తెలంగాణ నేటివిటీని, ఇక్కడి ప్రజల జీవితాలను ఈ సినిమాలో చూస్తాం.. సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ కామెంట్స్

హీరో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు (చైతన్య) జొన్నలగడ్డ నటుడిగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. చైతు నటించిన లేటెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి. అఖిల్, తేజస్వినీ జంటగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో చైతు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Nov 1, 2025, 11:47:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరోగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన సోదరుడు చైతు (చైతన్య) జొన్నలగడ్డ కూడా నటుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హిట్ 3, భామా కలాపం 2 వంటి సినిమాల్లో నటించారు. చైతు జొన్నలగడ్డ నటుడిగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి.

తెలంగాణ నేటివిటీని, ఇక్కడి ప్రజల జీవితాలను ఈ సినిమాలో చూస్తాం.. సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ కామెంట్స్
తెలంగాణ నేటివిటీని, ఇక్కడి ప్రజల జీవితాలను ఈ సినిమాలో చూస్తాం.. సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ కామెంట్స్

ఓటీటీ ప్లాట్‌ఫామ్

"రాజు వెడ్స్ రాంబాయి" సినిమాలో అఖిల్, తేజస్విని జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది.

చైతు జొన్నలగడ్డ కామెంట్స్

అయితే, ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌మెంట్ చేశారు. దీనికి సంబంధించి ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

పక్కా తెలంగాణ సినిమా

నటుడు చైతు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "రాజు వెడ్స్ రాంబాయి పక్కా తెలంగాణ సినిమా. తెలంగాణ నేటివిటీని, ఇక్కడి ప్రజల జీవితాలను ఈ చిత్రంలో చూస్తాం. తెలంగాణ నేటివిటీని ఇంత పర్‌ఫెక్ట్‌గా చూపించిన సినిమా మరొకటి లేదు. ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడం హ్యాపీగా ఉంది" అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్‌గా న్యాయం

ఇదే ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. "రాజు వెడ్స్ రాంబాయి లాంటి మంచి కథ ఉన్న చిత్రానికి నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా న్యాయం చేయగలను అని నమ్మిన వేణు ఊడుగుల అన్నకు, ఈటీవీ విన్ వారికి, డైరెక్టర్ సాయిలు గారికి థ్యాంక్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డీటెయిల్డ్‌గా మాట్లాడుతా. మా సినిమా టీమ్‌కు మీరంతా సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు.

నా మనసుకు ఎంతో దగ్గరైంది

హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ.. "రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాంబాయి క్యారెక్టర్‌తో మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా, ఈ క్యారెక్టర్ నా మనసుకు ఎంతో దగ్గరయ్యాయి" అని చెప్పింది.

ఎమోషన్‌కు గురవుతారు

"సినిమా చూస్తున్నంత సేపు మీరు ఒక ఎమోషన్ కు గురవుతారు, మూవీని ఇష్టపడతారు. తెలుగు ఆడియెన్స్‌కు మా మూవీ బాగా నచ్చుతుంది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ వారికి, మా డైరెక్టర్ సాయిలు, వేణు గారికి థ్యాంక్స్" అని హీరోయిన్ తేజస్వినీ తెలిపింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More