...
...
Next Story

Sona Mohapatra: ఆ మగాడు తనను తానే ప్రేమించుకుంటున్నాడా? మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రశ్నించిన సింగర్ సోనా మోహపాత్ర-ఏమైందంటే?

Singer Sona Mohapatra Criticizes Music Industry: ఆ మగాడు తనను తానే ప్రేమించుకుంటున్నాడా? అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్‌ను లేడి సింగర్ సోనా మోహపాత్ర ప్రశ్నించారు. అర్జిత్ సింగ్ పాడిన డ్యూయెట్ సాంగ్‌ను ఉదాహరణగా చూపిస్తూ హార్ట్ బ్రేక్ సాంగ్స్ అన్నీ పురుషుల కోసమే రాయించారా అని సోనా నిలదీశారు.

Published on: Jun 22, 2026, 12:57:13 IST
Advertisement

Singer Sona Mohapatra Criticizes Music Industry: బాలీవుడ్‌లో లింగ వివక్ష, మహిళలను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూపించడంపై ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా మాట్లాడే సింగర్ సోనా మోహపాత్ర తాజాగా మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు.

మహిళా గాయనీల ప్రాధాన్యత

ఆ మగాడు తనను తానే ప్రేమించుకుంటున్నాడా? మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రశ్నించిన సింగర్ సోనా మోహపాత్ర-ఏమైందంటే?
ఆ మగాడు తనను తానే ప్రేమించుకుంటున్నాడా? మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రశ్నించిన సింగర్ సోనా మోహపాత్ర-ఏమైందంటే?

కేవలం సినిమాల్లోనే కాదు, సంగీత ప్రపంచంలోనూ మహిళల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతోందని సోనా మోహపాత్ర మండిపడ్డారు. ప్రత్యేకించి ప్రేమ, విరహ గీతాలలో (Heartbreak songs) మహిళా గాయనీలకు ఇచ్చే ప్రాధాన్యత నానాటికీ తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో (Literature Festival) సోనా మోహపాత్ర ఈ వ్యాఖ్యలు చేశారు. అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛకు కేరళ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని, అందుకే ఇక్కడ ఈ నిజాలు మాట్లాడుతున్నానని ఆమె పేర్కొన్నారు.

కొత్తగా లేడి స్టార్ సింగర్స్

గత రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో వస్తున్న మార్పులను గమనిస్తే, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్ లాంటి కొద్దిమంది మినహా కొత్తగా లేడి స్టార్ సింగర్లు రాకపోవడానికి ఈ వివక్షే కారణమని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే తరహా ధోరణి సౌత్ ఇండస్ట్రీలోనూ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుందని కొందరు గుర్తుచేస్తున్నారు.

డ్యూయెట్ పాటల్లో చివరి కోరస్‌కే పరిమితమా?

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో క్లిప్‌లో సోనా తన చేదు అనుభవాలను పంచుకున్నారు. బాలీవుడ్‌లో బాధను వ్యక్తపరిచే హార్ట్ బ్రేక్ సాంగ్స్ అన్నీ కేవలం మగవారికే రిజర్వ్ చేశారని సోనా మోహపాత్ర ఆరోపించారు. ప్రస్తుత కాలంలో కేవలం మగవారికి మాత్రమే హృదయ విదారక బాధలు, ప్రేమ భావనలు ఉంటాయా అని ప్రశ్నించారు.

"జాలిమా పాటలో ముఖ్డా, అంతరా.. ఇలా అన్నీ మగ గాయకుడే పాడేశారు. ఆ పాట పాడుతున్న అర్జిత్ సింగ్ తప్పేమీ లేదు, ఆయన గొప్ప ఆర్టిస్ట్. కానీ ఆడవాళ్ల గొంతు కేవలం పాట చివర్లోనే ఎందుకు రావాలి? ఆ పాట కంపోజ్ చేసిన ప్రీతమ్‌ను (సంగీత దర్శకుడు) నేను ఒకటే అడిగాను.. ఆ మగాడు తనను తానే ప్రేమించుకుంటున్నాడా? ఇదెలాంటి డ్యూయెట్ సాంగ్ అవుతుంది?" అని సోనా మోహపాత్ర ప్రశ్నించారు.

మహిళా స్టార్ సింగర్స్ ఎందుకు పుట్టడం లేదు?

సదరు 'జాలిమా' గీతాన్ని అర్జిత్ సింగ్‌తో పాటు హర్ష్‌దీప్ కౌర్ ఆలపించగా, అది షారుఖ్ ఖాన్, మాహిరా ఖాన్‌లపై పిక్చరైజ్ చేశారు. కేవలం వేదికపైనే కాకుండా, ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కామెంట్ సెక్షన్ ద్వారా కూడా ఆమె తన చర్చను కొనసాగించారు.

ఇది కేవలం పాటల గురించిన విషయం కాదు, ఇండస్ట్రీలో మహిళల ప్రాతినిధ్యం (Representation) గురించిన చర్చ అని స్పష్టం చేశారు. ఒక పరిశ్రమ ఐకానిక్ మహిళా కథనాలను, భావోద్వేగాలను సృష్టించడం ఆపేస్తే, కాలక్రమేణా అక్కడ మహిళా స్టార్ సింగర్స్ పుట్టడం కూడా ఆగిపోతుందని హెచ్చరించారు. భారత దేశంలో దీని గురించి ఎవరు పట్టించుకుంటారు అని సోనా మోహపాత్ర నిలదీశారు.

రాయడమే తగ్గించేసిందని

"మహిళలు ఎప్పుడూ విరహ గీతాలు పాడలేదని నా ఉద్దేశం కాదు. బాలీవుడ్ అలాంటి పాటలు రాయడమే తగ్గించేసిందని నా పాయింట్. గత రెండు దశాబ్దాలుగా పెద్ద పెద్ద రొమాంటిక్, హార్ట్‌బ్రేక్ సాంగ్స్‌లో 80 నుంచి 90 శాతం కేవలం మగ గాయకులకే ఇస్తూ పోతే, మగవారితో సమానంగా మహిళా మ్యూజిక్ స్టార్లు ఎందుకు రావడం లేదని ఆశ్చర్యపోవడంలో అర్థం లేదు. ఇది ఒక వ్యవస్థ లోపం, బాధితుల సమస్య కాదు. పాటలను లెక్కబెట్టి అప్పుడు మాట్లాడదాం" అని సోనా మోహపాత్ర గట్టిగా సమర్థించుకున్నారు.

ఎలాంటి రిస్క్ తీసుకోకుండా

బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా కేవలం సేఫ్ జోన్‌లో సాగిపోతోందని, అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని సోనా మోహపాత్ర ముగించారు. ప్రస్తుతం సోనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks