...
...
Next Story

Sobhita Dhulipala Dating: వాటిని పట్టుకుని ఊగిసలాడితే మనల్నే కోల్పోతాం: డేటింగ్ కామెంట్స్‌పై శోభిత ధూళిపాళ కామెంట్స్

Sobhita Dhulipala On Never Married An Actor: అక్కినేని నాగ చైతన్యను వివాహమాడిన హీరోయిన్ శోభిత ధూళిపాళ, గతంలో నటులను డేటింగ్ చేయనని, పెళ్లి చేసుకోనని చెప్పిన కామెంట్స్‌పై స్పందించారు. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు మారడం సహజమని, నాటి అభిప్రాయంపై స్పష్టత ఇచ్చిన శోభిత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Oct 13, 2026, 13:45:43 IST
Advertisement

Sobhita Dhulipala On Never Married An Actor: అక్కినేని హీరో నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ప్రతి వార్తా సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత కామెంట్స్‌పై శోభితా స్పందించడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఒక సినీ నటుడిని ప్రేమించను

వాటిని పట్టుకుని ఊగిసలాడితే మనల్నే కోల్పోతాం: డేటింగ్ కామెంట్స్‌పై శోభిత ధూళిపాళ కామెంట్స్
వాటిని పట్టుకుని ఊగిసలాడితే మనల్నే కోల్పోతాం: డేటింగ్ కామెంట్స్‌పై శోభిత ధూళిపాళ కామెంట్స్

గతంలో 'నేను ఎప్పటికీ ఒక నటుడిని ప్రేమించను, డేటింగ్ చేయను, పెళ్లి చేసుకోను' అని శోభితా చెప్పిన మాటలను నెటిజన్లు తరచూ ప్రస్తావిస్తుంటారు. 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' ఇంటర్వ్యూలో ఈ విషయంపై శోభిత ధూళిపాళ నేరుగా వివరణ ఇచ్చారు.

భయపడేవారు ఎప్పటికీ మారరు

"మానవ ఆలోచనా విధానం కాలక్రమేణా మారుతూ ఉంటుంది. ఆ సమయంలో నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. అభిప్రాయాలు మార్చుకోవడానికి భయపడేవారే ఎప్పటికీ మారరు. కాలంతో పాటు మన ఆలోచనలను మార్చుకోవడం, కొత్త పరిస్థితులకు అలవాటు పడటం ఆరోగ్యకరమైన సంకేతం" అని శోభిత ధూళిపాళ తెలిపారు.

సమాజంలో వచ్చే విమర్శలపై స్పందన

నాగ చైతన్యతో బంధం బయటపడినప్పటి నుంచి సోషల్ మీడియాలో వీరిపై రకరకాల చర్చలు సాగాయి. గతంలో సమంతతో నాగ చైతన్య విడిపోయిన తర్వాత వీరి ప్రేమకథ మొదలవ్వడంతో అందరి దృష్టి వీరిపైనే నిలిచింది. పబ్లిక్ లైఫ్‌లో ఎదురయ్యే ఇలాంటి పరిస్థితులపై శోభితా స్పష్టమైన దృక్పథాన్ని వ్యక్తం చేశారు.

అభిప్రాయాలు రుతువుల లాంటివి

"సమాజంలో వచ్చే అభిప్రాయాలు రుతువుల లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. మారే వాతావరణాన్ని పట్టుకుని ఊగిసలాడితే మన అస్తిత్వాన్ని కోల్పోతాం. వాస్తవాన్ని గ్రహించి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే ముఖ్యం" అని శోభిత వివరించారు.

హైదరాబాద్ టూ ముంబై.. లాంగ్ డిస్టెన్స్ లైఫ్

ప్రస్తుతం శోభిత తన కెరీర్‌పై కూడా పూర్తి దృష్టి సారించారు. తమిళ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న 'వెట్టువమ్' అనే సైన్స్ ఫిక్షన్ డ్రామాలో శోభిత ధూళిపాళ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

వృషకర్మతో నాగ చైతన్య

వెట్టువమ్ సినిమా డిసెంబర్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు నాగ చైతన్య వృషకర్మ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks