OTT Movies: ఓటీటీలోకి 16 సినిమాలు- ఒక్కరోజే 9, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- 1700 కోట్ల ధురంధర్ 2 నుంచి థ్రిల్లర్స్ వరకు!
OTT Movies This Week: ఎండలు మండిపోతున్న వేళ ఈ వీకెండ్‌లో ఇంటి పట్టునే ఉండి ఎంజాయ్ చేసేలా ఓటీటీలు అదిరిపోయే కంటెంట్‌ను సిద్ధం చేశాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ఆహా, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మొత్తం 16 సినిమాల లిస్ట్ ఇక్కడ ఉంది. ఓ లుక్కేయండి!
OTT Releases This Week: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈ వారం కూడా యాక్షన్, థ్రిల్లర్, డ్రామా వంటి విభిన్న జోనర్లతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా వెండితెరపై వసూళ్ల సునామీ సృష్టించిన బ్లాక్ బస్టర్ల నుంచి ఉత్కంఠ రేపే థ్రిల్లర్ డాక్యుమెంటరీల వరకు ఓటీటీ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం.

17 వందల కోట్ల వీరుడు 'ధురంధర్' వచ్చేస్తున్నాడు!
థియేటర్లలో నెల రోజులకు పైగా సంచలనం సృష్టించిన 'ధురంధర్: ది రివెంజ్' ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ధురంధర్ 2 సినిమా రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ నటించిన ధురంధర్ 2 జియో హాట్‌స్టార్‌లో మే 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ అవనుంది.
క్రైమ్ డ్రామా 'కర్తవ్య'.. నెట్‌ఫ్లిక్స్‌లో!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మాణంలో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కర్తవ్య'. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ క్రైమ్ డ్రామాకు పుల్కిత్ దర్శకత్వం వహించారు. రసిక దుగ్గల్, సంజయ్ మిశ్రా వంటి ప్రతిభావంతులు నటించిన ఈ చిత్రం మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
విద్యార్థుల పోరాటం 'ఎగ్జామ్'
నేషనల్ అవార్డు గ్రహీత ఎ. సర్గుణం దర్శకత్వం వహించిన తమిళ డ్రామా ఓటీటీ సిరీస్ 'ఎగ్జామ్'. పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, భావోద్వేగాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సున్నితమైన కథాంశం కలిగిన సిరీస్ మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
యూపీ గ్యాంగ్‌స్టర్ల వేట.. ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2
యూపీ పోలీస్ ఎస్టీఎఫ్ అధికారి అవినాష్ మిశ్రా నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' రెండో సీజన్ కూడా ఈ వారమే రానుంది. రణదీప్ హుడా ప్రధాన పాత్రలో గ్యాంగ్‌స్టర్ల అరాచకాలను అరికట్టే సాహసోపేతమైన ప్రయాణాన్ని ఇందులో చూడొచ్చు. మే 15న జియో హాట్‌స్టార్‌లో ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2 ఓటీటీ రిలీజ్ అవనుంది.
యదార్థ సంఘటనల ఆధారంగా.. 'ది క్రాష్'
ఓహియోలో 17 ఏళ్ల యువతి ఉద్దేశపూర్వకంగా కారును గోడకు ఢీకొట్టి, తన ప్రియుడి మరణానికి కారణమైంది. 2022 నాటి ఈ ఒళ్లు గగుర్పొడిచే యదార్థ సంఘటన ఆధారంగా 'ది క్రాష్' డాక్యుమెంటరీని రూపొందించారు. ఇది మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ప్రీమియర్ అవనుంది.
ప్రముఖ హాస్యనటుడు మార్టిన్ షార్ట్ కెరీర్‌పై తీసిన 'మార్టిన్, లైఫ్ ఈజ్ షార్ట్' డాక్యుమెంటరీ (మే 12), మనీ హైస్ట్ స్పిన్-ఆఫ్ సిరీస్ 'బేర్లిన్ అండ్ ది లేడీ విత్ యాన్ ఎర్మైన్' (మే 15) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సందడి చేయనున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఒరు దురోహ సహచర్యతిళ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- మే 13
నెమిసిస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 14
సోల్‌మేట్ (జపనీస్ వెబ్ సిరీస్)- మే 14
ధురంధర్ 2 (హిందీ సినిమా)- మే 15 (ఓవర్సీస్ రిలీజ్)
కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ)- మే 15
బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 15
మార్టిన్, లైఫ్ ఈజ్ షార్ట్ (డాక్యుమెంటరీ సినిమా)- మే 15
ది క్రాష్ (డాక్యుమెంటరీ చిత్రం)- మే 15
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఆఫ్ క్యాంపస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 13
ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)- మే 15
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ది పనిషర్: వన్ లాస్ట్ కిల్ (ఇంగ్లీష్ సినిమా)- మే 12
తుఖ్రా కా మేరే ప్యార్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- మే 12
ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ సినిమా)- మే 15
ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) - మే 15
కాళిదాస్ 2 (తమిళ చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 12
తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా)- ఆహా ఓటీటీ- మే 15
టిఘీ (మరాఠీ మూవీ)- జీ5 ఓటీటీ- మే 15
ఓటీటీలోకి మొత్తంగా 16 సినిమాలు
వీటితో కలిపి ఈ వారం (మే 11 నుంచి 17 వరకు) మొత్తంగా 16 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 9 సినిమాలు ఒక్క మే 15న ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అలాగే, తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 మూవీస్ ఓటీటీ ప్రీమియర్ అవనున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


