...
...
Next Story

Sonam Kapoor: రెండో కుమారుడి పేరు చెప్పిన హీరోయిన్ సోనమ్ కపూర్- వేదాల ఆధారంగా ఇద్దరి కొడుకులకు నామకరణం- లోతైన అర్థంతో!

Sonam Kapoor Second Son Name Reveal: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తన రెండో కుమారుడి పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన ఇద్దరు బిడ్డల పేర్ల మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని వివరిస్తూ సోనమ్ కపూర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Published on: May 10, 2026, 06:18:20 IST
Advertisement

Sonam Kapoor Second Son Name Reveal: బాలీవుడ్ వెండితెర 'మసక్కలి' సోనమ్ కపూర్ ఇంట మళ్లీ వేడుక మొదలైంది. హీరోయిన్ సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా దంపతులు మార్చి 29, 2026న రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా తమ రెండో కుమారుడికి 'రుద్రలోక్ కపూర్ అహుజా' అని నామకరణం చేసినట్లు ఈ జంట అధికారికంగా వెల్లడించింది.

విష్ణువు కటాక్షం.. ఏకాదశి శుభవేళ

రెండో కుమారుడి పేరు చెప్పిన హీరోయిన్ సోనమ్ కపూర్- వేదాల ఆధారంగా ఇద్దరి కొడుకులకు నామకరణం- లోతైన అర్థంతో!
రెండో కుమారుడి పేరు చెప్పిన హీరోయిన్ సోనమ్ కపూర్- వేదాల ఆధారంగా ఇద్దరి కొడుకులకు నామకరణం- లోతైన అర్థంతో!

కేవలం పేరు ప్రకటించడమే కాకుండా, ఆ పేరు వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని, పురాణ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సోనమ్ కపూర్ షేర్ చేసిన సందేశం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

తమ రెండో కుమారుడు ఏకాదశి వంటి అత్యంత పవిత్రమైన రోజున జన్మించాడని, ఇది విష్ణుమూర్తి కృప వల్ల జరిగిన అద్భుతమని సోనమ్ కపూర్ పేర్కొన్నారు.

"మా జీవితాలను మరోసారి దైవిక శక్తి మార్చేసింది. రుద్రలోక్ రాక ఒక దైవిక సంకేతంలా, తన అన్నయ్య వాయుతో ఉన్న ఒక ఆధ్యాత్మిక అనుబంధంలా మాకు కనిపిస్తోంది" అని సోనమ్ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఇద్దరు కుమారులు వాయు, రుద్రలోక్ మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె వేదాల ఆధారంగా వివరించారు.

వాయు - రుద్ర: ప్రాణవాయువుకు, శక్తికి ప్రతీకలు

వేదాల ప్రకారం 'రుద్ర' అంటే గర్జించేవాడు, అత్యంత శక్తిమంతుడు. బాధలను మూలాల నుంచి తొలగించేవాడని అర్థం. "మా పెద్ద కుమారుడు 'వాయు' పేరు విష్ణుమూర్తికి, జీవనాధారమైన గాలికి ప్రతీక. ఇప్పుడు 'రుద్ర' పేరుతో ఆ బంధం పూర్తయింది. శ్వాస, శక్తి.. రక్షణ, పరివర్తన.. ఒకరినొకరు బలపరుచుకునే శక్తుల్లా మా ఇద్దరు బిడ్డలు ఎదుగుతారని ఆశిస్తున్నాం" అని సోనమ్ కపూర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

"ప్రేమతో పాటు సోనమ్ దగ్గర అపారమైన మాతృశక్తి ఉంది" అంటూ రియా కపూర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, 2018లో వివాహం చేసుకున్న సోనమ్-ఆనంద్ దంపతులకు 2022లో మొదటి కుమారుడు వాయు జన్మించాడు. ఇప్పుడు రుద్రలోక్ రాకతో అనిల్ కపూర్ ఇల్లు మనవళ్లతో కోలాహలంగా మారింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ ప్రముఖులు సోనమ్ కపూర్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సోనమ్ కపూర్ రెండో కుమారుడి పేరు ఏమిటి?

సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా తమ రెండో కుమారుడికి 'రుద్రలోక్ కపూర్ అహుజా' అని పేరు పెట్టారు.

2. సోనమ్ కపూర్ రెండో బిడ్డ ఎప్పుడు జన్మించారు?

సోనమ్ కపూర్ మార్చి 29, 2026న తన రెండో కుమారుడికి జన్మనిచ్చారు.

3. సోనమ్ ఇద్దరు కుమారుల పేర్లకు ఉన్న సంబంధం ఏమిటి?

పెద్ద కుమారుడు 'వాయు' పేరు విష్ణువుకు, జీవనాధారమైన గాలికి ప్రతీక కాగా, రెండో కుమారుడు 'రుద్ర' పేరు శక్తికి, పరివర్తనకు చిహ్నం. ఈ రెండు పేర్లు వేద కాలం నాటి శ్వాస, శక్తి అనుబంధాన్ని సూచిస్తాయని సోనమ్ వివరించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe