...
...
Next Story

Singeetham Srinivasa Rao: చివరి వరకూ- సింగీతం లాస్ట్ స్క్రిప్ట్ టైటిల్ ఇదే- కన్నీళ్లు తెప్పిస్తున్న నాగ్ అశ్విన్ స్టోరీ!

Singeetham Srinivasa Rao: కొందరు సినిమాలతో బతికేస్తారు.. కానీ కొందరేమో సినిమాలకే బతుకునిస్తారు. ఆ రెండో కోవకు చెందిన అత్యంత అరుదైన వ్యక్తి సింగీతం శ్రీనివాసరావు. ఆయన చివరి శ్వాస వరకూ సినిమా గురించే ఆలోచించారు. సింగీతం లాస్ట్ స్క్రిప్ట్ టైటిల్ ను చెప్తూ నాగ్ అశ్విన్ పెట్టిన స్టోరీ వైరల్ గా మారింది.

Published on: Oct 4, 2026, 06:41:28 IST
Advertisement

Singeetham Srinivasa Rao: కాలానికంటే ముందే ఊహించి, తరాలు గుర్తుండిపోయేలా సినిమాలు తీసిన అద్భుత డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు. శనివారం (అక్టోబర్ 3) రాత్రి కన్నుమూసిన ఆయన.. చివరి శ్వాస వరకూ సినిమా గురించే ఆలోచించారు. తన లాస్ట్ మూవీ స్క్రిప్ట్ టైటిల్ ను నాగ్ అశ్విన్ తో సింగీతం పంచుకున్నారు.

సింగీతం లాస్ట్ స్క్రిప్ట్

చివరి వరకూ- సింగీతం లాస్ట్ స్క్రిప్ట్ టైటిల్ ఇదే- కన్నీళ్లు తెప్పిస్తున్న నాగ్ అశ్విన్ స్టోరీ! (x)
చివరి వరకూ- సింగీతం లాస్ట్ స్క్రిప్ట్ టైటిల్ ఇదే- కన్నీళ్లు తెప్పిస్తున్న నాగ్ అశ్విన్ స్టోరీ! (x)

94 ఏళ్ల వయసులోనూ మెగాఫోన్ పట్టి, తన ప్రయోగాన్ని కొనసాగించారు సింగీతం శ్రీనివాసరావు. నాగ్ అశ్విన్ ప్రొడ్యూసర్ గా ‘సింగ్ గీతం’ అనే మ్యూజికల్ ఎక్స్ పెరిమెంట్ మూవీని తెరకెక్కంచారు. ఆ తర్వాత కూడా ఆయన తన స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూనే వచ్చారు. తన కొత్త స్క్రిప్ట్ టైటిల్ ను నాగ్ అశ్విన్ కు పంపించారు.

టైటిల్ ఇదే

సింగీతం శ్రీనివాసరావు కన్నుమూసిన నేపథ్యంలో ఆయన చివరి స్క్రిప్ట్ టైటిల్ ను నాగ్ అశ్విన్ వెల్లడించారు. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో సింగీతం పంపించిన మెసేజ్ ను నాగ్ అశ్విన్ పెట్టారు. ‘‘నా స్క్రిప్ట్ కొత్త టైటిల్ ‘ఏ ఫ్రూట్ కట్స్ ది నైఫ్’’’ అని సింగీతం సెప్టెంబర్ 5, 2026న పంపించిన మెసేజ్ ను నాగ్ అశ్విన్ బయటపెట్టారు.

అదే ప్రయోగం

సింగీతం తన కొత్త స్క్రిప్ట్ విషయంలోనూ ప్రయోగాన్ని వదల్లేదు. సాధారణంగా పండును కత్తితో కోస్తాం. కానీ ఆయన తన స్క్రిప్ట్ కు కత్తినే కోసే పండు అనే అర్థం వచ్చేలా ఇంగ్లీషులో టైటిల్ పెట్టారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ పెట్టిన ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరి శ్వాస వరకూ సినిమా గురించే ఆలోచించిన మహానుభావుడు సింగీతం అని నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.

నాగ్ అశ్విన్ ఇన్ స్టా స్టోరీ

నటనలోనూ అదుర్స్

సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి అల్లు అర్జున్ తాతయ్యగా బిగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చారు సింగీతం. 2010లో వచ్చిన వరుడు సినిమాలో హీరోకు తాతగా నటించారు. కుటుంబ సంబంధాలు, పెళ్లి విలువలను చెప్పే క్యారెక్టర్లో అదరగొట్టారు. ఆ తర్వాత ‘చిన్ని చిన్ని ఆశ’, ‘కంచె’ సినిమాల్లో కనిపించారు. చివరగా 2024లో వచ్చిన ‘భలే ఉన్నాడే’ చిత్రంలో నటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks