Rajamouli Varanasi: ఇంకా 10 రోజులే.. వారణాసిపై రాజ‌మౌళి షాకింగ్ అప్‌డేట్ .. సైన్స్ ఫిక్షన్ కాదు.. బ్రెజిల్‌లో అవార్డు!

Rajamouli Varanasi: ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న మూవీ ‘వారణాసి’. ఈ సినిమాపై దర్శకుడు రాజమౌళి ఇచ్చిన లేటెస్ట్ షాకింగ్ అప్టేడ్ వైరల్ గా మారింది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కాదని రాజమౌళి వెల్లడించారు. బ్రెజిల్ లో ఆయన ఓ అవార్డు అందుకున్నారు.

Published on: Oct 20, 2026, 11:01:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rajamouli Varanasi: జపాన్, అమెరికాల తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లోనూ రాజమౌళి మేనియా వేగంగా విస్తరిస్తోంది. బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళికి అంతర్జాతీయ చిత్రసీమకు చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మక 'లియోన్ కాకాఫ్ అవార్డు'ను ప్రధానం చేశారు.

ఇంకా 10 రోజులే.. వారణాసిపై రాజ‌మౌళి షాకింగ్ అప్‌డేట్ .. సైన్స్ ఫిక్షన్ కాదు.. బ్రెజిల్‌లో అవార్డు!
ఇంకా 10 రోజులే.. వారణాసిపై రాజ‌మౌళి షాకింగ్ అప్‌డేట్ .. సైన్స్ ఫిక్షన్ కాదు.. బ్రెజిల్‌లో అవార్డు!

వారణాసి షూటింగ్

ఈ సందర్భంగా మాట్లాడిన జక్కన్న.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వారణాసి' ప్రొడక్షన్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. "ఇంకో 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ అక్టోబర్ చివరినాటికి చిత్రీకరణ పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత షెడ్యూల్ చేసిన విధంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతాయి. కచ్చితంగా ఈ సినిమాను బ్రెజిల్ థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేస్తాం" అని రాజమౌళి వెల్లడించారు.

'వారణాసి' సైన్స్ ఫిక్షన్ కాదు

గత కొన్ని నెలలుగా 'వారణాసి' సినిమా టైమ్ ట్రావెల్ లేదా సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోందంటూ జరుగుతున్న ప్రచారానికి రాజమౌళి స్వయంగా స్వస్తి పలికారు. "చాలామంది ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకుంటున్నారు, కానీ ఇది సై-ఫై కాదు. ఇది భారతీయ పురాణాల అంశాలు (Mythological Elements) కలగలిసిన ఒక విజువల్ ఫాంటసీ మూవీ" అని జక్కన్న క్లారిటీ ఇచ్చారు.

స్టోరీ ఇదే

ఏడెనిమిది విభిన్న కథాంశాలను లేదా ఏడు వేర్వేరు సినిమాల ఎమోషన్లను ఒక్క సినిమాలో తీసుకురావడమే తమకు ఎదురైన అతిపెద్ద ఛాలెంజ్ అని వారణాసి గురించి రాజమౌళి చెప్పారు.

‘‘మొదట్లో విడిపోయిన తండ్రీకొడుకుల బంధం.. ఆ తర్వాత తిరిగి ఎలా నిలబడిందనే ఎమోషనల్ జర్నీనే ఈ వారణాసి సినిమా. ఈ కథలో ఒక యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్ మధ్య సాగే అత్యంత అందమైన లవ్ స్టోరీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది’’ అని రాజమౌళి తెలిపారు.

గ్లోబల్ రిలీజ్

గ్లోబల్ ఆడియన్స్ టేస్ట్‌కు తగినట్లుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్, మలయాళ వర్సటైల్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్ అత్యంత కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి ఈ వారణాసికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాతలు కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More