వారణాసితో ప్రపంచ సినీ రంగంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో రికార్డులు బ్రేక్ చేయాలనే కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రపంచవ్యాప్తంగా మూవీకి భారీ క్రేజ్ దక్కేలా చూడటం కోసం ఇప్పుడే ఇంటర్నేషనల్ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా కీ రోల్ ప్లే చేస్తోంది.
వారణాసి ప్రమోషన్లు

సాధారణంగా అయితే మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తారు. అదే లాంఛ్ ఈవెంట్ అయితే ఏదో క్లోజ్డ్ సర్క్యూట్ లో చేసేస్తారు. కానీ రాజమౌళి మాత్రం వారణాసి లాంఛ్ ఈవెంట్ నే భారీ స్థాయిలో నిర్వహించారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ఈవెంట్ ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ ను తనవైపునకు తిప్పుకుంది. ఈ లాంఛ్ ఈవెంట్ నుంచే మూవీ ప్రమోషన్లు స్టార్ట్ చేసేశారు రాజమౌళి.
ప్రియాంక చోప్రాతో
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. హాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన ఈ ఇండియన్ భామను ఇంటర్నేషనల్ ప్రమోషన్లలో కీ రోల్ ప్లే చేసేలా రాజమౌళి చూస్తున్నారు. ఇవాళ (నవంబర్ 18) ఇన్ స్టాగ్రామ్ లో ప్రియాంక చోప్రా పోస్టు చూస్తే ఇదే స్పష్టమవుతోంది. వారణాసిలో హీరోగా నటిస్తున్న మహేష్ బాబు, విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది.
ఎంతో గౌరవం
మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో దిగిన ఫొటోలను ప్రియాంక చోప్రా మంగళవారం ఇన్ స్టాలో పోస్టు చేసింది.
{{/usCountry}}మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో దిగిన ఫొటోలను ప్రియాంక చోప్రా మంగళవారం ఇన్ స్టాలో పోస్టు చేసింది.
{{/usCountry}}‘‘తెలుగు, మలయాళం ఇండస్ట్రీలకు చెందిన ఈ ఇద్దరు లెజెండ్లతో పనిచేయడం, అది కూడా రాజమౌళి సినిమా కోసం కలవడం నాకు దక్కిన గౌరవం. ఇప్పుడేమో మూవీ రిలీజ్ కు ఏడాది ముందే ఇంటర్నేషనల్ మీడియా ముందు సినిమాను ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ల రియాక్షన్స్, పెరుగుతున్న అంచనాలు ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. దేవుడి దయ వల్ల మీ అంచనాలను అందుకుంటాం. జై శ్రీరాం’’ అని క్యాప్షన్ లో పేర్కొంది ప్రియాంక చోప్రా.
రాజమౌళి ప్లాన్
లార్జర్ దేన్ లైఫ్ అనేలా సినిమాలు తీసే రాజమౌళి ప్రమోషన్లు కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ అయింది. వారణాసి సినిమా కోసం దీన్ని ఉపయోగించుకోవడానికి ఆయనకు ప్రియాంక చోప్రా ఓ ఆయుధంలా దొరికింది. ప్రియాంకాకు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. అందుకే ఆమె సాయంతో ఇంటర్నేషనల్ స్థాయిలో వారణాసి ప్రమోషన్లు ఇరగదీయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. ఈ సినిమా 2027 సమ్మర్ లో రిలీజ్ కానుంది.