Sunny Deol About Netflix OTT Debut: బాక్సాఫీస్ దగ్గర 'గదర్ 2', 'బోర్డర్ 2', 'జాట్' సినిమాలతో భారీ యాక్షన్ సునామీ సృష్టించిన బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఓటీటీ ప్రపంచంలోనూ తన మార్కు చూపిస్తున్నారు.
ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డు హిట్లు ఇచ్చిన సన్నీ డియోల్.. డైరెక్టర్ సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇక్కా' చిత్రంతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషించిన ఈ కోర్ట్ లీగల్ డ్రామా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
అయితే, ఇక్కా సినిమా ఒప్పుకునే క్రమంలో సన్నీ డియోల్ మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ రుచికా కపూర్ షేక్ ఇటీవల వెల్లడించారు.
యాక్షన్ సీన్లు లేకపోతే జనం చూస్తారా?
సినీ కెరీర్ ప్రారంభం నుంచి సన్నీ డియోల్ అంటేనే భారీ డైలాగులు, పవర్‌ఫుల్ ఫైట్లు, శత్రువులను అల్లకల్లోలం చేసే సీన్లు గుర్తుకొస్తాయి. 'గదర్' సినిమాలో హ్యాండ్ పంప్ పీకే సన్నివేశం నుంచి ఇటీవలి మాస్ చిత్రాల వరకు ఆయన ఇమేజ్ అదే. అలాంటిది అసలు ఒక్క యాక్షన్ సీన్ కూడా లేని కోర్టురూమ్ డ్రామాలో నటించడానికి సన్నీ మొదట జంకారని రుచికా గుర్తు చేసుకున్నారు రుచికా.
"సన్నీ సర్ 'ఇక్కా' కథ విన్నప్పుడు ఇందులో ఒక్క యాక్షన్ సీన్ కూడా లేదు కదా అని ఆందోళన చెందారు" అని రుచికా తెలిపారు. "ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇచ్చే గొప్ప అవకాశమే అది. ప్రేక్షకులు ఇష్టపడే కోర్టురూమ్ డ్రామాలో మిమ్మల్ని కొత్తగా చూపిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని ధైర్యం చెప్పాను" అని ఆమె వివరించారు. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో రెండు నెలల తర్వాత తేలిపోతుందని ఆయనకు నచ్చజెప్పినట్లు రుచికా కపూర్ షేక్ చెప్పారు.
68 ఏళ్ల వయసులో 'డెబ్యూ' ఏంటి?
{{/usCountry}}"సన్నీ సర్ 'ఇక్కా' కథ విన్నప్పుడు ఇందులో ఒక్క యాక్షన్ సీన్ కూడా లేదు కదా అని ఆందోళన చెందారు" అని రుచికా తెలిపారు. "ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇచ్చే గొప్ప అవకాశమే అది. ప్రేక్షకులు ఇష్టపడే కోర్టురూమ్ డ్రామాలో మిమ్మల్ని కొత్తగా చూపిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని ధైర్యం చెప్పాను" అని ఆమె వివరించారు. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో రెండు నెలల తర్వాత తేలిపోతుందని ఆయనకు నచ్చజెప్పినట్లు రుచికా కపూర్ షేక్ చెప్పారు.
68 ఏళ్ల వయసులో 'డెబ్యూ' ఏంటి?
{{/usCountry}}వెండితెరపై దశాబ్దాలుగా తిరుగులేని స్టార్‌గా వెలిగిన హీరో ఓటీటీలోకి అడుగుపెట్టడం సాధారణ విషయమేమీ కాదు. సన్నీ డియోల్‌ను డిజిటల్ ఎంట్రీకి ఒప్పించడం వెనుక పెద్ద కసరత్తే జరిగింది.
"మేము ఆయనతో ఓటీటీ 'డెబ్యూ' గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన బిగ్గరగా నవ్వేసేవారు. నాకు దాదాపు 60 ఏళ్లకు పైగా వయసొచ్చింది, ఇప్పుడు డెబ్యూ అంటారేంటి అని సరదాగా వ్యాఖ్యానించేవారు" అని రుచికా కపూర్ షేక్ పేర్కొన్నారు.
'బోర్డర్ 2' వంటి భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్న సమయంలో ఓటీటీ సినిమా అవసరమా అని సన్నీ డియోల్ తొలుత అనుమానించినా, చివరికి బృందం నమ్మకాన్ని గౌరవించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. "మీ నమ్మకానికే నా ఓటు, ఈ సినిమా కోసం నా వంద శాతం కష్టపడతాను" అని సన్నీ డియోల్ తమతో చెప్పినట్లు రుచికా వెల్లడించారు.
కొత్తదనానికే పట్టంగట్టిన ప్రేక్షకులు
సినిమా అంటే కేవలం రొటీన్ మాస్ ఎలిమెంట్లే కాకుండా, సరికొత్త తరహాలో కథను చెబితే ఆదరిస్తారని 'ఇక్కా' నిరూపించింది. జులై 10న నెట్‌ఫ్లిక్స్‌లో ఇక్కా ఓటీటీ రిలీజ్ కాగా అప్పటి నుంచి ఇప్పటివరకు విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోలను వారి రెగ్యులర్ ఇమేజ్‌కు భిన్నంగా చూపిస్తూనే, సస్పెన్స్ డ్రామాతో ముందుకు తీసుకెళ్లడమే ఈ సినిమా విజయానికి కారణమని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.