ఓటీటీలో పాపుల‌ర్ వెబ్‌సిరీస్ లాస్ట్ పార్ట్‌-చూపు తిప్పుకోనివ్వ‌ని హార‌ర్ ఫ్యాంట‌సీ థ్రిల్ల‌ర్-తెలుగులోనూ స్ట్రీమింగ్‌

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్. ఈ సిరీస్ లో లాస్ట్ సీజన్ అయిన సీజన్ 5లో లాస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇవాళ నుంచి ఈ హారర్ థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. 

Published on: Dec 26, 2025, 11:01:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ లాస్ట్ టైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ చివరి సీజన్ అయిన సీజన్ 5 వాల్యూమ్ 2 ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ పార్ట్ తో స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ కు ఎండ్ కార్డు పడింది.

ఓటీటీలో హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్ పార్ట్ 2 (IMDb)
ఓటీటీలో హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్ పార్ట్ 2 (IMDb)

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఓటీటీ

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (డిసెంబర్ 26) నుంచి ఇండియాలోని ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హిట్ షో చివరి సీజన్.. హాకిన్స్ బృందాన్ని, వారి బలమైన శత్రువు వెక్నాను తిరిగి తీసుకు వచ్చింది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇండియాలో ఇలా

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న విడుదలైంది. భారతదేశంలో మాత్రం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ రోల్ అవుట్‌కు అనుగుణంగా డిసెంబర్ 26న ఉదయం 6:30 గంటలకు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 విడుదలైంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2లో ఫేవరెట్ యాక్టర్స్ తో పాటు కొందరు కొత్త ముఖాలు కూడా కనిపిస్తున్నాయి. మిల్లీ బాబీ బ్రౌన్ ఎలెవెన్‌గా తిరిగి వస్తుంది. ఆమె ఈ కథకు గుండెకాయ వంటి శక్తివంతమైన సైకిక్. ఫిన్ వోల్ఫ్‌హార్డ్ మైక్ వీలర్‌గా, హాకిన్స్ బృందం అనధికారిక నాయకుడిగా కనిపిస్తున్నాడు.

పాజిటివ్ రివ్యూలు

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2పై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో మెజారిటీ నెటిజన్లు ఈ పార్ట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్ట్ చూసి వణికిపోయామని కామెంట్ పెడుతున్నారు. సిరీస్ అదిరిపోయిందని అంటున్నారు. పార్ట్ 2 ఓటీటీ ఆడియన్స్ కు థ్రిల్ పంచుతుంది.

"స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 మొదటి ఎపిసోడ్‌ను ఇప్పుడే చూశా. నేను వణికిపోతున్నా. మిగిలిన వాటిని ఇప్పుడే పూర్తి చేయబోతున్నా" అని ఓ యూజర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. "స్ట్రేంజర్ థింగ్స్ నిజంగా నేను అటాక్ ఆన్ టైటాన్ తర్వాత చూసిన అత్యుత్తమ షో" అని మరొకరు జోడించారు. "నేను ఆగలేకపోయాను. చివరి నుండి చూడటం ప్రారంభించాను. ఎపిసోడ్ 7 చివరిలో, నేను నిజంగా నా మనస్సును కోల్పోయాను. డఫర్ బ్రదర్స్ తమ వాగ్దానాన్ని నిజంగా నిలబెట్టుకున్నారు’’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More