Singer Sonu Nigam Buys 44 Cr Flat: ప్రముఖ గాయకుడు సోను నిగమ్ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో భారీ కొనుగోలుతో వార్తల్లో నిలిచారు. ముంబైలోనే అత్యంత ఖరీదైన అందేరీ వెస్ట్ ప్రాంతంలో ఏకంగా రూ.44.30 కోట్లతో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు స్టార్ సింగర్ సోను నిగమ్.
వాణిజ్య, నివాస ప్రాపర్టీలు కొంటూ

రియల్ ఎస్టేట్ విశ్లేషణ సంస్థ 'లియాసెస్ ఫోరాస్' సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ లావాదేవీ అక్టోబర్ 30న పూర్తయింది. ముంబై వినోద రంగానికి కేంద్రబిందువైన అందేరీ ప్రాంతంలో సెలబ్రిటీలు ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం వర్ధమాన వ్యాపార శైలిగా మారింది. ఈ క్రమంలోనే సోను నిగమ్ గత కొద్దికాలంగా వాణిజ్య, నివాస ప్రాపర్టీలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ తన బిజినెస్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నారు.
రూ.44.30 కోట్ల ఫ్లాట్.. రూ.2.65 కోట్ల స్టాంప్ డ్యూటీ
అందేరీ వెస్ట్‌లోని జుహు-వెర్సోవా లింక్ రోడ్డులో ఉన్న 'వర్తమాన్' (గతంలో మన్నత్ అని పిలిచేవారు) నివాస సముదాయంలో పై అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. మొత్తం 3,055 చదరపు అడుగుల (283.82 చదరపు మీటర్లు) కార్పెట్ విస్తీర్ణం ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లను పొందారు. ప్రతి పార్కింగ్ స్థలం దాదాపు 10 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది.
ఈ ఆస్తిని మనీష్ మంగళ్‌కుమార్ దర్దా నుంచి ఆయన పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కల్పనా మనీష్ దర్దా ద్వారా కొనుగోలు చేశారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలోకి వచ్చే ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం సోను నిగమ్ రూ.2.65 కోట్ల (రూ.2,65,80,000) స్టాంప్ డ్యూటీ చెల్లించారు.
వరస రియల్ ఎస్టేట్ పెట్టుబడులు
గాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సోను నిగమ్.. గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో వరుస పెట్టుబడులు పెడుతున్నారు. కేవలం నివాస గృహాలే కాకుండా వాణిజ్య సముదాయాలు, భూములను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
{{/usCountry}}గాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సోను నిగమ్.. గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో వరుస పెట్టుబడులు పెడుతున్నారు. కేవలం నివాస గృహాలే కాకుండా వాణిజ్య సముదాయాలు, భూములను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
{{/usCountry}}అందేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా రోడ్డులో ఉన్న ఆస్టన్ బిల్డింగ్‌లో రూ.17 కోట్ల వ్యయంతో మూడు కమర్షియల్ ఆఫీస్ స్పేస్‌లను కొనుగోలు చేశారు. అలాగే ఫిబ్రవరిలో ఆయన తండ్రి అగమ్ కుమార్ నిగమ్ ముంబైలోని మాధ్ ఐలాండ్‌లో రూ.10 కోట్ల విలువైన భూమిని, నివాస సముదాయాన్ని సొంతం చేసుకున్నారు.
అమ్మకాలు, లీజుల ద్వారా ఆదాయం
కేవలం కొనుగోళ్లే కాకుండా కొన్ని ఆస్తులను విక్రయించి, మరికొన్నింటిని లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందుతున్నారు సింగన్ సోను నిగమ్. కర్జత్ ప్రాంతంలో 1.067 హెక్టార్ల భూమిని రూ.95 లక్షలకు అమ్మేశారు. అదే ప్రాంతంలో 1.9 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములను రూ.1.95 కోట్లకు విక్రయించారు.
శాంటాక్రుజ్ ఈస్ట్‌లోని బీకేసీ ట్రేడ్ సెంటర్‌లో ఉన్న 4,257 చదరపు అడుగుల కమర్షియల్ ప్రాపర్టీని 'పట్నీ హాస్పిటాలిటీ' అనే సంస్థకు ఐదేళ్ల కాలానికి రూ.12.61 కోట్లకు లీజుకు ఇచ్చారు. ముంబైలో లగ్జరీ రియల్ ఎస్టేట్ ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సోను నిగమ్ చేస్తోన్న ఈ భారీ పెట్టుబడులు ట్రేడింగ్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారాయి.