...
...
Next Story

Sukumar Students: టాలీవుడ్‌పై సుకుమార్ శిష్యుల దండయాత్ర.. ‘సెకండ్ సినిమా’తోనే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్.. 2026 వాళ్లదే

Sukumar Students: 2026 ఇయర్ సుకుమార్ శిష్యులదే.. ఇదే ఇప్పుడు నెట్టింట వైరల్ గా సాగుతున్న చర్చ. ఇప్పటికే పెద్దితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు సాన. మరో ఇద్దరు సుకుమార్ శిష్యులు ఇదే ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Jun 5, 2026, 19:07:39 IST
Advertisement

Sukumar Students: దర్శకుడు సుకుమార్ గ్యారేజ్ నుంచి వచ్చిన ప్రతిభావంతులైన శిష్యులు ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమను శాసిస్తున్నారు. 2026 సంవత్సరం పూర్తిగా ఈ 'సుకుమార్ స్కూల్' దర్శకుల దండయాత్రకు వేదికగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ‘పెద్ది’తో ఇప్పటికే బుచ్చిబాబు అదరగొడుతున్నాడు.

సుకుమార్ శిష్యులు

టాలీవుడ్‌పై సుకుమార్ శిష్యుల దండయాత్ర.. ‘సెకండ్ సినిమా’తోనే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్
టాలీవుడ్‌పై సుకుమార్ శిష్యుల దండయాత్ర.. ‘సెకండ్ సినిమా’తోనే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్

మొదటి సినిమాలతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు సుకుమార్ శిష్యులు. ఈ యువ దర్శకులు, ఇప్పుడు తమ రెండో సినిమాలతోనే ఏకంగా వందల కోట్ల బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తూ బాక్సాఫీస్ వద్ద నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. వాళ్లే బుచ్చిబాబు సాన, కార్తీక్ దండు, శ్రీకాంత్ ఓదెల.

అయితే, కేవలం భారీ బడ్జెట్లే కాదు.. ఈ ముగ్గురు దర్శకుల వెనుక ఉన్న కంటెంట్ మేకింగ్ స్ట్రాటజీ, సుకుమార్ స్క్రీన్‌ప్లే మ్యాజిక్ టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

'పెద్ది'తో బుచ్చిబాబు సాన మాస్ జాతర

'ఉప్పెన' లాంటి ప్యూర్ లవ్ స్టోరీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు సాన.. తన రెండో చిత్రంగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో 'పెద్ది' (Peddi) అనే భారీ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోలోకి వచ్చి భారీ ఓపెనింగ్స్ సాధించింది.

బ్లాక్ బస్టర్

తొలి చిత్రం 'దసరా'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు తన రెండో చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise)తో బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్లమ్స్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో నాని 'జడల్' అనే సరికొత్త రస్టిక్ అండ్ మాస్ రోల్‌లో నటిస్తున్నాడు.

ఆ టేకింగ్

ఈ ఏడాది ఆగస్టు 21న విడుదల కానున్న ప్యారడైజ్ సినిమా క్లైమాక్స్‌ను మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంతో ఇంటర్‌లింక్ చేస్తూ ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్‌ను శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేస్తుండటం విశేషం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 'ది ప్యారడైజ్' క్లైమాక్స్ లీడ్ సీన్ కోసమే దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. లోకల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలను గ్లోబల్ స్టాండర్డ్స్‌లో చూపించడంలో సుకుమార్ మార్క్ టేకింగ్ శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్‌లో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

కార్తీక్ దండు మిస్టరీ అడ్వెంచర్

'విరూపాక్ష' లాంటి సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్‌తో దర్శకుడిగా నిరూపించుకున్న కార్తీక్ దండు, తన రెండో ప్రయత్నంగా 'వృషకర్మ' (Vrushakarma) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యువ సామ్రాట్ నాగచైతన్య, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సుకుమార్ శిక్షణ

సుకుమార్ అందించిన శిక్షణ, కథను నడిపించే శైలిని తమ సొంతం చేసుకున్న ఈ ముగ్గురు దర్శకులు 2026లో టాలీవుడ్ జెండాను పాన్ ఇండియా స్థాయిలో ఎగరవేస్తున్నారు. గురువును మించిన శిష్యులుగా వీరు సాధిస్తున్న విజయాలు తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాయి.

People Also Ask (FAQ)

  1. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా దర్శకుడు ఎవరు?

రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘పెద్ది’ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించాడు. ఆయనకు ఇది రెండో సినిమా.

2. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న కొత్త సినిమా ఏది?

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘ది ప్యారడైజ్’.

3. కార్తీక్ దండు, నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పేరేమిటి?

కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మైథికల్ విజువల్ వండర్ చిత్రం పేరు ‘వృషకర్మ’.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe