OTT Show: లేచిపోయి వచ్చిన ప్రేమ జంటకు మాల్దీవుల టూర్ బహుమతిగా ఇచ్చిన సింగర్ కరణ్ ఔజ్లా- ఓటీటీ కామెడీ షోలో అరుదైన ఘట్టం!
Karan Aujla Maldives Gift To Eloped Couple: ఇండియాస్ గాట్ లేటెంట్ ఓటీటీ రియాలిటీ షోలో పంజాబీ సింగర్ కరణ్ ఔజ్లా పెద్ద మనసు చాటుకున్నారు. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని అనేక కష్టాలు పడుతున్న ఒక నిరుపేద దంపతులకు మాల్దీవుల టూర్‌కు ఆర్థిక సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకున్నారు కరణ్ ఔజ్లా.
Karan Aujla Maldives Gift To Eloped Couple: సమయ్ రైనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్ ఓటీటీ కామెడీ అండ్ టాలెంట్ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' వేదికపై ఒక అరుదైన, హృదయపూర్వక ఘట్టం చోటుచేసుకుంది. సాధారణంగా పంచ్‌లు, సెటైర్లతో సందడిగా సాగే ఈ ఓటీటీ షోలో, ఈసారి ఒక పేద జంట కథ అందరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.

సైకిల్ వీల్ స్టంట్లతో మెప్పించి
జడ్జిల ప్యానెల్‌లో ఉన్న ప్రముఖ పంజాబీ పాప్ సింగర్, ర్యాపర్ కరణ్ ఔజ్లా చూపించిన ఉదారత ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. ఈ షోకు విచ్చేసిన విజేంద్ర రజాక్ అనే కంటెస్టెంట్ తన సైకిల్ వీల్ స్టంట్లతో జడ్జిలైన సమయ్ రైనా, తన్మయ్ భట్, గుర్లీన్ పన్ను, రాహుల్ దువాతో పాటు కరణ్ ఔజ్లాను విశేషంగా ఆకట్టుకున్నాడు.
కష్టాలు ఎదుర్కొని ఒకటైన ప్రేమ జంట
ప్రదర్శన అనంతరం విజేంద్ర తన భార్యను వేదికపైకి ఆహ్వానించి, తమ ప్రేమ కథను పంచుకున్నాడు. ప్రేమించిన నెల రోజులకే ఇరువైపుల పెద్దలను కాదని తాము లేచిపోయి పెళ్లి చేసుకున్నామని అతడు వివరించాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా పెళ్లి చేసుకున్నామని, ఆ తర్వాత భార్య ఇంట్లో వారు పెట్టిన పోలీస్ కేసులను కూడా ఎదుర్కొన్నామని చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు.
విమాన టికెట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన రాక్‌స్టార్
సంభాషణ మధ్యలో సమయ్ రైనా జీవితంలో సాధించాలనుకుంటున్న అతిపెద్ద గోల్ ఏంటని అడగ్గా.. "తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్లాలని ఉందంటూ" విజేంద్ర తన మనసులోని ఆశను బయటపెట్టాడు. ఆ మాట విన్న వెంటనే స్పందించిన కరణ్ ఔజ్లా, వారి పర్యటనకు అయ్యే పూర్తి టికెట్ ఖర్చులను తానే భరిస్తానని వేదికపైనే ప్రకటించాడు.
నీ భార్యపై నీకున్న ప్రేమకు దక్కిన బహుమతి
"మీరు మాల్దీవులకు వెళ్తే సంతోషిస్తారు కదా? అయితే మీ ఇద్దరి ప్రయాణ టికెట్లకు నేనే పూర్తి స్పాన్సర్‌షిప్ ఇస్తున్నాను. నీ భార్యపై నీకున్న ప్రేమకే నీకు ఈ గిఫ్ట్ దక్కుతోంది" అని కరణ్ ఔజ్లా వ్యాఖ్యానించారు. కరణ్ చేసిన ఈ అనూహ్య సహాయానికి ఆ దంపతులు ఆనందభాష్పాలు రాల్చారు. షోలో ఉన్న ఇతర జడ్జిలు, ప్రేక్షకులు ఈ గొప్ప మనసును లేచి నిలబడి అభినందించారు.
నెటిజన్ల నీరాజనాలు
ఓటీటీ షో ముగిసిన తర్వాత విజేంద్ర తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ కరణ్ ఔజ్లాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన్మయ్ భట్, రాహుల్ దువా, గుర్లీన్ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కరణ్ ఔజ్లా సాంగ్స్
"సంగీతంతోనే కాకుండా మంచి మనసుతో కూడా కరణ్ గెలిచేశారు", "సెలబ్రిటీల వెనుక ఉన్న మానవత్వానికి ఇది నిదర్శనం" అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్న కరణ్ ఔజ్లా రీసెంట్‌గా విక్కీ కౌశల్ 'తౌబా తౌబా', 'సాఫ్ట్‌లీ', '52 బార్స్' వంటి చార్ట్‌బస్టర్ పాటలతో ట్రెండింగ్‌లో నిలిచారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఇదిలా ఉంటే, నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాస్ గాట్ లాటెంట్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతోపాటు యూట్యూబ్‌లోనూ ఈ ఓటీటీ షో అందుబాటులో ఉంటోంది.
మొదటి ఎపిసోడ్‌లో అలియా భట్, ఇండియన్ ట్రంప్ అవినాష్ అగర్వాల్ వీడియోలతో ఈ షో తెగ వైరల్ అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


