బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రానికి స్పెషల్ గుర్తింపు దక్కింది. భారతీయ సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపించాడు. సినిమా స్థాయి, రచన, అందులోని భావోద్వేగ లోతును ఆయన ప్రత్యేకంగా కొనియాడాడు.
రాజమౌళి రివ్యూ

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధురంధర్ 2పై రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియాలో సుదీర్ఘమైన రివ్యూ పంచుకున్నాడు. "నేను ధురంధర్-1 ను ఎంతగానో ప్రేమించాను, కానీ 'ది రివెంజ్' దాని స్థాయి, ఆత్మ రెండింటిలోనూ అసలు సినిమాను మించిపోయింది" అని రాజమౌళి రాసుకొచ్చాడు.
గట్స్ ఉండాలి
‘‘సినిమా సాంకేతిక అంశాలు, నటీనటుల ఎంపిక, ప్రపంచ స్థాయి రూపకల్పనలో ఎలాంటి లోపం లేదు. నాలుగు గంటల సుదీర్ఘ నిడివి గల సినిమాను తీయడానికి గట్స్ ఉండాలి. డైరెక్టర్ ఆదిత్య ధర్ అదరగొట్టాడు. లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయారు’’ అని రాజమౌళి తన రివ్యూలో పేర్కొన్నాడు.
రణ్‌వీర్ నటనపై ప్రశంసలు
ధురంధర్ 2 హీరో రణ్‌వీర్ సింగ్ నటనను రాజమౌళి ఒక 'స్టాండౌట్' అని వర్ణించాడు. "ఏమి నటన మిత్రమా! షెడ్‌లో సోదరితో వచ్చే సన్నివేశం.. నటనలో ఒక మాస్టర్‌క్లాస్. ప్రారంభం నుంచి హృదయ విదారక క్లైమాక్స్ వరకు హమ్జా, జస్కిరాత్ పాత్రల్లో మమ్మల్ని మంత్రముగ్ధులను చేశావ్" అని రాజమౌళి కొనియాడాడు.
మాధవన్ కూడా
రణ్‌వీర్ తో పాటు ఆర్.మాధవన్ నటనను కూడా రాజమౌళి ప్రశంసించాడు. ఒక దేశపు నిస్సహాయతను ఆయన తన పాత్ర ద్వారా అద్భుతంగా పండించాడని రాజమౌళి పేర్కొన్నారు.
{{/usCountry}}రణ్‌వీర్ తో పాటు ఆర్.మాధవన్ నటనను కూడా రాజమౌళి ప్రశంసించాడు. ఒక దేశపు నిస్సహాయతను ఆయన తన పాత్ర ద్వారా అద్భుతంగా పండించాడని రాజమౌళి పేర్కొన్నారు.
{{/usCountry}}మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు రాజమౌళి కూడా 'ధురంధర్ 2' పై ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమా క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది.
ధురంధర్ 2 గురించి..
డిసెంబర్ 5, 2025లో ధురంధర్ మూవీ రిలీజైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ధురంధర్ 2 కూడా బాక్సాఫీస్ మోత మోగిస్తోంది. ఇందులో రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ తదితరులు నటించారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో ధురంధర్ 2 మూవీ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. పాకిస్థాన్ లోని అండర్ వరల్డ్ గ్యాంగ్ లో చేరి అక్కడి టెర్రరిస్టులను చంపేసే క్యారెక్టర్ లో రణ్‌వీర్ సింగ్ నటించాడు. మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.330 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.