...
...
Next Story

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో హారర్ థ్రిల్లర్- ఇవాళ ఫైనల్ ట్రైలర్ రిలీజ్- వెయ్యేళ్ల నాటి యుద్ధానికి ముగింపు- తెలుగులోనూ!

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ స్ట్రైంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న స్ట్రేంజర్ థింగ్స్ 5 ఫైనల్ ట్రైలర్‌ను ఓటీటీ సంస్థ ఇవాళ (డిసెంబర్ 30) విడుదల చేసింది.

Published on: Dec 30, 2025, 22:20:24 IST
Advertisement

దశాబ్ద కాలం పాటు హారర్, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things) ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. తాజాగా ఈ ఓటీటీ సిరీస్ చివరి ఎపిసోడ్ కోసం ‘ఒక ఆఖరి ట్రైలర్’ను విడుదల చేసింది.

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో హారర్ థ్రిల్లర్- ఇవాళ ఫైనల్ ట్రైలర్ రిలీజ్- వెయ్యేళ్ల నాటి యుద్ధానికి ముగింపు- తెలుగులోనూ!
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో హారర్ థ్రిల్లర్- ఇవాళ ఫైనల్ ట్రైలర్ రిలీజ్- వెయ్యేళ్ల నాటి యుద్ధానికి ముగింపు- తెలుగులోనూ!

హాకిన్స్ పట్టణంపై విరుచుకుపడుతున్న వెక్నాను అడ్డుకునేందుకు ఎలెవన్, ఆమె గ్యాంగ్ సిద్ధమైన తీరు చూస్తుంటే, ఈసారి పోరాటం ఊహకందని స్థాయిలో ఉండబోతోందని అర్థమవుతోంది.

గతాన్ని గుర్తుచేస్తూ.. భవిష్యత్తు కోసం పోరాటం

స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్‌ ట్రైలర్ గత ఐదు సీజన్లలోని మధుర జ్ఞాపకాలను, సాహసాలను నెమరువేసుకుంటూనే, రాబోయే భయంకరమైన యుద్ధాన్ని పరిచయం చేసింది. "నీ స్నేహితుల కోసం, రేపటి ఉదయం కోసం ఒక ఆఖరి సారి పోరాడు" అంటూ హాపర్ ఇచ్చే స్ఫూర్తిదాయకమైన మాటలు ఎలెవన్‌ను కదిలిస్తాయి.

మరోవైపు, డస్టిన్ ఆవేదనగా అరుస్తున్న దృశ్యాలు చూస్తుంటే, ఈసారి మనకు ఇష్టమైన పాత్రలలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతారేమో అన్న భయం అభిమానుల్లో నెలకొంది. ముఖ్యంగా 'స్టీవ్' పాత్రకు ఏమీ కాకూడదని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుకుంటున్నారు.

అభిమానుల భావోద్వేగం.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ భయం!

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3 క్లైమాక్స్ ఎపిసోడ్ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అయితే, అభిమానుల్లో ఒక చిన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. "దయచేసి ఈ సిరీస్ ముగింపు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లా నిరాశపరచకుండా ఉండాలి" అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పదేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి వీడ్కోలు పలకడం చాలా కష్టంగా ఉందంటూ మరికొందరు ఎమోషనల్ అవుతున్నారు.

దర్శకుల భరోసా.. ఆ ‘షాక్’ ఉండదు!

"కథ ఎక్కడ మొదలైందో అక్కడ సహజంగానే ముగింపు ఉంటుంది. ప్రేక్షకులకు ఇది ఒక సంతృప్తికరమైన వీడ్కోలు అవుతుంది" అని మాట్ డఫర్ తెలిపారు. కథ లీక్ అవ్వకుండా ఉండేందుకు చివరి ఎపిసోడ్ స్క్రిప్ట్‌ను ఎర్రటి కాగితాలపై ముద్రించి, పటిష్టమైన భద్రత మధ్య చిత్రీకరణ జరిపినట్లు ఆయన వెల్లడించారు.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు?

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 ఇప్పటికే క్రిస్మస్ (డిసెంబర్ 25) కానుకగా విడుదలై సందడి చేస్తోంది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఖరి ఎపిసోడ్ ‘ది రైట్ సైడ్ అప్’ (The Right Side Up), డిసెంబర్ 31న రాత్రి 8 గంటలకు (ET) స్ట్రీమింగ్ కానుంది.

మన దేశంలో అంటే భారతదేశంలో జనవరి 1, 2026 ఉదయం 6:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూమ్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ చివరి ఎపిసోడ్ నిడివిని కూడా పెంచి దాదాపు 2 గంటల 8 నిమిషాల పాటు సాగేలా ప్లాన్ చేశారు.

తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ ఫైనల్ ఎపిసోడ్‌తో సిరీస్‌లోని వెయ్యేళ్ల నాటి యుద్ధానికి ముగింపు పలుకుతున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే, ఈ సిరీస్ తెలుగులో కూడా ఓటీటీ రిలీజ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe