SS Rajamouli: తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాతో ఆస్కార్ వేదికపై భారతీయ జెండాను ఎగురవేసిన తర్వాత.. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? హాలీవుడ్లో సినిమా చేస్తారా? లేదా? అనే అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

తాజాగా బ్రెజిల్లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన రాజమౌళి.. స్థానిక బ్రెజిలియన్ మీడియా ('ఒమెలెట్') కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో వస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi) షూటింగ్ కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉందని క్లారిటీ ఇచ్చారు.
"కనీసం ఒక హాలీవుడ్ సినిమా అయినా చేయాలనుంది!"
హాలీవుడ్ వర్కింగ్ కల్చర్, అక్కడ ఉండే నెట్వర్కింగ్, ప్రొడక్షన్ నిర్మాణం గురించి రాజమౌళి ఎంతో ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. "నాకు హాలీవుడ్లో కనీసం ఒక సినిమా అయినా చేయాలని ఉంది. అక్కడ ఉండే పక్కా వర్క్ ఎథిక్స్, వర్క్ స్ట్రక్చర్ నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హాలీవుడ్ ప్రొడక్షన్లో పనిచేయడం నాకు ఎంతో ఇష్టం" అని రాజమౌళి తెలిపారు.
అయితే 'RRR' తర్వాత వచ్చిన అవకాశాలను ఎందుకు తాను పక్కన పెట్టాల్సి వచ్చిందో వివరిస్తూ.. "'RRR' గ్లోబల్ హిట్ అయ్యాక హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. అందులో కొన్ని ఆఫర్లు ఇప్పటికీ ఓపెన్‌గానే ఉన్నాయి. కానీ 'RRR' సమయానికే నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్ 'వారణాసి' (Varanasi) ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నాను. నా మైండ్ ఒకేసారి రెండు ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టలేదు. ఒక పని పూర్తయ్యాకే మరో పని గురించి ఆలోచించడం నా అలవాటు. 'వారణాసి' పూర్తయ్యాక హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను" అని రాజమౌళి తెల్చిచెప్పారు.
కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే బాకీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి'. ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు మైండ్ బ్లాకింగ్ అప్డేట్ ఇచ్చారు జక్కన్న.
{{/usCountry}}సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి'. ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు మైండ్ బ్లాకింగ్ అప్డేట్ ఇచ్చారు జక్కన్న.
{{/usCountry}}ఈ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రధాన షూటింగ్ దాదాపు పూర్తయిందని, కేవలం మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని రాజమౌళి ధృవీకరించారు. భారతీయ ఇతిహాసాలను తెరపై ఆవిష్కరించే క్రమంలో తాను గతంలో ఎప్పుడూ పూర్తి సంతృప్తి చెందలేదని, కానీ 'వారణాసి' రూపంలో విజన్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నానని వెల్లడించారు.
2027 ఏప్రిల్ 7న 'వారణాసి' వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్
విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కాంచిలతో కలిసి రాజమౌళి స్క్రీన్‌ప్లే సమకూర్చిన ఈ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
భారీ వీఎఫ్ఎక్స్ (VFX), అంతర్జాతీయ స్థాయి యాక్షన్ స్టంట్స్‌తో రూపొందుతున్న ఈ ఎపిక్ వరల్డ్-ట్రాటర్ ఫిల్మ్‌ను 2027 ఏప్రిల్ 7న (ఉగాది పండుగ కానుకగా) ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ తేదీని ఇప్పటికే అధికారికంగా ఖరారు చేశారు. 'వారణాసి' పూర్తయిన తర్వాతే రాజమౌళి డైరెక్ట్ హాలీవుడ్ ప్రాజెక్ట్ వైపు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.