ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ (సత్యవతి), అడ్వకేట్ సుబ్బారావు మధ్య చెలరేగిన వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కోట్ల రూపాయల మోసం, బెదిరింపులు, పోలీస్ స్టేషన్ డ్రామాలతో ఈ వ్యవహారం ముదిరింది. తాజగా హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు మంగ్లీ. న్యాయవాది సుబ్బారావుపై ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తూ.. కించపరుస్తున్నారని వెల్లడించారు. సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పంజాగుట్టు పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా జరిగింది.
వివాదానికి ప్రధాన కారణం

అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు ఇవే:
పెట్టుబడుల పేరుతో మోసం: ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్, రియల్ ఎస్టేట్, సినిమా ఫైనాన్సింగ్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, ఇతరులు సుమారు 100 నుండి 150 మంది దగ్గర కోట్లు సేకరించారని ఆయన ఆరోపించారు.
బెదిరింపులు: ఇన్వెస్టర్ల తరపున తాను డబ్బులు తిరిగి అడగగా 'నిన్ను చంపి శవం కూడా దొరకకుండా చేస్తాం' అంటూ మంగ్లీ నేరుగా బెదిరింపులకు దిగిందని సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఫిర్యాదు సమయంలో పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా నెలకొన్నది. న్యాయవాది సుబ్బారావు మాట తీరు చూసి.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆల్కహాల్ టెస్ట్ చేశారు. 27 రీడింగ్ చూపించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు.
తప్పుచేయలేదంటున్న మంగ్లీ
మరోవైపు మంగ్లీ కూడా ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వెళ్లారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. పాట ప్రాణంగా బతుకుతున్నానని వెల్లడించింది. మైక్రోఫైనాన్స్ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరింది. అంతేకాదు సుబ్బారావు తనతో అసభ్యంబా ప్రవరించాడని మంగ్లీ చెబుతోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు సుబ్బారావు ఇలాంటి ట్రిక్స్ చేస్తున్నట్టుగా ఆరోపించింది.
ఆయన మార్చి 21 నుండి తనను కలవాలని ఒత్తిడి చేస్తున్నారని, తాను నిరాకరించినందుకు తనను వేధిస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. సుబ్బారావు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, తన పరువు తీసేలా మాట్లాడుతున్నారని మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సుబ్బారావుపై సెక్షన్ 79, 351(3) కింద కేసు నమోదు చేశారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా
{{/usCountry}}ఆయన మార్చి 21 నుండి తనను కలవాలని ఒత్తిడి చేస్తున్నారని, తాను నిరాకరించినందుకు తనను వేధిస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. సుబ్బారావు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, తన పరువు తీసేలా మాట్లాడుతున్నారని మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సుబ్బారావుపై సెక్షన్ 79, 351(3) కింద కేసు నమోదు చేశారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా
{{/usCountry}}ఈ కేసులో ఫిర్యాదు ఇవ్వడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అడ్వకేట్ సుబ్బారావుకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సుబ్బారావు మద్యం మత్తులో ఉన్నారన్న అనుమానంతో పోలీసులు ఆయనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు.
పోలీసుల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మంగ్లీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, తనను అవమానించడానికే కావాలని ఈ పరీక్ష చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాను కాఫీ తాగి వచ్చానని, ఆల్కహాల్ తీసుకోలేదని సుబ్బారావు వెర్షన్.
పోలీసుల దర్యాప్తు
ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైక్రోఫైనాన్స్ మోసంపై మంగ్లీ సోదరుడు, ఇతరుల ప్రమేయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమయంలోనే హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను మంగ్లీ వెళ్లి కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.