాటలను మార్చేస్తున్నారు: శ్వేతా త్రిపాఠి
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై డిజిటల్ మీడియా విపరీతమైన దృష్టి సారిస్తోందని శ్వేతా త్రిపాఠి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మాట్లాడే చిన్న మాటను కూడా సందర్భం లేకుండా కట్ చేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. "మనం ఒకటి మాట్లాడితే మీడియాలో దాని అర్థం పూర్తిగా మారిపోతోంది. అనవసరమైన క్లిప్‌లు జోడించి వార్తలు రాస్తున్నారు" అని శ్వేతా త్రిపాఠి వ్యాఖ్యానించారు.
'గొలు' పాత్రే నాలో ధైర్యాన్ని నింపింది
రీసెంట్గా జనాభా నియంత్రణ, పిల్లలను కనడంపై ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. మొదట జనం ఏమనుకుంటారో అని భయపడినా, ఆ తర్వాత నిష్పాక్షికంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు శ్వేతా త్రిపాఠి చెప్పారు.
మీర్జాపూర్ పాత్ర ఎంత ధైర్యంగా ఉంటుందో
{{/usCountry}}రీసెంట్గా జనాభా నియంత్రణ, పిల్లలను కనడంపై ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. మొదట జనం ఏమనుకుంటారో అని భయపడినా, ఆ తర్వాత నిష్పాక్షికంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు శ్వేతా త్రిపాఠి చెప్పారు.
మీర్జాపూర్ పాత్ర ఎంత ధైర్యంగా ఉంటుందో
{{/usCountry}}"'మీర్జాపూర్'లో గొలు గుప్తా పాత్ర ఎంత ధైర్యంగా, నిజాయితీగా ఉంటుందో.. నిజ జీవితంలోనూ నేను అలాగే ఉండాలని అనుకుంటున్నా. ఎవరు ఏమనుకున్నా సరే, గౌరవప్రదంగా నా అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పడమే నేర్చుకున్నా" అని శ్వేతా త్రిపాఠి స్పష్టం చేశారు.
యాక్టర్లను రాజకీయాలు ఎందుకు అడుగుతారు?
నటులను సంక్లిష్టమైన రాజకీయ ప్రశ్నలు అడిగి హెడ్‌లైన్స్ కోసం వాడుకోవడం సరికాదని శ్వేతా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారిక పత్రాల గురించి తమకు పూర్తి అవగాహన ఉండదని, అలాంటప్పుడు పొరపాటున ఏమైనా మాట్లాడితే తీవ్రంగా విమర్శిస్తారని ఆమె స్పష్టం చేశారు. నటన, సినిమాల గురించి మాత్రమే తమను ప్రశ్నించాలని, సమాజంలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం నేర్చుకోవాలని కోరారు.
వైరం వెనుక ఉన్న అసలు సీక్రెట్లు
గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రితీష్ సిధ్వానీ, ఫర్హాన్ అఖ్తర్ మీర్జాపూర్ ది మూవీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒరిజినల్ కథలోని వైరం వెనుక ఉన్న అసలు సీక్రెట్లను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో ఆలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందులతో పాటు బాబ్లూ పండిట్ పాత్రలో జితేంద్ర కుమార్ కనిపించనున్నారు.