Singer Wife: నా భర్త అధికారం చూసి భయపడ్డా, ఇక సహించేది లేదు- పెళ్లయిన 4 నెలలకే సింగర్ బాద్‌షా రెండో భార్య ఇషా పోస్ట్

Singer Badshah Wife Isha Rikhi Post: ప్రసిద్ధ సింగర్ బాద్‌షా, నటి ఇషా రిఖి వైవాహిక బంధం ముగింపునకు వచ్చినట్లు తెలుస్తోంది. తన భర్త ప్రభావం, అధికారం చూసి భయపడి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానంటూ ఇషా పోస్ట్ పెట్టారు. పెళ్లయిన 4 నెలలకే బాద్‌షాపై రెండో భార్య ఇలాంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Published on: Jul 28, 2026, 13:44:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Singer Badshah Wife Isha Rikhi Post: బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్, సింగర్ బాద్‌షా, ఆయన భార్య ఇషా రిఖి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లయిన నాలుగు నెలలకే వీరిద్దరూ విడిపోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఇషా రిఖి ఒక భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశారు.

నా భర్త అధికారం చూసి భయపడ్డా, ఇక సహించేది లేదు- పెళ్లయిన 4 నెలలకే సింగర్ బాద్‌షా రెండో భార్య ఇషా పోస్ట్
నా భర్త అధికారం చూసి భయపడ్డా, ఇక సహించేది లేదు- పెళ్లయిన 4 నెలలకే సింగర్ బాద్‌షా రెండో భార్య ఇషా పోస్ట్

ఇకపై దైనికీ భయపడేది లేదు

తన భర్తకున్న అధికారం, ఆధిపత్యం చూసి భయపడి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై దేనికీ భయపడేది లేదని ఇషా రిఖి స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ బ్రేక్ ఎమోజీతో ఈషా తన ఆవేదనను వ్యక్తపరిచారు ఇషా.

కనిపించని గాయాలు.. భయం వెనుక అసలు నిజం!

"కొన్ని యుద్ధాలు శరీరానికి కనిపించని గాయాలను మిగుల్చుతాయి. నా భర్తకున్న అధికారం, హోదా, ఆర్థిక బలగం చూసి భయపడ్డాను. అందుకే ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయాను. మౌనంగా ఉండటమే సురక్షితం అని భావించాను" అని ఇషా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నటించలేను

"అయితే నా మౌనం నా అంగీకారం కాదు, కేవలం బతికేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే. ఈ రోజు భయం స్థానంలో ధైర్యాన్ని ఎంచుకుంటున్నా. జరిగింది అంతా బయటకు చెప్పడానికి నేను ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు, కానీ అంతా బాగున్నట్లు ఇక నటించలేను" అంటూ ఇషా రిఖి రాసుకొచ్చిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇషాకు అండగా నిలిచిన సెలబ్రిటీలు

ఇషా పోస్ట్‌కు పలువురు బాలీవుడ్, పంజాబీ చిత్రసీమకు చెందిన సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. టీవీ నటి జాస్మిన్ భాసిన్, సుయాష్ రాయ్, బిగ్ బాస్ ఓటీటీ విజేత సనా మక్బుల్, నటుడు సాహిల్ ఆనంద్ ఆమెకు అండగా కామెంట్లు చేశారు. "నువ్వు చాలా ధైర్యవంతురాలివి, మేమందరం నీతోనే ఉన్నాం" అని పంజాబీ నటి శృతి సోధి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.

రహస్య పెళ్లి నుంచి విడాకుల అనుమానాల వరకు!

ర్యాపర్ బాద్‌షాకు ఇది రెండో వివాహం. గతంలో జాస్మిన్ మసీహ్‌ను వివాహం చేసుకున్న ఆయన, 2020లో ఆమెతో విడిపోయారు. వీరికి జెస్సెమీ గ్రేస్ అనే కుమార్తె ఉంది. ఆ తర్వాత నటి ఇషా రిఖితో బాద్‌షా ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది మార్చి నెలలో ఇషా తల్లి పూనమ్ రిఖి వీరి వివాహ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది.

పతిదేవ్ అన్న ఇషా రిఖి

జూన్ నెలలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఇషా.. బాద్‌షాను తన 'పతిదేవ్'గా పేర్కొంటూ పెళ్లిని అధికారికంగా ధ్రువీకరించారు. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కాకపోవడంపై సరదాగా కౌంటర్ కూడా ఇచ్చారు.

ప్రతి ప్రార్థన ఒక ఆశ

కానీ, ఇటీవల "ప్రతి తుఫాను ఒక పాఠం చెబుతుంది. ప్రతి ప్రార్థన ఒక ఆశ" అని ఇషా పోస్ట్ పెట్టడంతో వివాహ బంధంలో సమస్యలు ఉన్నాయనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజా పోస్ట్‌తో బాద్‌షా, ఇషా రిఖీలు విడిపోవడం దాదాపు ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More