...
...
Next Story

తండ్రికి హార్ట్ స్ట్రోక్.. పెళ్లి వాయిదా.. సంచలన నిర్ణయం తీసుకున్న స్మృతి మంధాన.. ఆ పోస్టులన్నీ డిలీట్

భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. మంధాన తండ్రికి గుండె పోటు రావడంతో ఇలా జరిగింది. అయితే తాజాగా తన వెడ్డింగ్ కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను స్మృతి మంధాన డిలీట్ చేసింది.

Published on: Nov 25, 2025, 11:29:09 IST
Advertisement

సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన తన వివాహం నిరవధికంగా వాయిదా పడిన ఒక రోజు తర్వాత భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధాన సంచలన నిర్ణయం తీసుకుంది. తన సోషల్ మీడియా ఖాతాల నుండి వివాహానికి సంబంధించిన ప్రతి పోస్టును డిలీట్ చేసింది.

స్మృతి మంధాన పెళ్లి

పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన
పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన

తన ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ తో స్మృతి మంధాన పెళ్లి గ్రాండ్ గా జరగాల్సింది. వెడ్డింగ్ కు ముందు అన్ని వేడుకలను ఈ జోడీ అంగరంగ వైభవంగా చేసుకుంది. కానీ నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. స్మృతి తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది.

అంబులెన్స్ లో

ఆదివారం స్మృతి మంధాన సొంత ఊరు సాంగ్లీలో జరగాల్సి ఉన్న వివాహం, ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఆకస్మికంగా అనారోగ్యానికి గురికావడంతో నిలిచిపోయింది. ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా ప్రకారం ఉదయం అల్పాహారం తీసుకుంటున్నప్పుడు మంధాన తండ్రికి గుండె సమస్య లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.

వెడ్డింగ్ పోస్ట్ పోన్

తన తండ్రితో సన్నిహిత సంబంధం కలిగి, తన క్రికెట్ ప్రయాణంలో ఆయన కీలక స్తంభమని చెప్పే మంధాన ఆయన కోలుకునే వరకు వివాహాన్ని వాయిదా వేయాలని వెంటనే నిర్ణయించుకున్నారని మిశ్రా ధృవీకరించారు. "స్మృతి చాలా స్పష్టంగా ఉంది. ఆమె తన తండ్రి బాగా ఉండాలని కోరుకుంటుంది, ఆ తర్వాత ఆమె వివాహం చేసుకుంటుంది" అని మిశ్రా అన్నారు.

వివాహ వేడుకలు

ఇప్పుడు తన పెళ్లికి సంబంధించిన పోస్టులన్నింటినీ మంధాన డిలీట్ చేసింది. ముందుగా తండ్రి పూర్తిగా కోలుకోవాలని ఆమె ఆశిస్తోంది. ఆ తర్వాత మరో ముహూర్తంలో పెళ్లి చేసుకునే అవకాశముంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks