Sobhita Dhulipala: తెలుగువారికి తెలుగువారే శత్రువులు- 16 ఏళ్లప్పుడు ఇల్లు వదిలిపెట్టడానికి కారణం చెప్పిన శోభిత ధూళిపాళ

Sobhita Dhulipala About Telugu People Psychology: తెలుగు సమాజంలో ఒకరి ఎదుగుదలను మరొకరు ప్రోత్సహించరంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై ప్రముఖ నటి, నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల తీవ్రంగా స్పందించారు. 16 ఏళ్ల చిన్న వయసులోనే ఇల్లు వదిలి ముంబైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వెల్లడించారు.

Published on: Sep 17, 2026, 10:55:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sobhita Dhulipala About Telugu People Psychology: తెలుగు మూలాలున్న హీరోయిన్స్ టాలీవుడ్‌లో రాణించడం అరుదనే భావన చాలాకాలంగా ఉంది. అలాంటి పరిమితులను అధిగమించి, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ప్రాజెక్టుల వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అక్కినేని వారి ఇంటి కోడలు, నటి శోభిత ధూళిపాళ.

తెలుగువారికి తెలుగువారే శత్రువులు- 16 ఏళ్లప్పుడు ఇల్లు వదిలిపెట్టడానికి కారణం చెప్పిన శోభిత ధూళిపాళ
తెలుగువారికి తెలుగువారే శత్రువులు- 16 ఏళ్లప్పుడు ఇల్లు వదిలిపెట్టడానికి కారణం చెప్పిన శోభిత ధూళిపాళ

అసలేం జరిగింది?

అయితే, మన సొంత సమాజంలో ఉన్న ఒక ప్రతికూల ధోరణిపై తాజాగా శోభిత ధూళిపాళ చేసిన వ్యాఖ్యలు డిజిటల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. హైదరాబాద్‌కు చెందిన అహల్య అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేశారు.

ప్రోత్సహించుకునే అలవాటు చాలా తక్కువ

"తెలుగువారికి ఇంకొక తెలుగువారే అతిపెద్ద శత్రువు. మన సమాజంలో ఒకరినొకరు ప్రోత్సహించుకునే అలవాటు చాలా తక్కువ. ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించినా, వినూత్నంగా ఏదైనా ప్రయత్నించినా.. వారికి మద్దతు ఇవ్వడం మానేసి, అందులో గొప్పతనం ఏముంది అని ప్రశ్నించడమే ఎక్కువ" అని ఆ వీడియోలో అహల్య పేర్కొన్నారు.

16 ఏళ్లకే ఇల్లు వదిలి వెళ్లాను: శోభిత ఆవేదన

సినిమాలు, సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకునే మనం, తోటి వారి ఎదుగుదలను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకోమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టుపై నటి శోభిత ధూళిపాళ స్పందిస్తూ '100' పర్సెంట్ ఎమోజీతో పూర్తిగా మద్దతు తెలిపారు. అంతటితో ఆగకుండా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

ఆడపిల్లల విషయంలో ఒత్తిడి రెట్టింపు ఉంటుంది

"మా ఊరి వాతావరణం కొత్తగా కలలు కనేవారిని, ప్రత్యేకించి వేరే రంగాల నుంచి వచ్చేవారిని తీవ్రంగా నిరుత్సాహపరిచేది. పైగా ప్రతీ విషయానికి తీర్పులు చెప్పే మనస్తత్వం ఎక్కువగా ఉండేది. ఆడపిల్లల విషయంలో ఈ ఒత్తిడి రెట్టింపు ఉంటుంది. అందుకే ఏ గ్యారంటీ లేకపోయినా 16 ఏళ్లకే నా బ్యాగ్ సర్దుకుని ముంబైకి వెళ్లిపోయాను" అని శోభిత వ్యాఖ్యానించారు.

కాస్త వెన్నుముకతో నిలబడాలని

అప్పట్లో తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ.. "ఇప్పుడు పరిస్థితులు మారాయని ఆశిస్తున్నాను. మన తెలుగు సమాజం తన రెక్కలను విప్పుకుని, కాస్త వెన్నుముకతో నిలబడాలని కోరుకుంటున్నాను" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు శోభిత ధూళిపాళ.

తెనాలి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు..

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించిన శోభిత, విశాఖపట్నంలో పెరిగారు. తండ్రి వేణుగోపాలరావు మర్చంట్ నేవీ ఇంజినీర్ కాగా, తల్లి శాంత కామాక్షి ఉపాధ్యాయురాలు. కార్పొరేట్ లా చదివిన శోభిత, 2013లో మిస్ ఎర్త్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

రామన్ రాఘవ్ 2.0 సినిమాతో

ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0' సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేశారు శోభిత ధూళిపాళ. అనంతరం అడవి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ, 'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్' వంటి అంతర్జాతీయ స్థాయి ఓటీటీ వెబ్ సిరీస్‌లు చేశారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ వీడియోకి శోభిత ధూళిపాళ కామెంట్
సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ వీడియోకి శోభిత ధూళిపాళ కామెంట్

హైదరబాదీ కోడలిగా

అలాగే మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంలో కీలక పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు శోభిత ధూళిపాళ. ఇక శోభిత ధూళిపాళ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, 2024 డిసెంబర్‌లో హీరో అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకుని హైదరాబాదీ కోడలిగా స్థిరపడ్డారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More