Sonam Kapoor Anand Ahuja Buys ₹51 Cr Flats For Servants: బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్, స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆమె భర్త, బిలియనీర్ బిజినెస్‌మెన్ ఆనంద్ అహుజా లండన్ నగరంలో అత్యంత వైభోగంగా జీవిస్తున్నారు. యూకేలోనే అత్యంత ఖరీదైన, లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అయిన 'నాటింగ్ హిల్' ప్రాంతంలో ఈ దంపతులకు భారీ ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది.

మూడేళ్ల క్రితం వీరు అక్కడ ఒక పాత బంగళాను ఏకంగా 21 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 270 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేశారు. దానికి అదనంగా మరో 4.7 మిలియన్ పౌండ్లు (రూ. 60.4 కోట్లు) ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇద్దరు పిల్లలు వాయు, రుద్రలోక్‌లతో కలిసి సోనమ్ కపూర్ దంపతులు ఇక్కడే నివసిస్తున్నారు.
పని మనుషుల కోసం రూ. 51 కోట్ల ఫ్లాట్లు?
ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ లండన్‌లో ఒక సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. తమ బంగళాకు సమీపంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఐదు ఫ్లాట్లను వీరు దాదాపు 4 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 51.4 కోట్లు) కొనుగోలు చేసినట్లు బ్రిటీష్ మీడియా డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది.
అయితే, ఈ ఫ్లాట్లను తమ ఇంట్లో పనిచేసే సిబ్బందికి (Servant Quarters) కేటాయించేందుకు కొన్నారనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో ఆ బిల్డింగ్‌లో నివసించే మిగతా నివాసితులు సోనమ్ దంపతులపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భయాందోళనలో స్థానికులు.. బెదిరింపుల ఆరోపణలు
ఈ ఆస్తుల కొనుగోలు వెనుక సోనమ్ కపూర్ దంపతులకు సంబంధించిన ఒక కంపెనీ ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే, సదరు కంపెనీ ప్రతినిధులు తమను బెదిరిస్తున్నారని ఒక నివాసి ఆవేదన వ్యక్తం చేశారు.
{{/usCountry}}ఈ ఆస్తుల కొనుగోలు వెనుక సోనమ్ కపూర్ దంపతులకు సంబంధించిన ఒక కంపెనీ ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే, సదరు కంపెనీ ప్రతినిధులు తమను బెదిరిస్తున్నారని ఒక నివాసి ఆవేదన వ్యక్తం చేశారు.
{{/usCountry}}"వారు అంగబలం, అర్థబలం ఉన్న శక్తివంతులు కావడంతో, మేము నోరు విప్పడానికి భయపడేలా చేస్తున్నారు. ఇక్కడ మేమంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటున్నాం. కానీ, కొంతమంది బిలియనీర్లు మా నివాస ప్రాంతాన్ని వారి ఆటస్థలంగా మార్చేస్తున్నారు. మేము అభ్యంతరం చెబితే, ఈ ఫ్లాట్లను 'సోషల్ హౌసింగ్' (ప్రభుత్వ సాయంతో పేదలకు ఇచ్చే ఇళ్లు) కింద ఇస్తామని విచిత్రమైన బెదిరింపులకు దిగుతున్నారు. తెర వెనుక ఉండి మా ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు" అని ఒక స్థానిక నివాసి ఆరోపించారు.
ప్రతినిధుల వివరణ.. ఆనంద్ అహుజా నేపథ్యం
ఈ వివాదంపై సోనమ్ కపూర్ ప్రతినిధులు స్పందించారు. ఈ కొనుగోళ్లతో కపూర్ కుటుంబానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం భవిష్యత్తు పెట్టుబడి (Investment) కోసమే ఆయా ఫ్లాట్లను సదరు కంపెనీ కొనుగోలు చేసిందని వెల్లడించారు. సోనమ్ కపూర్ దంపతులకు లండన్‌లోనే కాకుండా ఢిల్లీ, ముంబైలలో కూడా సొంత ఇళ్లు ఉన్నాయి.
సోనమ్ భర్త ఆనంద్ అహుజా భారతదేశంలోని ప్రముఖ దుస్తుల ఎగుమతి సంస్థ 'షాహీ ఎక్స్‌పోర్ట్స్' బిలియనీర్ కుటుంబానికి చెందినవారు. ఆయన 'భానె' (Bhaane) బ్రాండ్‌కు సీఈఓగా వ్యవహరించడంతో పాటు 'వెజ్‌నాన్‌వెజ్' స్నీకర్ స్టోర్ కో-ఫౌండర్‌గా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు.
సోనమ్ కపూర్ దంపతులపై ఆరోపణలు
ఇదిలా ఉంటే, 2018లో పంజాబీ సంప్రదాయంలో వివాహం చేసుకున్న సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా జంటకు ఈ ఏడాది మార్చిలోనే రెండో సంతానంగా రుద్రలోక్ జన్మించాడు. వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దదైనా, లండన్ నివాసితుల నుంచి వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.