...
...
Next Story

పురుషాంగం ఫొటోలు పంపి-మ్యూజిక్ స్టూడియోలో లైంగిక వేధింపులు-చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్ కామెంట్లపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

రీసెంట్ గా మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ లో క్యాస్టింగ్ కౌచ్ ఏమీ ఉండదని చిరంజీవి పేర్కొన్నారు. అయితే ఈ కామెంట్లపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఉదాహరణలు షేర్ చేశారు.

Published on: Jan 27, 2026, 05:38:17 IST
Advertisement

సినీ పరిశ్రమలో 'కాస్టింగ్ కౌచ్' సంస్కృతి లేదని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. సోమవారం (జనవరి 26) ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్‌కి సంబంధించిన అనేక సంఘటనలను చిన్మయి ప్రస్తావించారు. ఇది సర్వసాధారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికా మహిళ

చిరంజీవి కామెంట్లపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు
చిరంజీవి కామెంట్లపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ.. "ఆయన ఒక తరం నుంచి వచ్చారని, ఆ తరంలో వారంతా వారి మహిళా సహ నటీనటులతో స్నేహితులుగా లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండేవారని, పరస్పరం గౌరవించుకునేవారని" అని చిన్మయి అన్నారు. చిన్మయి కాస్టింగ్ కౌచ్, సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల ఘటనలను పంచుకున్నారు.

క్యాస్టింగ్ కౌచ్

"క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం, మహిళలు ఫూర్తి కమిట్మెంట్ అందించకపోతే క్యారెక్టర్లు ఇవ్వరు. ఇది సినిమా పరిశ్రమలో పూర్తిగా భిన్నమైన అర్థాన్నిచ్చే పదం. మీరు ఇంగ్లీష్-ఎడ్యుకేటెడ్ నేపథ్యం నుంచి వచ్చి, కమిట్మెంట్ అంటే వర్క్ స్కిల్ అని, మీ కళకు కట్టుబడి ఉండటం అని విశ్వసిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే. పురుషులు మహిళల నుంచి లైంగిక సంబంధిత సేవలను డిమాండ్ చేస్తారు’’ అని చిన్మయి రాసుకొచ్చారు.

లైంగిక వేధింపులు

‘‘అతను చెడుగా ప్రవర్తించాడు. అమ్మాయికి పురుషాంగం ఫోటోలను పంపాడు. ఎటువంటి ప్రేరేపణ లేకుండా నోటితో చేయమని అడిగాడు. లైంగిక వేధింపులు సర్వసాధారణమైన సమస్య" అని చిన్మయి పేర్కొన్నారు.

చిరంజీవి తరం

"లెజెండరీ చిరంజీవి ఒక తరం నుంచి వచ్చారు. ఆ తరంలో వారంతా వారి మహిళా సహ నటీనటులతో స్నేహితులుగా లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండేవారు. పరస్పరం గౌరవించుకునేవారు. ఆయన లెజెండ్‌లతో పని చేశారు. వారంతా లెజెండ్‌లే" అని చిన్మయి తెలిపారు.

షావుకారు జానకి

"షావుకారు జానకి వంటి మహిళలు మీటూ ఉద్యమాన్ని అర్థం చేసుకోలేకపోయారు. జానకి మేడమ్, వై.జి. మహేంద్రతో ఇంటర్వ్యూలో తనను తాను 'ఫెమినిస్ట్' అని చెప్పుకున్న మహిళ కావచ్చు. కానీ ఆఫీస్ లో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన అమ్మాయిలను జానకి, వై.జి.ఎం. అవమానించారు. ఇవన్నీ చేయడం మహిళల భర్తలకు, కుటుంబాలకు అవమానం అని అన్నారు" అని చిన్మయి చెప్పారు.

నన్ను వేధించారు

"నేను అడిగానని వైరాముత్తు నన్ను వేధించలేదు. నేను నా టీనేజ్ దాటిన కొద్దికాలానికే అతన్ని గురువుగా, లెజెండరీ లిరిసిస్ట్‌గా గౌరవించా. కానీ నా తల్లి అక్కడే ఉన్నప్పటికీ వైరాముత్తు నన్ను లైంగికంగా వేధించాడు. ఇలాంటి మగవాళ్లతో ఏమీ మారదు. పని ఇవ్వడానికి బదులుగా లైంగిక కోరికలు తీర్చాలని భావించే పురుషులే సమస్య’’ అని చిన్మయి తన పోస్టు ముగించింది.

చిరు ఏమన్నారంటే

హైదరాబాద్‌లో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సక్సెస్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతు.. ‘‘అలాంటి కాస్టింగ్ కౌచ్ సంస్కృతి అంటూ ఏదీ లేదు. ఇది వ్యక్తిగతంపై ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ అద్దంలాంటిది. అది మీరెవరో ప్రతిబింబిస్తుంది" అని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks