Serial Actress: మోసం చేస్తుండగా నా ఇద్దరు భర్తలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా.. సీరియల్ నటి శ్వేతా తివారీ కామెంట్స్
Serial Actress Shweta Tiwari On Ex Husbands: తన ఇద్దరు భర్తలు మోసం చేస్తుండగా రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నాని షాకింగ్ కామెంట్స్ చేశారు సీరియల్ నటి శ్వేతా తివారీ. ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో ది ట్రేటర్స్ సీజన్ 2 ప్రోమోలో శ్వేతా తివారీ చేసిన కామెంట్స్‌తోపాటు వీడియో తెగ వైరల్ అవుతున్నాయి.
Serial Actress Shweta Tiwari On Cheating Husbands: బుల్లితెర సీనియర్ నటి, ఫిట్‌నెస్ ఫ్రీక్ శ్వేతా తివారీ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో ఓటీటీ రిలీజ్ కానున్న 'ది ట్రేటర్స్ సీజన్ 2' (The Traitors Season 2) ప్రోమో విడుదలైంది.

ఓటీటీ షో ఫస్ట్ లుక్ గ్లింప్స్
బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ఓటీటీ షో ఫస్ట్ లుక్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ ది ట్రేటర్స్ 2 ఓటీటీ ప్రోమోలో టీవీ నటి శ్వేతా తివారీ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కరణ్ జోహార్ ముందే భర్తల రహస్యం రట్టు!
గేమ్ కాన్సెప్ట్‌లో భాగంగా కరణ్ జోహార్ శ్వేతాతో మాట్లాడుతూ.. "అబద్ధాలు చెప్పే వారిని నువ్వు అంత తేలిగ్గా ఎలా పసిగట్టగలవు?" అని ప్రశ్నించారు. దానికి శ్వేతా ఏమాత్రం తడబడకుండా సమాధానమిచ్చింది.
"నన్ను మోసం చేస్తున్న సమయంలో నా ఇద్దరు భర్తలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది నేనే. అందుకే నాకు అబద్ధాలు చెప్పే ముఖాలను గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు" అని శ్వేతా తివారీ బాంబు పేల్చారు.
రెండుసార్లు వివాహం చేసుకున్న శ్వేతా తివారీ
శ్వేతా తివారీ గతంలో రెండుసార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1998లో నటుడు రాజా చౌదరిని పెళ్లి చేసుకున్న ఆమె, విభేదాల కారణంగా 2007లో విడిపోయి ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అనంతరం 2013లో అభినవ్ కోహ్లీని రెండో వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.
రాజా చౌదరి ఎదురుదాడి.. కొత్త వివాదం
తన ఇద్దరు భర్తల నుంచి గృహహింసతో పాటు నమ్మకద్రోహాన్ని ఎదుర్కొన్నట్లు శ్వేతా గతంలోనూ పలు సందర్భాల్లో ఆరోపించారు. ఇదిలా ఉంటే, శ్వేతా మొదటి భర్త రాజా చౌదరి ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొని ఆమె చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తానేమీ గృహహింసకు పాల్పడలేదని, శ్వేతానే తప్పుడు ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, 'కసౌటీ జిందగీ కే' సీరియల్ సమయంలో శ్వేతా తివారీ తన కో-స్టార్ సేజాన్ ఖాన్‌తో ప్రేమాయణం నడిపిందని, వారిద్దరూ కలిసుండటం తాను స్వయంగా తెలుసుకున్నానని రాజా సంచలన ఆరోపణలు చేశారు. ఈ పాత గొడవలు మళ్లీ ఇప్పుడు రియాలిటీ షో వేదికగా తెరపైకి రావడం గమనార్హం.
నటీనటుల వ్యంగ్యాస్త్రాలు.. గ్లామర్ హంగామా!
ఇక 'ది ట్రేటర్స్ 2' ప్రోమోలోనే మరొక పోటీదారు, నటి పరుల్ గులాటీ మరో కంటెస్టెంట్ కుల్లుతో మాట్లాడుతూ శ్వేతా తివారీపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. "ఆమె టీవీ నటి. ఏడవడానికి గ్లిజరిన్ కూడా వాడాల్సిన పనిలేదు, చాలా సహజంగా ఏడ్చేస్తుంది" అని పరుల్ కామెంట్ చేయడం షోలో డ్రామా తీవ్రతను పెంచేసింది.
20 మంది సెలబ్రిటీలు
ఈసారి అమెజాన్ ప్రైమ్ వీడియో అందిస్తున్న ది ట్రేటర్స్ 2 ఓటీటీ షోలో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. శ్వేతా తివారీ, పరుల్ గులాటీలతో పాటు రష్మీ గౌతమ్ తరహాలో గుర్తింపు పొందిన యూట్యూబర్ అభిషేక్ మల్హన్, సీనియర్ హీరోయిన్ మల్లికా షెరావత్, మునావర్ ఫరూకీ, రియా చక్రవర్తి, కృష్ణ శర్మ, దలీప్ తహిల్, కృష్ణ శర్మ మ్యాజిక్ వంటి 20 మంది ప్రముఖులు ఈ మైండ్ గేమ్‌లో పోటీపడుతున్నారు. త్వరలోనే ఈ షో ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


