సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. ఈ సినిమాతో శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు.
నిలవే ప్రీ రిలీజ్ ఈవెంట్

పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. నిలవే సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం (ఫిబ్రవరి 11) నాడు మాదాపూర్‌లో నిలవే ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
సింగర్ సునీత కామెంట్స్
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లోనే నిలవ ట్రైలర్‌ను సింగర్ సునీత విడుదల చేశారు. ఈ సందర్భంగా నిలవే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సింగర్ సునీత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇక్కడ ఉండటానికి కారణం
సింగర్ సునీత మాట్లాడుతూ.. "ఈ మధ్య చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలు చూస్తుంటాం. అలా అన్నీ ఎమోషన్స్ చూపించేలా ఉన్న చిత్రమే నిలవే. కాలం మారినా ఇంటెన్స్ మ్యూజిక్ అలానే ఉంటుంది. నేను ఇక్కడ ఉండటానికి కారణం కూడా అదే" అని అన్నారు.
క్లాసికల్ మూవీస్ తరహాలో
"నిలవే అనేది అద్భుతమైన ఫొటోగ్రఫీ, దర్శకత్వం, తగిన నటీనటులు ఉన్న సినిమా. ఈ సినిమా చూశాను. అర్థవంతమైన సినిమా ఇది. మ్యూజికల్ లవ్ స్టోరీ థియేటర్‌లో ఆడేలా ప్రేక్షకులు తీర్పు ఇస్తారని, క్లాసికల్ మూవీస్ సఖి, ఏ మాయే చేశావే తరహాలో మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందని భావిస్తున్నా" అని సింగర్ సునీత తెలిపారు.
కీరవాణి గారిని వినమంటే
"ఇందులోని పాటలు బాగున్నాయని ఓసారి కీరవాణి గారిని వినమంటే ఆయన విని తన వంతు సపోర్ట్ ఇస్తానని ప్రమోషన్ చేయడం కూడా సినిమాపై పాజిటివిటీ నెలకొంది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి విషెస్ చెబుతున్నానాను" అని గాయనీ సునీత తెలిపారు.
సంగీతమే ప్రధాన కారణం
{{/usCountry}}"ఇందులోని పాటలు బాగున్నాయని ఓసారి కీరవాణి గారిని వినమంటే ఆయన విని తన వంతు సపోర్ట్ ఇస్తానని ప్రమోషన్ చేయడం కూడా సినిమాపై పాజిటివిటీ నెలకొంది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి విషెస్ చెబుతున్నానాను" అని గాయనీ సునీత తెలిపారు.
సంగీతమే ప్రధాన కారణం
{{/usCountry}}హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ.. "సినిమా ఇండస్ట్రీలో అతి పెద్దైన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా నేను అంగీకరించడానికి సంగీతమే ప్రధాన కారణం. డైలాగ్స్ కూడా ఫీల్ కలిగేలా ఉన్నాయి" అని అన్నారు.
ప్రేమ మీద మంచి అభిప్రాయం
"జెన్‌జీ జెనరేషన్‌కు చెందిన మా జనరేషన్ సినిమా ఇది. ఈ నిలవే సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా చేసిన టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని డెబ్యూ హీరోయిన్ శ్రేయాసి సేన్ పేర్కొన్నారు.