...
...
Next Story

Srimathi OTT: నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ వచ్చేసింది.. రేణు దేశాయ్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Srimathi OTT: ‘35 చిన్న కథ కాదు’ విజయం తర్వాత నివేదా థామస్ మరోసారి తెలుగింటి గృహిణిగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జీ5 తెలుగు ఒరిజినల్ చిత్రం ‘శ్రీమతి’ అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో చూసేయండి.

Published on: Nov 23, 2026, 18:18:11 IST
Advertisement

Srimathi OTT: తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ సహజమైన, ఎమోషనల్ పాత్రలతో దగ్గరయ్యే నివేదా థామస్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘శ్రీమతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘స్కైలాబ్’ ఫేమ్ విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు.

క్లాసికల్ డ్యాన్సర్ గా

నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ వచ్చేసింది.. రేణు దేశాయ్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ వచ్చేసింది.. రేణు దేశాయ్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

‘శ్రీమతి’ సినిమాలో నివేదా థామస్ మధ్యతరగతి గృహిణి పాత్రలో కనిపించనున్నారు. గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ కావాలని ఆమె కల కంటుంది. పెళ్లి అనేది కొత్త జీవితానికి నాంది అవుతుందని అనుకుంటుంది. కానీ అదే భారంగా మారుతుంది.

వంటింటి కుందేలు

సంప్రదాయాలు, అంతులేని ఇంటి బాధ్యతల మధ్య మధుశ్రీ కల కరిగిపోతుంది. ఆమె వంటింటి కుందేలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే, మరోవైపు తన ఆత్మగౌరవం, ప్రత్యేక గుర్తింపు కోసం శ్రీమతి సాగించే భావోద్వేగ ప్రయాణాన్ని ట్రైలర్‌లో హృద్యంగా చూపించారు. ప్రతి మధ్యతరగతి ఇల్లాలి జీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.

రేణు దేశాయ్ ఎంట్రీ

శ్రీమతి చిత్రంలో నివేదా థామస్‌తో పాటు నటి రేణు దేశాయ్, యంగ్ హీరో తిరువీర్ కీలక పాత్రల్లో నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా రేణు దేశాయ్ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఆమె మ్యూజిక్ టీచర్ గా కనిపించనున్నారు. వీరితో పాటు విరాజ్ అశ్విన్, హరితేజ, గోపరాజు రమణ, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, సుదర్శన్, మణిక చిక్కాల తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

‘శ్రీమతి’ టీజర్, తాజాగా విడుదలైన ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు చూసిన నెటిజన్లు దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుపుతున్నారు. మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తరహా కథాంశం ఇందులో కనిపిస్తోందంటూ, ఇది ఆ సినిమాకు రీమేకా లేక ఒరిజినల్ కథా అనే సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అయితే దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఈ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎలా మలిచారనేది డిసెంబర్ 4న జీ5 వేదికగా సినిమా విడుదలయ్యాక పూర్తిగా స్పష్టం కానుంది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ‘శ్రీమతి’ చక్కటి అనుభూతిని అందించనుంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks