...
...
Next Story

Horror: 7 కోట్ల బడ్జెట్, 750 కోట్ల కలెక్షన్స్- 10 వేల శాతానికిపైగా లాభాలు- బాక్సాఫీస్‌ను వణికిస్తున్న హారర్ థ్రిల్లర్

Obsession Box Office Collection Beats Dhurandhar 2 Michael: 2026 బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రాలను దాటేసి ఓ చిన్న హారర్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 107 రెట్ల లాభాలతో వెయ్యి కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతోంది. ఆ సినిమా విశేషాలు చూద్దాం.

Published on: May 25, 2026, 13:47:10 IST
Advertisement

Obsession Box Office Collection Beats Dhurandhar 2 Michael: ప్రపంచ సినిమా రంగానికి 2026 ఏడాది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. మన దేశం నుంచి వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' సంచలన విజయంతో పాటు హాలీవుడ్‌లో 'మైఖేల్', 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ', 'ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ' వంటి భారీ చిత్రాలు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

నాలుగు చిత్రాలు కలిపి

7 కోట్ల బడ్జెట్, 750 కోట్ల కలెక్షన్స్- 10 వేల శాతానికిపైగా లాభాలు- బాక్సాఫీస్‌ను వణికిస్తున్న హారర్ థ్రిల్లర్
7 కోట్ల బడ్జెట్, 750 కోట్ల కలెక్షన్స్- 10 వేల శాతానికిపైగా లాభాలు- బాక్సాఫీస్‌ను వణికిస్తున్న హారర్ థ్రిల్లర్

ఈ నాలుగు చిత్రాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 బిలియన్ డాలర్ల (రూ. 23 వేల 847 కోట్ల 22 లక్షలు)కు పైగా వసూలు చేశాయి. అయితే, కలెక్షన్ల పరంగా ఇవి టాప్‌లో ఉన్నా, పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాల శాతాన్ని (Return on Investment) లెక్కగడితే మాత్రం వీటన్నింటినీ ఒక చిన్న హారర్ సినిమా వెనక్కి నెట్టేసింది.

బాక్సాఫీస్‌ను వణకిస్తున్న 'అబ్సెషన్'

థియేటర్లలో ఇంకా విజయవంతంగా నడుస్తున్న ఆ చిత్రం ఇప్పటికే వంద రెట్ల లాభాలను దాటేసి ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. హాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ కర్రీ బార్కర్ స్వతంత్రంగా తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'అబ్సెషన్' (Obsession) ఈ ఏడాది అంతర్జాతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సక్సెస్ స్టోరీగా నిలిచింది.

కేవలం 750 వేల డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ. 7.15 కోట్లు) అత్యల్ప బడ్జెట్‌తో రూపొందిన అబ్సెషన్ సినిమా మే 15న థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన పది రోజుల్లోనే ఊహించని రీతిలో పుంజుకుంటూ ఏకంగా 80 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 750 కోట్లు) కలెక్షన్స్ రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడిపై 10,000 శాతానికి పైగా లాభాలను అర్జించి ఈ ఏడాది అత్యంత లాభదాయకమైన చిత్రంగా రికార్డు సృష్టించింది.

హాలీవుడ్ దిగ్గజాలకు చుక్కలు

పరిమిత థియేటర్లలో విడుదలైనప్పటికీ ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రం 21 మిలియన్ డాలర్లు సాధించి 100 మిలియన్ డాలర్ల మార్కు వైపు దూసుకెళ్తోంది. ఒకవేళ ఈ చిత్రం వంద మిలియన్ల మార్కును దాటితే.. గతంలో సంచలనం సృష్టించిన 'పారానార్మల్ యాక్టివిటీ', 'ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్' చిత్రాల తర్వాత వన్ మిలియన్ డాలర్ల కంటే తక్కువ బడ్జెట్‌తో ఆ మైలురాయిని అందుకున్న మూడో చిత్రంగా చరిత్రకెక్కుతుంది.

'ధురంధర్ 2' కంటే ఎక్కువ లాభాలు!

ఈ చిత్రం సాధించిన లాభాల శాతంతో పోలిస్తే భారీ బడ్జెట్ చిత్రాల వసూళ్లు చాలా తక్కువని చెప్పాలి. హాలీవుడ్ చిత్రం 'మైఖేల్' ఇప్పటివరకు 788 మిలియన్ డాలర్లు వసూలు చేసినా అది బడ్జెట్ కంటే కేవలం 5 రెట్లు మాత్రమే ఎక్కువ.

అలాగే బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన 'ధురంధర్ 2' చిత్రం 200 మిలియన్ డాలర్లు సాధించి తన బడ్జెట్‌కు 17 రెట్ల లాభాన్ని తెచ్చింది. ఒక చైనీస్ స్పోర్ట్స్ కామెడీ చిత్రం తన బడ్జెట్‌కు 16 రెట్లు లాభాలను సాధించింది. కానీ, అబ్సెషన్ ఏకంగా 100 రెట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఈ మెగా బడ్జెట్ చిత్రాలన్నింటినీ అతి సులభంగా దాటేసింది.

అబ్సెషన్ కథ

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ ప్రదర్శన పొందిన ఈ అబ్సెషన్ చిత్ర కథాంశం ప్రేక్షకులను థియేటర్లలో సీట్ల అంచున కూర్చుండేలా చేస్తోంది. మైఖేల్ జాన్‌స్టన్ ఇందులో బెయిర్ అనే మ్యూజిక్ స్టోర్ ఉద్యోగిగా నటించాడు. అతడికి ఒక అతీత శక్తులున్న వింత బొమ్మ దొరుకుతుంది.

తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ (ఇండీ నవరెట్) తనతో ప్రేమలో పడాలని ఆ బొమ్మను కోరుకుంటాడు. ఆ కోరిక తీరినప్పటికీ, దాని వల్ల అతడి జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిణామాలు ఎదురయ్యాయనేదే ఈ సినిమా కథ.

భయంకరమైన మలుపులు

"భయంకరమైన మలుపులతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్‌ను ఇస్తుంది" అని చిత్ర యూనిట్ పేర్కొంది. చిన్న సినిమాల్లో బలమైన కంటెంట్, భయపెట్టే కథనం ఉంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయవచ్చో అబ్సెషన్ చిత్రం మరోసారి నిరూపించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks