Shweta Tripathi: నటీనటులను రాజకీయాల గురించి ఎందుకు అడుగుతారు.. మీడియా తీరుపై నటి శ్వేతా త్రిపాఠి విమర్శలు
Actress Shweta Tripathi About Media Questions: మీర్జాపూర్ సినిమాతో వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్న నటి శ్వేతా త్రిపాఠి మీడియా తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీల మాటలను సందర్భం లేకుండా ప్రచారం చేయడంపై స్పందిస్తూ, తన ఓటీటీ సిరీస్‌లోని 'గొలు' పాత్రే తనకు ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
Actress Shweta Tripathi About Media Questions: ఓటీటీ ప్రపంచంలో 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గుడ్డూ భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో పాటు 'గొలు గుప్తా'గా శ్వేతా త్రిపాఠి నటన తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది.

సినిమాగా ఓటీటీ సిరీస్
ఇప్పుడు ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ వెండితెరపై సినిమాగా రాబోతోంది. అదే మీర్జాపూర్ ది మూవీ. ఇవాళ తెలుగు, హిందీ భాషల్లో మీర్జాపూర్ ది మూవీ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మీర్జాపూర్ నటి శ్వేతా త్రిపాఠి మీడియా వేదికగా డిజిటల్ యుగంలో నటీనటులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్
ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన కల్ట్ సిరీస్‌లు థియేటర్లలోకి రావడం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక కొత్త పరిణామం. తెలుగు రాష్ట్రాల్లోనూ మిర్జాపూర్ డబ్బింగ్ వెర్షన్‌కు విశేష ఆదరణ లభించడంతో ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
నా మాటలను మార్చేస్తున్నారు: శ్వేతా త్రిపాఠి
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై డిజిటల్ మీడియా విపరీతమైన దృష్టి సారిస్తోందని శ్వేతా త్రిపాఠి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మాట్లాడే చిన్న మాటను కూడా సందర్భం లేకుండా కట్ చేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. "మనం ఒకటి మాట్లాడితే మీడియాలో దాని అర్థం పూర్తిగా మారిపోతోంది. అనవసరమైన క్లిప్‌లు జోడించి వార్తలు రాస్తున్నారు" అని శ్వేతా త్రిపాఠి వ్యాఖ్యానించారు.
'గొలు' పాత్రే నాలో ధైర్యాన్ని నింపింది
రీసెంట్‌గా జనాభా నియంత్రణ, పిల్లలను కనడంపై ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. మొదట జనం ఏమనుకుంటారో అని భయపడినా, ఆ తర్వాత నిష్పాక్షికంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు శ్వేతా త్రిపాఠి చెప్పారు.
మీర్జాపూర్ పాత్ర ఎంత ధైర్యంగా ఉంటుందో
"'మీర్జాపూర్'లో గొలు గుప్తా పాత్ర ఎంత ధైర్యంగా, నిజాయితీగా ఉంటుందో.. నిజ జీవితంలోనూ నేను అలాగే ఉండాలని అనుకుంటున్నా. ఎవరు ఏమనుకున్నా సరే, గౌరవప్రదంగా నా అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పడమే నేర్చుకున్నా" అని శ్వేతా త్రిపాఠి స్పష్టం చేశారు.
యాక్టర్లను రాజకీయాలు ఎందుకు అడుగుతారు?
నటులను సంక్లిష్టమైన రాజకీయ ప్రశ్నలు అడిగి హెడ్‌లైన్స్ కోసం వాడుకోవడం సరికాదని శ్వేతా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారిక పత్రాల గురించి తమకు పూర్తి అవగాహన ఉండదని, అలాంటప్పుడు పొరపాటున ఏమైనా మాట్లాడితే తీవ్రంగా విమర్శిస్తారని ఆమె స్పష్టం చేశారు. నటన, సినిమాల గురించి మాత్రమే తమను ప్రశ్నించాలని, సమాజంలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం నేర్చుకోవాలని కోరారు.
వైరం వెనుక ఉన్న అసలు సీక్రెట్లు
గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రితీష్ సిధ్వానీ, ఫర్హాన్ అఖ్తర్ మీర్జాపూర్ ది మూవీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒరిజినల్ కథలోని వైరం వెనుక ఉన్న అసలు సీక్రెట్లను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో ఆలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందులతో పాటు బాబ్లూ పండిట్ పాత్రలో జితేంద్ర కుమార్ కనిపించనున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


