Sreeleela: అదరగొట్టే డ్యాన్స్ తో, ఆకట్టుకునే యాక్టింగ్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకుంటూ శ్రీలీల సాగిపోతుంది. తెలుగు సినిమాలతో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మూవీస్ చేస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఓం చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
5 నెలల్లో 5 సినిమాలు

ఒకప్పుడు టాలీవుడ్ లో శ్రీలీల జోరు మామూలుగా సాగలేదు. ఆమె నటించిన తెలుగు సినిమాలు 5 నెలల్లో 5 రిలీజ్ కావడం విశేషం. 2023 సెప్టెంబర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించిన ‘స్కంద’ రిలీజైంది. ఆ తర్వాత వరుసగా భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలు చేసింది శ్రీలీల. వరుసగా 5 నెలల్లోనే ఈ 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి.
రెండేళ్లలో మూడు చిత్రాలు
టాలీవుడ్ లో శ్రీలీల స్పీడ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆమె హీరోయిన్ గా చేసిన మూవీస్ వరుసగా ఫ్లాప్ కావడమే అందుకు కారణం. అందుకే 2025 నుంచి ఇప్పటివరకూ ఆమె తెలుగులో ‘రాబిన్ హుడ్’, ‘మాస్ జాతర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు మాత్రమే చేసింది. ఇవీ కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.
తెలుగులో బ్రేక్
తెలుగులో వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో శ్రీలీలకు ఇక్కడ ఆఫర్స్ రావట్లేదనే ప్రచారం జోరందుకుంది. ఆమె చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. హిందీ, తమిళంలో సినిమాలు చేస్తుంది. అయితే సినిమాల షూటింగ్ లో విరామం, తన కెరీర్ గురించి తాజాగా శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
రెండేళ్లు అలా
తాజాగా ఓం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘మీ అందరికీ తెలుసు. మెడిసన్ తర్వాత ముంబయిలో రెండేళ్లు ఇంటర్న్ షిప్ చేస్తున్నా. ఒకానొక టైమ్ లో సినిమా ఆఫర్స్ వచ్చినా చేయలేకపోయా. ఎందుకంటే నేను ఫిజికల్ గా అక్కడ అటెండ్ కావాల్సి వచ్చింది’’ అని శ్రీలీల చెప్పింది.
ఆ తప్పు తెలుసుకున్నా
{{/usCountry}}తాజాగా ఓం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘మీ అందరికీ తెలుసు. మెడిసన్ తర్వాత ముంబయిలో రెండేళ్లు ఇంటర్న్ షిప్ చేస్తున్నా. ఒకానొక టైమ్ లో సినిమా ఆఫర్స్ వచ్చినా చేయలేకపోయా. ఎందుకంటే నేను ఫిజికల్ గా అక్కడ అటెండ్ కావాల్సి వచ్చింది’’ అని శ్రీలీల చెప్పింది.
ఆ తప్పు తెలుసుకున్నా
{{/usCountry}}‘‘నా ఇండస్ట్రీ జర్నీ మీకు తెలుసు. నేను చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చా. ఏ సినిమాలో ఛాన్స్ వచ్చినా చేసుకుంటూ పోయా. అప్పుడు మూవీస్ ను సెలక్ట్ చేసుకునే పొజిషన్ లో లేను. కాబట్టి ఫ్లోలో వెళ్లిపోయా. అయినా మీరు ప్రేమ చూపించారు. అంతకంటే ఆనందం ఏం లేదు.
ఆ తర్వాత ఆలోచించుకున్నా. నేను చేస్తున్న తప్పు ఏంటీ అని తెలుసుకున్నా. ఆ టైమ్ లో డైెరెక్టర్ రాజ్ కుమార్ పెరియాస్వామిని కలిశా. నీకు కావాల్సింది ఎంచుకున్నప్పుడే, సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడే నీ లైఫ్ మారిపోతుందని ఆయన చెప్పారు’’ అని శ్రీలీల పేర్కొంది.