Samay Raina: దివ్యాంగులపై జోకులు.. సమయ్ రైనాతోపాటు మరో నలుగురి కమెడియన్ల కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే?

Supreme Court Quashes Samay Raina Case: స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇండియాస్ గాట్ లేటెంట్ ఓటీటీ షోలో దివ్యాంగులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సమయ్ రైనాతోపాటు మరో నలుగురు కమెడియన్లపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది భారత ఉన్నత న్యాయస్థానం.

Published on: Aug 14, 2026, 17:03:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Supreme Court Quashes Samay Raina Case: ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాకు అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఉపశమనం లభించింది. 'ఇండియాస్ గాట్ లేటెంట్' అనే ఓటీటీ కామెడీ షో వేదికగా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) బాధితులు, దివ్యాంగుల ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నమోదైన క్రిమినల్ కేసులను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

దివ్యాంగులపై జోకులు.. సమయ్ రైనాతోపాటు మరో నలుగురి కమెడియన్ల కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే?
దివ్యాంగులపై జోకులు.. సమయ్ రైనాతోపాటు మరో నలుగురి కమెడియన్ల కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే?

సమయ్ రైనాతోపాటు నలుగురు కమెడియన్లకు

శుక్రవారం (ఆగస్ట్ 14) నాటి విచారణలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. సమయ్ రైనాతో పాటు మరో నలుగురు కమెడియన్లు విపుల్ గోయల్, బలరాజ్ పరమ్‌జీత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్, నిషాంత్ జగదీష్ తన్వర్‌లపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కోర్టు రద్దు చేసింది.

తప్పుదిద్దుకునే ప్రయత్నం ఫలించింది!

గత నెలలో జరిగిన విచారణ సమయంలో ధర్మాసనం ఈ ఐదుగురు కమెడియన్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారనే కారణంతో ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది. "ఇది అహంకారం కాకపోతే, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలోనే దీనికి కొత్త అర్థం వెతకాల్సి ఉంటుంది" అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

విరాళాలు సేకరించడం

అయితే ఆ తర్వాత కమెడియన్లు తమ వైఖరిని మార్చుకుని, బాధితుల పట్ల పశ్చాత్తాపం ప్రదర్శించారు. SMA బాధిత సంస్థ 'క్యూర్ SMA ఫౌండేషన్' ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. మార్చిలో దివ్యాంగుల కోసం ఒక చెస్ టోర్నమెంట్ నిర్వహించి, దాని ద్వారా విరాళాలు సేకరించడంతో పాటు సమాజంలో అవగాహన పెంచేందుకు కృషి చేశారు.

మంచి మార్గంలో అడుగులు వేస్తే

"యువకులు సానుకూల దృక్పథంతో మంచి మార్గంలో అడుగులు వేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. వీరంతా చాలా ప్రతిభావంతులు" అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ సందర్భంగా కొనియాడారు.

డిజిటల్ కంటెంట్‌పై కీలక దిశానిర్దేశం

కమెడియన్లపై ఉన్న కేసులను కొట్టేసినప్పటికీ, ఓటీటీలో వస్తున్న కంటెంట్ నాణ్యత, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ అనే ప్రధాన అంశాన్ని సుప్రీంకోర్టు ఇంకా పెండింగ్‌లోనే ఉంచింది. సోషల్ మీడియా లేదా యూట్యూబ్ వేదికలపై మాట్లాడే స్వేచ్ఛ వేరు, ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం వేరు అని ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఆ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే

ఈ క్రమంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్ర అధ్యయనం చేసి, ఆన్‌లైన్ కంటెంట్‌పై ఎలాంటి మార్గదర్శకాలు తెస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని పిటిషనర్లను, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణీని కోర్టు ఆదేశించింది. వాక్‌స్వాతంత్య్రానికి, వ్యక్తిగత ఆత్మగౌరవానికి మధ్య సమతుల్యత సాధించడమే తమ ప్రధాన ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సమయ్ రైనా ఓటీటీ షో

ఇదిలా ఉంటే, ఇండియాస్ గాట్ లాటెంట్ సీజన్ 2 ఇప్పుడు ప్రసారం అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాస్ గాట్ లాటెంట్ 2 ఓటీటీ రిలీజ్ కావడంతోపాటు యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది. సమయ్ రైనా హోస్ట్‌గా చేస్తున్న ఇండియాస్ గాట్ లాటెంట్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 20 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More